Petrol-Diesel Price, 21 August: నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా, ఏపీ, తెలంగాణలో ఎంత పెరిగాయంటే?
Petrol Diesel Price 21 August: హైదరాబాద్ లో గత రెండు నెలలకుగా పైగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని నగరాల్లో మాత్రం స్వల్ప పెరుగుదల, తగ్గుదల ఉంది.
![Petrol-Diesel Price, 21 August: నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా, ఏపీ, తెలంగాణలో ఎంత పెరిగాయంటే? Petrol Diesel Price Today 21 August 2022 Know Rates Fuel Price In Telangana And Andhra Pradesh Petrol-Diesel Price, 21 August: నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా, ఏపీ, తెలంగాణలో ఎంత పెరిగాయంటే?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/21/ac2f5c9886c5c0fb3fa7f645aa61d33d1661051761075519_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Petrol-Diesel Price 21 August: కొన్ని రోజుల వరకు పెట్రోల్, డీజిల్ ధరలు మోత మోగించాయి. విపరీతమైన ఈ ధరల పెరుగుదలతో సామాన్యుల నుండి సంపన్నుల వరకు అందరూ ప్రభావితమయ్యారు. అయితే కొంత కాలంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో పెద్దగా మార్పు ఉండటం లేదు. తెలంగాణలోని హైదరాబాద్ లో గత రెండు నెలలకు పైగా ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. మిగతా ప్రాంతాల్లోనూ పెట్రోల్, డీజిల్ ధరల్లో పెద్దగా మార్పు లేదు. ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాలు, నగరాల్లో మాత్రం ఇంధన ధరలు స్వల్పంగా పెరుగుదల, తగ్గుదల నమోదు చేస్తున్నాయి.
తెలంగాణలో ఇంధన ధరలు..
హైదరబాద్ మహా నగరంలో పెట్రోల్, డీజిల్ ధరలు గత రెండు నెలలకుగా పైగా నిలకడగా ఉన్నాయి. ఇవాళ 21 ఆగస్టు 2022 నాడు హైదరాబాద్ లో లీటరు పెట్రోల్ ధర రూ.109.66గా ఉంది. ఇక లీటరు డీజిల్ ధర రూ. 97.82గా ఉంది. కరీంనగర్ లో పెట్రోల్ ధర రూ. 0.15 పైసలు తగ్గింది. నిన్న రూ.109.47 గా ఉండగా.. ఇవాళ రూ.109.32 గా ఉంది. డీజిల్ ధర రూ.0.13 పైసలు తగ్గింది. నిన్న రూ. 97.63 గా ఉండగా.. ఇవాళ రూ.97.50 గా ఉంది.
వరంగల్ లో గత ఆరు రోజులుగా పెట్రోల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. లీటరు పెట్రోల్ కు రూ.109.10 గా ఉంది. ఇక డీజిల్ కూడా ఆరు రోజులుగా స్థిరంగానే కొనసాగుతోంది. లీటరు డీజిల్ ధర రూ.97.29 గా ఉంది. నిజామాబాద్ లో పెట్రోల్ ధర రూ.0.04 పైసలు తగ్గింది. నేడు రూ.111.08 గా ఉంది. డీజిల్ ధర నేడు రూ.0.04 పైసలు తగ్గి, లీటరు డీజిల్ ధర రూ. 99.10గా ఉంది.
ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్, డీజిల్ ధరలు..
విజయవాడలో ఇంధన ధరలు స్వల్పంగా పెరిగాయి. నిన్న లీటర్ పెట్రోల్ ధర రూ.110.97 గా ఉండగా.. రూ.0.54 పైసలు పెరిగింది. నేడు 21 ఆగస్టు రోజున లీటర్ పెట్రోల్ రూ.111.51 గా ఉంది. డీజిల్ ధర కూడా రూ.0.50 పైసలు పెరిగింది. నిన్న రూ.98.76గా ఉండగా.. రూ.0.50 పైసలు పెరిగి రూ.99.26గా ఉంది.
ఇక విశాఖపట్నంలో పెట్రోల్ ధర నిన్నటితో పోలిస్తే రూ.0.26 పైసలు తగ్గింది. నిన్న లీటరు పెట్రోల్ ధర రూ.110.74 గా ఉండగా, నేడు రూ. 110.48 గా ఉంది. డీజిల్ ధర మాత్రం రూ.0.24 పైసలు తగ్గింది. నిన్న రూ.98.51 గా ఉండగా.. నేడు రూ. 98.27 గా ఉంది.
తిరుపతిలో నేటి ఇంధన ధరలు
తిరుపతిలో పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి. పెట్రోల్ పై రూ.0.90 పైసలు పెరగ్గా.. డీజిల్ పై రూ. రూ.0.83 పైసలు పెరిగింది. పెట్రోల్ ధర నిన్న రూ.111.65 గా ఉంది. స్వల్పంగా పెరగడంతో ఇవాళ రూ.112.55కు చేరింది. డీజిల్ ధర నిన్న రూ.99.36 ఉండగా.. ఇవాళ రూ.100.19గా ఉంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)