Petrol-Diesel Price, 4 November: గుడ్‌న్యూస్.. కేంద్రం నిర్ణయంతో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గుదల
హైదరాబాద్ నగరంలో నేడు పెట్రోల్ ధర లీటరుకు రూ.6.29 తగ్గి రూ.108.20 అయింది. అంతకుముందు రూ.114కు పైగా ఉంది. డీజిల్ ధర లీటరుకు తాజాగా రూ.12.79 తగ్గించారు.
కొద్ది రోజులుగా ఇంధన ధరలు మన దేశంలో క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. కానీ, తాజాగా కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో పెట్రోల్, డీజిల్ ధరలు కాస్త ఎక్కువగానే తగ్గాయి. తగ్గిన ఇంధన ధరలు హైదరాబాద్‌లో ఈ విధంగా ఉన్నాయి.
హైదరాబాద్ నగరంలో నేడు పెట్రోల్ ధర లీటరుకు రూ.6.29 తగ్గి రూ.108.20 అయింది. అంతకుముందు రూ.114కు పైగా ఉంది. డీజిల్ ధర లీటరుకు తాజాగా రూ.12.79 తగ్గించారు. దీంతో ధర రూ.94.61గా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోని ఇతర నగరాల్లో కూడా తగ్గిన ధరలు అమల్లోకి రానున్నాయి.
Also Read: MG Astor: ఎంజీ ఆస్టర్ డెలివరీలు ప్రారంభం.. ఇప్పుడు బుక్ చేస్తే ఎప్పుడు వస్తుందో తెలుసా?
ఇంధన ధరలు తగ్గించిన రాష్ట్రాలివే..
ఇంధన ధరలపై కేంద్రం పన్నులు తగ్గించిన నేపథ్యంలో వివిధ రాష్ట్రాలు కూడా వ్యాట్‌ను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. ముఖ్యంగా ఎన్నికలు ఉన్న రాష్ట్రాల్లో ఈ తగ్గింపు కాస్త ఎక్కువగా ఉంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను రూ.12 మేర తగ్గిస్తున్నట్లు యూపీ సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. పెట్రోల్, డీజిల్‌పై రూ.7 చొప్పున వ్యాట్ తగ్గిస్తున్నట్లుగా గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ట్విటర్ వేదికగా తెలిపారు.
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ కూడా పెట్రోల్, డీజిల్‌పై రూ.7 చొప్పున వ్యాట్‌ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్ కూడా రూ.7 చొప్పున పన్నును తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్‌సింగ్ తమంగ్, మణిపుర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ కూడా రూ.7 చొప్పున వ్యాట్‌ను తగ్గిస్తున్నట్లు ప్రకటన చేశారు. కేంద్రం విజ్ఞప్తితో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై రూ.7 రూపాయల చొప్పున వ్యాట్‌ను తగ్గించాలని నిర్ణయించారు. గుజరాత్‌లో పెట్రోల్, డీజిల్‌పై రూ.7 చొప్పున వ్యాట్ తగ్గిస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎంవో తెలిపింది. ఉత్తరాఖండ్‌లో పెట్రోల్‌పై వ్యాట్‌ను రూ.2 తగ్గిస్తున్నట్లు సీఎం పుష్కర్ సింగ్ ధామీ తెలిపారు. పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్‌ను తగ్గిస్తామని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది.
Also Read: Gold-Silver Price: దీపావళి వేళ భారీగా తగ్గిన పసిడి.. వెండి కూడా.. ఏకంగా రూ.1,300 తగ్గుదల
Also Read: TVS Raider: కొత్త బైక్ వచ్చేసింది.. రూ.80 వేలలో బెస్ట్.. అదిరిపోయే లుక్, ఫీచర్లు!