News
News
X

Petrol-Diesel Price, 31 January: వాహనదారులకు షాక్! నేడు భారీగా పెరిగిన ఇంధన ధరలు.. రోజురోజుకీ ఎగబాకుతున్న క్రూడాయిల్ ధర

హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు గత కొద్ది వారాలుగా నిలకడగానే ఉంటున్నాయి. నేడు కూడా పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20గా.. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 గా నిలకడగానే కొనసాగుతోంది.

FOLLOW US: 

గత మూడు నెలల క్రితం వరకూ ఇంధన ధరలు మన దేశంలో క్రమంగా ఎగబాకుతూ వచ్చి జీవితకాల గరిష్ఠాన్ని చేరాయి. కానీ, కొద్ది నెలల క్రితం కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో పెట్రోల్, డీజిల్ ధరలు కాస్త తగ్గాయి. ఈ తగ్గిన ధరలతో వాహనదారులు కొద్దిగా ఊరట చెందుతున్నారు. అయితే, మళ్లీ ముడి చమురు ధరలు ప్రస్తుతం 83 డాలర్ల మార్కును దాటాయి. దీంతో మళ్లీ ధరలు పెరుగుతాయోననే ఆందోళన నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు నేడు ఇలా ఉన్నాయి.

తెలంగాణలో..
హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు గత కొద్ది వారాలుగా నిలకడగానే ఉంటున్నాయి. నేడు కూడా పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20గా.. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 గా నిలకడగానే కొనసాగుతోంది. ఇక వరంగల్‌లోనూ గత నాలుగు రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగానే ఉంటున్నాయి. నేడు (జనవరి 31) పెట్రోల్ ధర రూ.107.69 గానే కొనసాగుతోంది. డీజిల్ ధర రూ.94.14 గా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.

నిజామాబాద్‌లో ఇంధన ధరలు నేడు కాస్త తగ్గాయి. పెట్రోల్ ధర లీటరుకు నేడు రూ.0.72 పైసలు పెరిగి రూ.110.46 గా ఉంది. డీజిల్ ధర రూ.0.67 పైసలు పెరిగి రూ.96.72 గా ఉంది. గత కొన్ని రోజులుగా నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా కనిపిస్తుండగా తాజాగా పెరిగాయి.

ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.0.10 పైసలు పెరిగి రూ.110.61గా ఉంది. డీజిల్ ధర బెజవాడలో రూ.0.09 పైసలు పెరిగి రూ.96.68 గా ఉంది.

ఇక విశాఖపట్నం మార్కెట్‌లో పెట్రోల్ ధర నేడు పెరిగింది. లీటరు ధర రూ.0.17 పైసలు పెరిగి రూ.109.22 గా ఉంది. డీజిల్ ధర రూ.0.16 పైసలు పెరిగి రూ.95.34గా ఉంది. అయితే, ఇక్కడి కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.

తిరుపతిలో స్థిరంగా ధరలు.. 
తిరుపతిలో ఇంధన ధరలు నేడు పెరిగాయి. ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర రూ.0.32 పైసలు పెరిగి రూ.111.31 వద్ద ఉంది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి. ఇక డీజిల్ ధర తాజాగా రూ.0.29 పైసలు పెరిగి రూ.97.27 కి చేరింది.

ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.30 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా జనవరి 31 నాటి ధరల ప్రకారం 88.01 డాలర్ల వద్ద ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఆ పెంచిన పన్నులను తగ్గించలేదు. అందుకే ఇంధన ధరలు మన దేశంలో జీవితాల గరిష్ఠానికి చేరుతూ సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. తాజాగా సుంకాన్ని స్వల్పంగా తగ్గించడం ద్వారా రూ.5 నుంచి రూ.10 మేర ఇంధన ధరలు తగ్గాయి.

Published at : 31 Jan 2022 07:07 AM (IST) Tags: Petrol Price Diesel Price Fuel Cost Petrol Diesel Price Today Hyderabad Petrol Price Telangana Petrol Price Andhra Pradesh Petrol Prices

సంబంధిత కథనాలు

Cryptocurrency Prices: అనూహ్య నష్టాల్లో బిట్‌కాయిన్‌! క్రిప్టోలన్నీ నేల చూపులే!

Cryptocurrency Prices: అనూహ్య నష్టాల్లో బిట్‌కాయిన్‌! క్రిప్టోలన్నీ నేల చూపులే!

Stock Market Closing: ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు! 60K పైనే సెన్సెక్స్‌, 18Kకు స్వల్ప దూరంలో నిఫ్టీ

Stock Market Closing: ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు! 60K పైనే సెన్సెక్స్‌, 18Kకు స్వల్ప దూరంలో నిఫ్టీ

Top Loser Today August 17, 2022 స్టాక్‌ మార్కెట్‌ సెన్సెక్స్‌, నిఫ్టీ టాప్‌ లాసర్స్‌ జాబితా

Top Loser Today August 17, 2022 స్టాక్‌ మార్కెట్‌ సెన్సెక్స్‌, నిఫ్టీ టాప్‌ లాసర్స్‌ జాబితా

టాప్‌ గెయినర్స్‌ August 17, 2022 : స్టాక్‌ మార్కెట్లో సెన్సెక్స్‌, నిఫ్టీ టాప్‌ గెయినర్స్‌

టాప్‌ గెయినర్స్‌ August 17, 2022 : స్టాక్‌ మార్కెట్లో సెన్సెక్స్‌, నిఫ్టీ టాప్‌ గెయినర్స్‌

RBI on Payment Systems: గూగుల్‌ పే, ఫోన్‌ పే, పేటీఎం లావాదేవీలపై ఛార్జీలు! ఆర్బీఐ సర్వే!

RBI on Payment Systems: గూగుల్‌ పే, ఫోన్‌ పే, పేటీఎం లావాదేవీలపై ఛార్జీలు! ఆర్బీఐ సర్వే!

టాప్ స్టోరీస్

iPhone 14: ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ తేదీ లీక్ - నెల కూడా లేదుగా!

iPhone 14: ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ తేదీ లీక్ - నెల కూడా లేదుగా!

Harish Rao : అప్పట్లో పొగడ్తలు ఇప్పుడు విమర్శలా ? - షెకావత్‌కు హరీష్ కౌంటర్ !

Harish Rao :  అప్పట్లో పొగడ్తలు ఇప్పుడు విమర్శలా ?  -  షెకావత్‌కు హరీష్ కౌంటర్ !

WhatsApp New Feature: వాట్సాప్‌లో డిలీట్ అయిన మెసేజ్‌లను మళ్లీ చూడొచ్చు.. ఎలాగో తెలుసా?

WhatsApp New Feature: వాట్సాప్‌లో డిలీట్ అయిన మెసేజ్‌లను మళ్లీ చూడొచ్చు.. ఎలాగో తెలుసా?

Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు 

Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు