By: ABP Desam | Updated at : 29 Sep 2021 07:06 AM (IST)
Edited By: Venkateshk
ప్రతీకాత్మక చిత్రం
దేశంలో ప్రధాన మెట్రో నగరాల్లోనూ ఇంధన ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. తెలంగాణలో మాత్రం హైదరాబాద్, వరంగల్ నగరాల్లో కొద్ది రోజులుగా స్థిరంగా ఉన్న ధరల్లో తాజాగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
తెలంగాణలో సెప్టెంబరు 29న పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..
హైదరాబాద్‌లో పెట్రోల్ ధర తాజాగా రూ.0.22 పైసలు పెరిగి రూ.105.48 అయింది. డీజిల్ ధర రూ.0.28 పైసలు పెరిగి రూ.97.74 గా ఉంది. ఇక వరంగల్‌లో తాజాగా పెట్రోల్ ధర రూ.105.17గా ఉంది. డీజిల్ ధర రూ.0.38 పైసలు పెరిగి రూ.97.44 గా ఉంది. వరంగల్‌లో గత కొన్ని రోజులుగా నిలకడగా ధరలు ఉంటుండగా.. తాజాగా స్వల్పంగా పెరిగాయి. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.
కరీంనగర్‌లో పెట్రోల్ ధర ముందు రోజు ధరతో పోలిస్తే రూ.0.44 పైసలు పెరిగి రూ.105.65గా ఉంది. డీజిల్ ధర రూ.0.47 పైసలు పెరిగి రూ.97.88కు చేరింది. నిజామాబాద్‌లో పెట్రోల్ ధర స్వల్పంగా పెరిగింది. పెట్రోల్ ధర రూ.0.22 పైసలు పెరిగి రూ.107.56 గా ఉంది. డీజిల్ ధర గత ధరతో పోల్చితే రూ.0.27 పైసలు పెరిగి రూ.99.67 గా ఉంది. గత కొన్ని రోజులుగా ఇక్కడ ఇంధన ధరల్లో ఎక్కువగానే హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
ఇక విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.107.54 గా ఉంది. డీజిల్ ధర రూ.99.25కు చేరింది. అయితే, అమరావతి ప్రాంతంలో గత పది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చు తగ్గులు నమోదవుతున్నాయి.
విశాఖపట్నం ఇంధన మార్కెట్‌లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.107.54గా ఉంది. గత ధరతో పోలిస్తే రూ.0.05 పైసలు పెరిగింది. డీజిల్ ధర విశాఖపట్నంలో రూ.98.51కు పెరిగింది. విశాఖలో కూడా కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో సరాసరిన రూ.0.50 పైసలకు పైబడి హెచ్చు తగ్గులు ఉంటున్నాయి.
తిరుపతిలో ఇంధన ధరల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది. లీటరు పెట్రోలు ధర ప్రస్తుతం రూ.0.05 పైసలు పెరిగి రూ.107.54 కు చేరింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో పెరుగుదల కనిపిస్తుంది. ఇక డీజిల్ ధర రూ.99.41గా ఉంది.
Also Read: ఆ హెరాయిన్ తో విజయవాడకు సంబంధం లేదు... ఏపీ డీజీపీ కీలక ప్రకటన... వాస్తవాలు మాట్లాడాలని నేతలకు హితవు
ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.33 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా సెప్టెంబరు 29 నాటి ధరల ప్రకారం 74.45 డాలర్ల వద్ద ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు మాత్రం ఆ పెంచిన పన్నులను తగ్గించలేదు. అందుకే ఇంధన ధరలు మన దేశంలో జీవితాల గరిష్ఠానికి చేరుతూ సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
Also Read: పోలీసుల అత్సుత్సాహం... డెలివరికి వెళ్తున్న గర్భిణీ కారును 40 నిమిషాలు నిలిపేసిన ఖాకీలు..!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్ చేయండి
World Costliest Car: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు - ఏకంగా రూ.1108 కోట్లు - దీని ప్రత్యేక ఏంటంటే?
Petrol Diesel Prices down: పెట్రోల్‌పై రూ.9.5, డీజిల్‌పై రూ.7 తగ్గింపు - గుడ్‌న్యూస్ చెప్పిన నిర్మలమ్మ
Stock Market Weekly Review: గతవారం నష్టంతో పోలిస్తే రూ.10 లక్షల కోట్లు మిగిలినట్టే!
Mahindra Scorpio N: కొత్త మహీంద్రా స్కార్పియో లాంచ్ అయ్యేది అప్పుడే - ప్రకటించిన కంపెనీ!
Cooking Oil Prices: గుడ్ న్యూస్! జూన్ నుంచి తగ్గనున్న వంట నూనె ధరలు
MI Vs DC Highlights: ముంబై గెలిచింది - బెంగళూరు నవ్వింది - ఐదు వికెట్లతో ఓడిన ఢిల్లీ!
Bindu Madhavi: ‘బిగ్ బాస్ తెలుగు’ హిస్టరీలో తొలిసారి - విజేతగా లేడీ కంటెస్టెంట్, బిందు సరికొత్త రికార్డ్
YS Jagan Davos Tour: దావోస్ చేరుకున్న ఏపీ సీఎం జగన్‌కు ఘన స్వాగతం, రేపు డబ్ల్యూఈఎఫ్‌తో కీలక ఒప్పదం
Bigg Boss Telugu: ‘బిగ్ బాస్’ లైవ్ అప్డేట్స్: ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ విన్నర్ బిందు మాధవి