By: ABP Desam | Updated at : 28 Sep 2021 07:46 AM (IST)
Edited By: Venkateshk
ప్రతీకాత్మక చిత్రం
దేశంలో ప్రధాన మెట్రో నగరాల్లోనూ ఇంధన ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. తెలంగాణలో మాత్రం హైదరాబాద్, వరంగల్ నగరాల్లో కొద్ది రోజులుగా స్థిరంగా ఉన్న ధరల్లో స్వల్ప వ్యత్యాసం కనిపించింది.
తెలంగాణలో సెప్టెంబరు 28న పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..
హైదరాబాద్‌లో పెట్రోల్ ధర తాజాగా రూ.0.16 పైసలు పెరిగి రూ.105.26 అయింది. డీజిల్ ధర రూ.0.11 పైసలు పెరిగి రూ.97.46 గా ఉంది. ఇక వరంగల్‌లో తాజాగా పెట్రోల్ ధర రూ.104.83గా ఉంది. డీజిల్ ధర రూ.0.33 పైసలు పెరిగి రూ.97.06 గా ఉంది. వరంగల్‌లో గత కొన్ని రోజులుగా నిలకడగా ధరలు ఉంటుండగా.. తాజాగా స్వల్పంగా పెరిగాయి. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.
కరీంనగర్‌లో పెట్రోల్ ధర ముందు రోజు ధరతో పోలిస్తే రూ.0.44 పైసలు తగ్గి రూ.105.21గా ఉంది. డీజిల్ ధర రూ.0.11 పైసలు తగ్గి రూ.97.41కు చేరింది. నిజామాబాద్‌లో పెట్రోల్ ధర స్వల్పంగా పెరిగింది. పెట్రోల్ ధర రూ.0.24 పైసలు పెరిగి రూ.107.34 గా ఉంది. డీజిల్ ధర గత ధరతో పోల్చితే రూ.0.50 పైసలు పెరిగి రూ.99.40 గా ఉంది. గత కొన్ని రోజులుగా ఇక్కడ ఇంధన ధరల్లో ఎక్కువగానే హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
ఇక విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.107.49 గా ఉంది. డీజిల్ ధర రూ.99.14కు చేరింది. అయితే, అమరావతి ప్రాంతంలో గత పది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చు తగ్గులు నమోదవుతున్నాయి.
విశాఖపట్నం ఇంధన మార్కెట్‌లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.106.32గా ఉంది. గత ధరతో పోలిస్తే ఏకంగా రూ.0.31 పైసలు పెరిగింది. డీజిల్ ధర విశాఖపట్నంలో రూ.98.03కు తగ్గింది. విశాఖలో కూడా కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో సరాసరిన రూ.0.50 పైసలకు పైబడి హెచ్చు తగ్గులు ఉంటున్నాయి.
Also Read: RBL Bank Penalized: ఆర్‌బీఎల్ బ్యాంకుకు ఆర్‌బీఐ షాక్.. రూ.2 కోట్ల జరిమానా!
తిరుపతిలో బాగా స్వల్ప తగ్గుదల
తిరుపతిలో ఇంధన ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది. లీటరు పెట్రోలు ధర ప్రస్తుతం రూ.0.29 పైసలు తగ్గి రూ.107.69 కు చేరింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో పెరుగుదల కనిపిస్తుంది. ఇక డీజిల్ ధర రూ.99.30గా ఉంది.
ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.33 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా సెప్టెంబరు 28 నాటి ధరల ప్రకారం 75.65 డాలర్ల వద్ద ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు మాత్రం ఆ పెంచిన పన్నులను తగ్గించలేదు. అందుకే ఇంధన ధరలు మన దేశంలో జీవితాల గరిష్ఠానికి చేరుతూ సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
Also Read: e-Shram Card: మీ జీతం 15 వేల కంటే తక్కువా? మీకో శుభవార్త.. ఈ ఒక్క పని ఫ్రీగా చేస్తే ఎన్నో లాభాలు
Petrol-Diesel Price 01 October 2023: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
Gold-Silver Price 01 October 2023: కొండ దిగొస్తున్న గోల్డ్ - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
Aston Martin DB12: ఆస్టన్ మార్టిన్ డీబీ12 లాంచ్ చేసిన కంపెనీ - మనదేశంలో ఎంత ధర?
Rs 2,000 Exchange Deadline: రూ. 2000 నోట్లు మార్చుకోలేదా, అయితే మీకు RBI శుభవార్త - చివరి తేదీ ఇదే
Bank Locker Rule: లాకర్‌లో దాచిన ఆస్తి మొత్తానికి బ్యాంక్ బాధ్యత ఉండదు, కొత్త రూల్స్ గురించి తెలుసుకోండి
BRS Politics: చంద్రబాబు అరెస్టుపై రూటు మార్చేసిన బీఆర్ఎస్ అగ్రనేతలు, సీమాంధ్ర ఓటర్ల ఎఫెక్టేనా ?
Chandrababu Naidu Arrest : బీజేపీకి సమస్యగా చంద్రబాబు అరెస్టు ఇష్యూ - కమలం పార్టీ మద్దతుతోనే జగన్ ఇదంతా చేస్తున్నారా ?
Balakrishna : గిరిజనుల హక్కుల కోసం ఎన్‌బికె పోరాటం
Jagan Adani Meet: జగన్‌తో అదానీ రహస్య భేటీలో ఆ డీల్! రూ.1,400 కోట్ల ఆఫర్ - సీపీఐ రామక్రిష్ణ
/body>