Petrol-Diesel Price 27 November 2021: వాహనదారులకు స్వల్ప ఊరట.. నిలకడగా పెట్రోల్, డీజిల్ ధరలు.. అక్కడ పెరుగుదల!
దేశ రాజధాని ఢిల్లీలో నేడు పెట్రోల్ ధర రూ. 103.97 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్ లీటర్ ధర సైతం గత కొన్ని రోజులుగా రూ.86.67 వద్ద నిలకడగా ఉంది.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఇంధన ధరలపై స్వల్ప ఊరట కలిగించింది. కొన్ని రాష్ట్రాలు సైతం తమ వంతుగా కొంత మేర ఇంధన ధరలపై వాహనదారులకు ఊరట కలిగించాయి. కేంద్రం ప్రకటనతో ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాలు సైతం కొంతమేర పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాయి. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు మాత్రం తాము ధరలు పెంచనప్పుడు తగ్గించడం ఎలా సాధ్యమని చెబుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో నేడు పెట్రోల్ ధర రూ. 103.97 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్ లీటర్ ధర సైతం గత కొన్ని రోజులుగా రూ.86.67 వద్ద నిలకడగా ఉంది.
హైదరాబాద్‌లో నేడు పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20 వద్ద స్థిరంగా ఉంది. గత రెండు వారాలుగా భాగ్యనగరంలో పెట్రోల్ ధర నిలకడగా కొనసాగుతుంది. డీజిల్ ధర సైతం లీటరుకు రూ.94.62 గా నిలకడగానే ఉంది. గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్‌లో నిలకడగానే ధరలు ఉంటున్నాయి. ఇక వరంగల్‌లో పెట్రోల్ ధర రూ.0.19 పైసలు పెరిగి రూ.107.88 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. డీజిల్ ధర కూడా రూ.0.17 పైసలు పెరిగి రూ.94.31 అయింది. వరంగల్ రూరల్ జిల్లాలో పెట్రోల్ ధర రూ. 107.69 కాగా, డీజిల్ ధర రూ.94.14గా ఉంది.
కరీంనగర్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.55 కాగా, 15 పైసలు పెరగడంతో డీజిల్ ధర రూ.94.94 అయింది. నిజామాబాద్‌లో ఇంధన ధరలు స్వల్పంగా పెరిగాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ.0.24 పైసలు పెరిగింది. దీంతో రూ.110.21కి చేరుకుంది. డీజిల్ ధర రూ.0.22 పైసలు పెరిగి రూ.96.54 గా ఉంది. గత కొన్ని రోజులుగా ఇక్కడ ఇంధన ధరల్లో ఎక్కువగా హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.
Also Read: Gold Silver Price Today: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే
ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు..
ఇక విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధర నేడు కాస్త ఎక్కువగానే పెరిగింది. లీటరుకు రూ.0.46 పైసలు పెరిగి ప్రస్తుతం రూ.111.13 అయింది. డీజిల్ ధర కూడా రూ.0.40 పైసలు పెరిగి రూ.97.14గా ఉంది. గుంటూరులో పెట్రోల్ ధర రూ.111.13 కాగా, డీజిల్ ధర రూ.97.14 అయింది.
తిరుపతి, విశాఖపట్నంలో ఇలా..
తిరుపతిలోనూ ఇంధన ధరలు భారీగా తగ్గాయి. లీటరు పెట్రోలు ధర ప్రస్తుతం రూ.110.58 కి దిగొచ్చింది. ఇక్కడ లీటరుకు రూ.0.93 పైసలు తగ్గింది. ఇక డీజిల్ ధర రూ.0.86 పైసలు తగ్గి రూ.96.60గా ఉంది. విశాఖపట్నం మార్కెట్‌లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.109.65గా ఉంది. పాత ధరతో పోలిస్తే 0.33 పైసల మేర పెరిగింది. డీజిల్ ధర 0.31 పైసలు పెరగడంతో విశాఖపట్నంలో రూ.95.74గా ఉంది.
ధరల పెరుగుదలకు కారణం..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.30 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా నవంబరు 25 నాటి ధరల ప్రకారం 78.44 డాలర్ల వద్ద ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఆ పెంచిన పన్నులను తగ్గించలేదు. అందుకే ఇంధన ధరలు మన దేశంలో జీవితాల గరిష్ఠానికి చేరుతూ సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. తాజాగా సుంకాన్ని స్వల్పంగా తగ్గించడం ద్వారా రూ.5 నుంచి రూ.10 మేర ఇంధన ధరలు తగ్గాయి.
Also Read: Cryptocurrency Prices Today: బిట్‌కాయిన్ కొనాలా? వద్దా? మార్కెట్లలో జోరైతే లేదు మరి!
Also Read: Flipkart Black Friday Offer: ఈ ఐఫోన్‌పై రూ.20 వేలకు పైగా తగ్గింపు.. సూపర్ ఆఫర్!