By: ABP Desam | Updated at : 28 Sep 2021 09:35 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
గర్భిణీ ప్రయాణిస్తున్న కారును నిలిపివేసిన పోలీసులు(ప్రతీకాత్మక చిత్రం)
పోలీసుల అత్సుత్సాహం ఓ గర్భిణీకి ప్రాణాల మీదకు తెచ్చింది. వాహన తనిఖీలు నిర్వహించిన పోలీసులు పెండింగ్ చలాన్లు ఉన్నాయని డెలివరి కోసం వెళ్తోన్న మహిళ కారుకు ఆపేశారు. 40 నిమిషాలు పాటు కారును రహదరిపైనే నిలిపివేశారు. ఆ మహిళ వేధనను సైతం పట్టించుకోకుండా కారును నిలిపివేశారన్నారు. మెదక్ జిల్లా అల్లదుర్గంలో చోటుచేసుకున్న ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
Also Read: పోలీస్ స్టేషన్ లో ప్రేమ పంచాయితీ... తల్లిదండ్రులకు కౌన్సెలింగ్... కానీ
చలాను చెల్లించాలని పట్టుబట్టిన పోలీసులు
మెదక్ జిల్లా నారాయణఖేడ్ చెందిన శిల్ప అనే మహిళకు నెలలు నిండి డెలివరి కోసం ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు కుటుంబసభ్యులు. నారాయణఖేడ్ నుంచి మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి ఆమెను తరలిస్తున్నారు. మార్గ మధ్యలో అల్లదుర్గం వద్ద పోలీసులు వాహనా తనిఖీలు చేపట్టారు. వాహనంపై పెండింగ్ చలాన్లు ఉన్నాయని వాటిని వెంటనే చెల్లించాలని పోలీసులు కారు డ్రైవర్‌కు తెలిపారు. తన వద్ద నగదు లేదని ఆన్లైన్ పేమెంట్ చేస్తానని డ్రైవర్‌తో పాటు గర్భిణీ కుటుంబ సభ్యులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు పట్టించుకోలేదు. డబ్బులు కడితేనే వదులుతామని కారును నిలిపివేశారు.
Also Read: క్రికెట్ బెట్టింగ్ కు యువకుడు బలి... నెల్లూరు జిల్లాలో పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య
ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా...!
దీంతో గర్భిణీ కుటుంబసభ్యులు చలాన్లు చెల్లించేందుకు అంగీకరించారు. అయితే నెట్‌వర్క్ ఇష్యూతో చలాను చెల్లింపు కోసం దాదాపు 40 నిమిషాల ఆగాల్సివచ్చింది. అప్పటి వరకూ రహదారిపైనే ఆ కారును పోలీసులు నిలిపివేశారు. గర్భిణీ అయిన శిల్ప వేధనతో తల్లడిల్లుతున్నా పోలీసులు కరగలేదు. ఈ 40 నిమిషాల్లో మహిళకు ఏమైనా జరగరానిది జరిగి ఉంటే పరిస్థితి ఏమిటంటూ కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. మెడికల్ రిపోర్టుల కోసం పోలీసులు అడగలేదని, గర్భిణీ బంధువులు కూడా చూపలేదని డ్రైవర్ తెలిపారు. చివరికి 40 నిమిషాలు తర్వాత కూడా నెట్‌వర్క్ ప్రాబ్లమ్ పరిష్కారం కాకపోవడంతో పోలీసులు వాహనాన్ని వదిలిపెట్టారు. అల్లదుర్గం పోలీసుల తీరును చూసి స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా అంటూ మండిపడుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు స్పందించాల్సి ఉంది.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
KCR Delhi Schools : తెలంగాణలోనూ ఢిల్లీ విద్యా విధానం - కేజ్రీవాల్‌పై కేసీఆర్ ప్రశంసల జల్లు !
Breaking News Live Updates : తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్: ఎమ్మెల్సీ కవిత
BegumBazar Honor Killing: పరువుహత్యకు గురైన నీరజ్ పన్వార్ మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి, ఫ్యామిలీకి డెడ్‌బాడీ అప్పగింత
KTR London Tour : తెలంగాణ అభివృద్ధికి కలిసి రావాలి- ఎన్నారైలకు మంత్రి కేటీఆర్ పిలుపు
Bhadrachalam ఎక్సైజ్ పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన కారు - పోలీసుల ఛేజింగ్‌తో చివరకు ఊహించని ట్విస్ట్
MI Vs DC Highlights: ముంబై గెలిచింది - బెంగళూరు నవ్వింది - ఐదు వికెట్లతో ఓడిన ఢిల్లీ!
Bindu Madhavi: ‘బిగ్ బాస్ తెలుగు’ హిస్టరీలో తొలిసారి - విజేతగా లేడీ కంటెస్టెంట్, బిందు సరికొత్త రికార్డ్
YS Jagan Davos Tour: దావోస్ చేరుకున్న ఏపీ సీఎం జగన్‌కు ఘన స్వాగతం, రేపు డబ్ల్యూఈఎఫ్‌తో కీలక ఒప్పదం
Bigg Boss Telugu: ‘బిగ్ బాస్’ లైవ్ అప్డేట్స్: ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ విన్నర్ బిందు మాధవి