By: ABP Desam | Updated at : 25 Oct 2021 08:23 AM (IST)
Edited By: Venkateshk
ప్రతీకాత్మక చిత్రం
కొద్ది రోజులుగా ఇంధన ధరలు మన దేశంలో క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా నేడు కూడా కొన్ని నగరాల్లో వ్యత్యాసం చోటు చేసుకుంది. హైదరాబాద్‌లోనూ మరోసారి ధరలు ఎగబాకాయి. హైదరాబాద్‌లో నేడు పెట్రోల్ ధర లీటరుకు రూ.0.36 పైసలు పెరిగి రూ.111.91 అయింది. డీజిల్ ధర రూ.0.38 పైసలు పెరిగి రూ.105.08గా ఉంది. ఇక వరంగల్‌లో పెట్రోల్ ధర లీటరుకు రూ.0.15 పైసలు పెరిగి రూ.111.42 అయింది. డీజిల్ ధర రూ.0.19 పైసలు పెరిగి రూ.104.62 గా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.
కరీంనగర్‌లో పెట్రోల్ ధర ముందు రోజు ధరతో పోలిస్తే రూ.0.50 పైసలు పెరిగి.. రూ.112.21గా ఉంది. డీజిల్ ధర రూ.0.50 పైసలు పెరిగి రూ.105.35 కు చేరింది. నిజామాబాద్‌లోనూ ఇంధన ధరలు కాస్త పెరిగాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ.0.42 పైసలు పెరిగి రూ.113.37 గా ఉంది. డీజిల్ ధర రూ.0.44 పైసలు పెరిగి రూ.106.44 గా ఉంది. గత కొన్ని రోజులుగా ఇక్కడ ఇంధన ధరల్లో ఎక్కువగా హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.
Also Read: రిలయన్స్ అంటే అంతే మరి! క్యూ2 ఫలితాల్లో దుమ్మురేపిన ఆర్‌ఐఎల్.. లాభం ఎంతో తెలుసా?
ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
ఇక విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధరలు తాజాగా పెరిగాయి. ప్రస్తుతం రూ.113.93 గా ఉంది. పెట్రోల్ ధర రూ.0.44 పైసలు పెరిగింది. డీజిల్ ధర రూ.0.46 పైసలు పెరిగి రూ.106.50కి చేరింది. అయితే, అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా పెరుగుతూనే ఉన్నాయి.
విశాఖపట్నం ఇంధన మార్కెట్‌లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.113.23గా ఉంది. గత ధరతో పోలిస్తే లీటరుకు రూ.0.11 పైసలు పెరిగింది. డీజిల్ ధర విశాఖపట్నంలో రూ.105.80గా ఉంది. విశాఖలో కూడా కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో సరాసరిన రూ.0.40 పైసలకు పైబడి హెచ్చు తగ్గులు ఉంటున్నాయి.
తిరుపతిలో ఇంధన ధరలు పెరిగాయి. లీటరు పెట్రోలు ధర ప్రస్తుతం రూ.1.05 పైసలు తగ్గి.. రూ.113.50 కు చేరింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో పెరుగుదల కనిపిస్తుంది. ఇక డీజిల్ ధర రూ.106.07గా ఉంది. డీజిల్ ధర లీటరుకు రూ.0.90 పైసలు తగ్గింది. క్రమంగా పెరుగుతూ వస్తున్న ముడిచమురు ధరలే ఇంధన ధరలు ఎగబాకేందుకు కారణంగా తెలుస్తోంది.
ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.33 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా అక్టోబరు 25 నాటి ధరల ప్రకారం 84.38 డాలర్ల వద్ద ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు మాత్రం ఆ పెంచిన పన్నులను తగ్గించలేదు. అందుకే ఇంధన ధరలు మన దేశంలో జీవితాల గరిష్ఠానికి చేరుతూ సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
Also Read: స్వల్పంగా పెరిగిన పసిడి ధర.. నేడు మీ నగరంలో బంగారం, వెండి ధరలివీ..
Also Read: మీ కలల్ని మించిన ధనవంతులు అవ్వండి.. అందుకు నిజంగా ఏం చేయొద్దు, పూర్తి వివరాలివీ..
Tata Money Market Fund - Direct - Growth NAV June 27, 2022: నెట్ అసెట్స్ విలువ, ధర, స్కీమ్, పెట్టుబడి, వడ్డీరేటు తెలుసుకోండి
Kotak Liquid Fund - Direct - Growth NAV June 27, 2022: నెట్ అసెట్స్ విలువ, ధర, స్కీమ్, పెట్టుబడి, వడ్డీరేటు తెలుసుకోండి
Invesco India Gold Exchange Traded Fund NAV June 27, 2022: నెట్ అసెట్స్ విలువ, ధర, స్కీమ్, పెట్టుబడి, వడ్డీరేటు తెలుసుకోండి
HDFC Money Market Fund - Direct - Growth NAV June 27, 2022: నెట్ అసెట్స్ విలువ, ధర, స్కీమ్, పెట్టుబడి, వడ్డీరేటు తెలుసుకోండి
IDBI Gold Exchange Traded Fund NAV June 27, 2022: నెట్ అసెట్స్ విలువ, ధర, స్కీమ్, పెట్టుబడి, వడ్డీరేటు తెలుసుకోండి
Chiru In Modi Meeting : మోదీ, జగన్‌తో పాటు చిరంజీవి కూడా ! - నాలుగో తేదీన ఏపీలో
Telangana SSC Exam Results: గురువారం తెలంగాణలో పదో తరగతి పరీక్షల ఫలితాలు
Janasena Janavani : " జనవాణి " ప్రారంభిస్తున్న పవన్ కల్యాణఅ ! ఇక నుంచి ప్రతి ఆదివారం ..
IND vs IRE, 1st Innings Highlights: దీపక్ హుడా, సంజూ శాంసన్ సూపర్ షో- ఐర్లాండ్‌కు భారీ టార్గెట్