How to Become Rich: మీ కలల్ని మించిన ధనవంతులు అవ్వండి.. అందుకు నిజంగా ఏం చేయొద్దు, పూర్తి వివరాలివీ..
సరైన చోట పెట్టుబడులు పెట్టడం ద్వారా మన జీవితాలను మెరుగుపరుచుకునే అవకాశం ఉందని మనం నమ్ముతున్నాం. ఈ విషయంలో కొంత మందిలో ఇంకా ప్రాథమిక అవగాహన లేకపోవడం కూడా ఒక అవరోధంగా ఉంది.
ఖ్యాతి పొందిన పెద్ద పెద్ద నగరాలన్నీ ఒక్క రోజులో నిర్మితం కాలేదని మనందరికీ తెలుసు. అవి ఆ స్థాయికి వచ్చేందుకు ఎన్నో ఏళ్ల శ్రమ, ప్లానింగ్ కచ్చితంగా ఉంది. కానీ, నేడు అన్ని సంవత్సరాలు వేచి ఉండే ఓపిక అంతగా ఎవరిలోనూ లేదు. అప్పటికప్పుడు ఫలితాలు వచ్చేయాలనే ఆలోచనే చాలా మందిలోనూ ఉంటుంది. వ్యక్తిగత పెట్టుబడులు లేదా మదుపు చేసేటప్పుడు కూడా ఇలాంటి ఆలోచనా ధోరణే ఎక్కువ మందిలో ఉంటోంది.
సరైన చోట పెట్టుబడులు పెట్టడం ద్వారా మన జీవితాలను మెరుగుపరుచుకునే అవకాశం ఉందని మనం నమ్ముతున్నాం. అయితే, ఈ పెట్టుబడులు పెట్టే విషయంలో కొంత మందిలో ఇంకా ప్రాథమిక అవగాహన లేకపోవడం కూడా ఒక అవరోధంగా ఉంది.
సంపద సృష్టికి సంబంధించిన మెలకువలు సులువుగా ఉంటాయి. అవేంటంటే.. 'సరైన చోట పెట్టుబడి.. దాన్ని గట్టిగా విశ్వసించడం నుంచి ‘అందులో పెట్టుబడులు.. ఇక దాని గురించి కొంత కాలం మర్చిపోవడం’ అనే ఒక సూత్రం ఉంటుంది. సాధారణంగా పెట్టుబడుల విషయంలో ఒక మాట అంటుంటారు. ‘‘ఏమీ చేయకండి.. మీ కలలను మించిన ధనవంతులు అవ్వండి’’ అని. అది ఇలా పనిచేస్తుంది.
Also Read: Amazon Festival Sale: ఫిట్‌నెస్, యోగా యాక్ససరీస్.. ఇప్పుడు రూ.49కే మొదలు
నివేదిక ఏం చెబుతుందంటే..
సాధారణంగా ఈక్విటీ మార్కెట్లు స్వల్ప కాలంలో అస్థిరంగా ఉంటాయి. కానీ సుదీర్ఘ కాలంలో అవి కాలక్రమేణా పైకి కదులుతాయి. కనీసం 25 ఏళ్లు మీరు పెట్టిన పెట్టుబడిని కదిలించకపోవడం వల్ల మీరు చాలా ధనవంతులు అవుతారు. ముందు మీరు అందులో మొదట పెట్టుబడి పెడితే, ఇక తరచూ దాని చుట్టూ తిరగాల్సిన లేదా ఊరికే చెక్ చేసుకొనే పని లేనే లేదు. కానీ, ఎక్కువ కాలం ఇలా పెట్టుబడి పెట్టి మర్చిపోవడం సులభం కాదు. ఓ నివేదిక ప్రకారం.. 50 శాతం హెచ్ఎన్ఐ (అధిక నికర విలువక లిగిన ఇన్వెస్టర్లు) పెట్టుబడిదారులు (2 లక్షలకు పైబడి), రెండేళ్లపాటు కూడా పెట్టుబడి పెట్టలేకపోతున్నారు. ఎందుకంటే..
పెట్టుబడి ప్రయాణాన్ని దాంతో పోల్చొచ్చు
ఒకచోట పెట్టుబడి పెట్టి వేచి చూడడం అనేదాన్ని ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ ప్రయాణంతో పోల్చవచ్చు. అందులో ఎత్తుపల్లాలు, భారీ వంపులతో ప్రయాణం ఆందోళనకరంగా ఉన్నట్లే.. మనం పెట్టిన పెట్టుబడి ప్రయాణం కూడా కాస్త అటుఇటుగా అలాగే ఉంటుంది. మార్కెట్లు పెరిగినప్పుడు పెట్టుబడిదారులు డబ్బు సంపాదిస్తారు. మార్కెట్లు మరింతగా పెరిగితే.. అందుకు తగ్గట్లుగా భారీ లాభాలు వస్తాయి. అయితే, FOMO (ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్), దురాశ అనేవి మార్కెట్‌లను మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ సులువుగా డబ్బు సంపాదిస్తున్నట్లు కనిపించే స్థాయిలకు పెంచగలవు. ప్రపంచంలోని అన్నింటికంటే మనం ఇష్టపడనిది.. డబ్బును కోల్పోవడం. మార్కెట్ స్థాయిలలో 5 నుంచి 10 శాతం పతనం అవ్వడం సహజమని చాలా మంది సొంత అభిప్రాయం. కానీ మార్కెట్‌లు ప్రతి కొన్ని సంవత్సరాలకు 20 శాతానికి పైగా పతనాలను కలిగి ఉన్నాయని కూడా గుర్తించాలి. ఇందుకోసం పెట్టుబడి దారులు సిద్ధం కావాలి.
Also Read: రిలయన్స్ అంటే అంతే మరి! క్యూ2 ఫలితాల్లో దుమ్మురేపిన ఆర్‌ఐఎల్.. లాభం ఎంతో తెలుసా?
నష్టాలు వస్తే ఎలా ప్రవర్తించాలి?
మార్కెట్లు పతనం కావడం ద్వారా పెట్టుబడిదారుల్లో సంపద ఆవిరవుతుందన్న ఆందోళన, నిరాశ, భయం వంటివి చవి చూస్తుంటారు. నష్టాలు పెరగడం ప్రారంభమవుతున్న వేళ ఈ క్షణాల్లో మీరు ఎలా స్పందిస్తారనేది మీ రాబడి ఎలా ఉంటుందో సూచిస్తుంది. నిజానికి మీరు ఎలాంటి పెట్టుబడిదారో తెలుసుకోవాలి. చాలా మంది తమ సంపద క్షీణించడాన్ని చూసి భయాందోళన చెందుతారు. ఇంకొందరు నింపాదిగా ఉంటారు. ఇలాంటి సమయంలో, అనుభవం, ఇంగితజ్ఞానంతోపాటు, పెట్టుబడి ప్రణాళికపై నమ్మకం లాంటివన్నీ పని చేయకపోవచ్చు. కానీ, మానసిక దృఢత్వం ముఖ్యం. కష్ట సమయంలో కూడా మీరు మీ ప్రణాళిక, నమ్మకానికి కట్టుబడి ఉండగలరా? మీ దగ్గర కూడా అలాంటి ప్లాన్ ఉందా? అనేది ముఖ్యం.
అనుభవజ్ఞులైన పెట్టుబడిదారులైతే మరింత ఆర్థిక క్రమశిక్షణతో మెలిగి సలహాదారుల సూచనలను విలువైనదిగా భావిస్తారు. తద్వారా విజయవంతమైన పెట్టుబడిదారులు అవుతారు. భావోద్వేగ అస్థిరతను ఎదుర్కోవటానికి మరొక మార్గం దాని గురించి మరచిపోవడం. ప్రతిరోజూ మార్కెట్లను చూడకుండా ఉండాలి. అందులో ఏమి జరుగుతుందో మీకు ఎటువంటి క్లూ లేకుంటే, అది మీ పెట్టుబడిని కొనసాగించే, సంపదను సృష్టించే అవకాశాలను మెరుగుపరిచే అవకాశాలు ఉన్నాయి.
Also Read: కస్టమర్లకు ఆఫర్లే ఆఫర్లు! దీపావళికి ఏ బ్యాంకు ఏ ఆఫర్ ఇస్తోందో తెలుసా?
ఇవి ముఖ్యం
చివరికి, దీర్ఘకాలిక పెట్టుబడి అనేది ఎలైట్ స్పోర్ట్ లాంటిది. అంతిమంగా, ఈ గేమ్ అంతా మీ మెదడులోనే ఆడాలి. ఈ ఆటుపోట్లను తట్టుకోకుండా గణనీయమైన సంపదను సృష్టించడం సులభం కాదు. దీనికి సమయం అవసరం. బలమైన మానసిక నైపుణ్యాలు అవసరం. మంచి సలహా బృందాన్ని నమ్ముతూ వారిని అనుసరించడం వల్ల మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. కానీ అన్నింటిలో కెల్లా ముఖ్యమైనది.. ముందు మీరు పెట్టుబడి పెట్టడం ప్రారంభించడం. దీన్ని ప్రారంభించడమే చాలా మందికి కష్టతరమైన వ్యవహారంగా ఉంటోంది.
పెట్టుబడులు పెట్టడాన్ని మీరు ముందుగానే ప్రారంభించడం ద్వారా మీరు అత్యంత విలువైన ఆస్తిని మీ జీవితంలో అతి తక్కువ సమయంలోనే పొందగలుగుతారు. విజయవంతమైన పెట్టుబడిదారులందరి లక్షణం ఇదే. ఇక్కడ సవాలు ఏంటంటే, యుక్తవయస్సులో ఉన్నప్పుడు డబ్బు అనేది చాలా ప్రాథమికమైనది. మనం డబ్బును ప్రేమిస్తాం, కానీ డబ్బు మనల్ని తిరిగి ప్రేమించదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆ డబ్బుకు ఎలాంటి భావాలు, భావోద్వేగాలు ఉండవు కాబట్టి.. మీరు దానిని పెట్టుబడి రూపంలో పెట్టినట్లయితే అది పనిచేయడం ప్రారంభిస్తుంది. లేకపోతే వృథానే అవుతూ ఉంటుంది.
Also Read: కేంద్ర ఉద్యోగులకు తీపికబురు! డీఏ, డీఆర్ పెంపునకు ప్రభుత్వ ఆమోదం
Also Read: కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. మరో 6 నెలలపాటు పాలసీ కొనసాగిస్తూ కీలక నిర్ణయం