Konaseema News Today: మలికిపురంలో విద్యార్థిని చావబాది వైరల్ అయ్యాడు- ఇప్పుడు రోడ్డు ప్రమాదంలో గాయాలపాలయ్యాడు
Malikipuram News: అంబేడ్కర్ కోనసీమజిల్లా మలికిపురంలో ఓ యువకుణ్ని ముగ్గురు చావబాదారు. ఇప్పుడు అందులో ఒకడు ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.
Malikipuram Viral News: ఇటీవల అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురంలో ఓ యువకుడ్ని ముగ్గురు కలిసి చావబాదారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. తెలిసిన అమ్మాయితో చాటింగ్ చేశాడన్న కారణంతో దాడికి తెగబడ్డారు. కొబ్బరి కమ్మతో పాశవికంగా ఆ యువకుణ్ని చితకబాదాడో యువకుడు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో కలకలం రేపింది.
ఈ కేసులో పోలీసులు రంగప్రవేశం చేసి దాడి చేసిన యువకులపై కేసు నమోదు చేశారు. ముగ్గుర్ని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే దాడికి పాల్పడిన ఓ యువకుడు ఓ ఆసుపత్రిలో ఉన్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే పోలీసులు వెళ్లి చూసి నిర్ఘాంతపోయారు. ఒళ్లంతా తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స బెడ్‌పై ఉన్న యువకుడిని చూసి షాక్ అయ్యారు. బైక్ యాక్సిడెంట్‌తో ముఖమంతా తీవ్రగాయాలతో నరకయాతన అనుభవిస్తూ కనిపించాడు.
సోషల్ మీడియాలో పోస్టులు..
యువకుడిపై దాడికి పాల్పడిన మరుసటి రోజునే ప్రమాదం జరిగిందట. ర్యాష్ డ్రైవింగ్ వల్ల బైక్ స్కిడ్ అయ్యి రోడ్డుమీద పడిపోయాడు. దీంతో తీవ్రగాయాలు కాగా అతన్ని స్థానికులు మలికిపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంలో ఆ యువకుడి శరీరం అంతా తీవ్రంగా చెక్కుకుపోయింది. గాయాల తీవ్రతకు కుట్లు కూడా వేయాల్సిన వచ్చింది. ఆ వీడియో కూడా బయటకు రావడంతో ఖర్మ అనుభవిస్తున్నాడంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే...
మలికిపురంలోని ఏఎఫ్‌డీటీ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న యువకుడికి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న యువతి పరిచయమైంది. ఆమెతో చాటింగ్ చేశాడు. ఆ యువతికి బంధువైన రవికి ఈ చాటింగ్ గురించి తెలిసింది. దీనిపై ఆమెను నిలదీయగా కేవలం చాటింగ్ చేస్తున్నాడని చెప్పడంతో ఆగ్రహావేశానికి గురయ్యాడు రవి. స్నేహితులతో కలిసి ఇంటర్ విద్యార్థిని నిర్మానుష్యంగా ఉన్న కొబ్బరి తోటల్లోకి తీసుకెళ్లి బీరుబాటిళ్లు, కొబ్బరి, తాటి కమ్మలతో దాడికి పాల్పడ్డాడు.
నలుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు..
మలికిపురంలో ఈనెల 5న చోటుచేసుకున్న ఈ ఘటనకు సంందించిన వీడియో వైరల్ అయ్యింది. దీంతో దాడికి పాల్పడిన యువకులను గుర్తించి దర్యాప్తు చేయాల్సిందిగా జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆదేశించారు. రంగంలోకి దిగిన పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేశారు. వారు మలికిపురంలోని ఏఎఫ్‌డీటీ కళాశాలలో ఇంటర్ చదుకుని ఖాళీగా ఉంటున్నారనితేలింది.
వారిలో ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు మరో వ్యక్తి కోసం తీవ్రంగా గాలించారు. ఆ వ్యక్తి ఇలా రోడ్డు ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ వ్యక్తి ఆసుపత్రిలో ఉన్నట్టు సమాచారం తెలిసింది. అతన్ని అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులు షాక్ తిన్నారు. ఏం చేయాలో తెలియాలో తిరిగి వచ్చేశారు.
Also Read: ఉత్తరాంధ్ర, హైదరాబాద్ నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్ల వివరాలివే!