![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Petrol-Diesel Price, 17 August: తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ ధరలివే... ఏపీలో పెరిగిన ధరలు, తెలంగాణలో నిలకడగా...
దేశంలోని ప్రధాన నగరాల్లో గత నెల రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు నిలకడగా ఉంటున్నాయి. హైదరాబాద్‌లో ఇంధన మార్కెట్‌లో ధరలు స్థిరంగా ఉన్నాయి. ఏపీలో ఇంధన ధరలు పెరిగాయి.
![Petrol-Diesel Price, 17 August: తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ ధరలివే... ఏపీలో పెరిగిన ధరలు, తెలంగాణలో నిలకడగా... Petrol diesel price today 17 august 2021 know rates fuel price in your city telangana andhrapradesh amavaravathi hyderabad vijayawada visakhapatnam warangal Petrol-Diesel Price, 17 August: తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ ధరలివే... ఏపీలో పెరిగిన ధరలు, తెలంగాణలో నిలకడగా...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/17/f1d35717d015d163e99be06e9c2e9d5f_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
దేశంలో వరుసగా 31వ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఢిల్లీలో పెట్రోల్ లీటరు ధర రూ. 101.84 వద్ద ఉండగా, డీజిల్ ధర రూ .89.87 వద్ద ఉంది. ముంబయిలో పెట్రోల్ లీటరుకు రూ. 107.83, డీజిల్ ధర రూ. 97.45గా ఉంది. చెన్నైలో ఒక లీటర్ పెట్రోల్ ధర రూ. 102.49, డీజిల్ ధర రూ. 94.39గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 102.08, డీజిల్ ధర రూ .93.02గా ఉంది.
ఉదయం 6 గంటలకు...
మే 4 నుంచి పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సోం, తమిళనాడు, ఏపీ, తెలంగాణ, పుదుచ్చేరితో సహా ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో దేశంలో ఇంధన ధరలు పెరుగుతూ వచ్చాయి. కానీ ఇటీవల వీటి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్, హిందుస్థాన్ పెట్రోలియం వంటి చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరించాయి. రోజు వారీగా సవరిస్తున్న ఈ కొత్త ధరలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు నుంచి అమల్లోకి వస్తాయి. విలువ ఆధారిత పన్నులు, స్థానిక సరుకు రవాణా ఛార్జీల కారణంగా రాష్ట్రాలు, నగరాల్లో ధరల్లో వ్యత్యాసం కనిపిస్తుంది.
Also Read: Horoscope Today : ఆ రాశివారు ఈ రోజు శుభవార్త వింటారు... వీళ్లు మాత్రం అనవసరంగా రిస్క్ తీసుకోవద్దు…
తెలంగాణలో ఇంధన ధరలు
హైదరాబాద్‌లో పెట్రోల్ ధరలు రూ.105.83 వద్ద కొనసాగుతున్నాయి. డీజిల్ ధర రూ.97.96గా స్థిరంగా ఉంది. కరీంనగర్‌లో పెట్రోల్ ధర ముందు రోజు ధరతో పోలిస్తే స్థిరంగానే కొనసాగుతోంది. తాజాగా పెట్రోల్ ధర కరీంనగర్‌లో రూ.105.71గా ఉంది. ఇక డీజిల్ ధర రూ.97.83గా ఉంది.
ఇక వరంగల్‌లో తాజాగా పెట్రోల్ ధర రూ.105.38గా ఉండగా డీజిల్ ధర రూ.97.53 గా ఉంది. కొద్దిరోజులుగా వరంగల్‌లో నిలకడగా ఉంటున్న ధరలు ఇవాళ మాత్రం అతి స్వల్పంగా తగ్గాయి. పెట్రోల్ మూడు పైసలు, డీజిల్ రెండు పైసలు చొప్పున తగ్గింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇవే ఇంధన ధరలు ఉన్నాయి. నిజామాబాద్‌లో పెట్రోల్ ధరలో లీటరుకు సుమారు రూ.0.25 పైసల చొప్పున తగ్గి రూ.107.14కు చేరింది. డీజిల్ ధర గత ధరతో పోల్చితే రూ.0.23 పైసలు తగ్గి లీటరు ధర రూ.99.17గా ఉంది. గత కొన్ని రోజులుగా ఇక్కడ ఇంధన ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి.
ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు
ఇక విజయవాడ మార్కెట్‌లో ఇంధన ధరల్లో స్వల్ప మార్పులు కనిపించాయి. పెట్రోల్ ధర రూ.0.13 పైసలు పెరిగింది. ప్రస్తుతం పెట్రోల్ రేటు లీటరుకు రూ.108.16గా ఉంది. డీజిల్ ధర కూడా రూ.0.12 పైసలు పెరిగి రూ.99.74కు చేరింది. విశాఖపట్నం ఇంధన మార్కెట్‌లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.107.75గా ఉంది. ముందు రోజుతో పోలిస్తే అత్యధికంగా రూ.0.71 పైసలు పెరిగింది. డీజిల్ ధర కూడా విశాఖపట్నంలో రూ.0.66 పైసలు పెరిగి రూ.99.31గా ఉంది.
చిత్తూరులో ఇంధన ధరల్లో రోజూ భారీ మార్పులే చోటు చేసుకుంటున్నాయి. పెట్రోల్ లీటరుకు రూ.0.38 పెరిగింది. డీజిల్ రూ. 78 పెరిగింది. దీంతో తాజాగా లీటరు పెట్రోలు ధర రూ.108.84కు చేరింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది. ఇక డీజిల్ ధర రూ.99.97గా ఉంది.
ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు
1. ముంబయి
పెట్రోల్ - లీటరుకు రూ. 107.83
డీజిల్ - లీటరుకు రూ. 97.45
2. ఢిల్లీ
పెట్రోల్ - లీటరుకు రూ. 101.84
డీజిల్ - లీటరుకు రూ .89.87
3. చెన్నై
పెట్రోల్ - లీటరుకు రూ. 102.49
డీజిల్ - లీటరుకు రూ. 94.39
4. కోల్‌కతా
పెట్రోల్ - లీటరుకు రూ. 102.08
డీజిల్ - లీటరుకు రూ. 93.02
5. హైదరాబాద్
పెట్రోల్ - లీటరుకు రూ. 105. 83
డీజిల్ - లీటరుకు రూ. 97.96
6. బెంగళూరు
పెట్రోల్ - లీటరుకు రూ. 105.25
డీజిల్ - లీటరుకు రూ .95.26
7. విజయవాడ
పెట్రోల్ - లీటరుకు రూ. 108.16
డీజిల్ - లీటరుకు రూ .99.74
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)