By: ABP Desam | Updated at : 17 Aug 2021 07:38 AM (IST)
బంగారం ధరలు(ప్రతీకాత్మక చిత్రం)
భారత్‌లో బంగారం ధరలు మంగళవారం(17 ఆగస్టు) స్థిరంగా కొనసాగుతున్నాయి. సోమవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.44,010గా ఉంటే... ఇవాళ కూడా రూ.44,010గా ఉంది. నిన్న 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,010గా ఉంటే, ఇవాళ కూడా రూ 48,010 వద్దే కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో సోమవారం 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,480 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,530గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,980ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.46,980ఉంది.
హైదరాబాద్, విజయవాడల్లో బంగారం ధరలు
గత 10 రోజుల్లో బంగారం ధరలు 4 రోజులు పెరిగి, మూడు రోజులు తగ్గాయి. మరో 3 రోజులు స్థిరంగా ఉన్నాయి. గత పది రోజుల్లో బంగారం 10 గ్రాములు ధర రూ.540 తగ్గింది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.44,010 ఉండగా... విజయవాడలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.44,010 ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.44,010 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.44,010 ఉండగా.... చెన్నైలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.120 పెరిగి రూ.44,480కు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.46,160 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1రూ.140 పెరిగింది. దీంతో ధర రూ.46,500కి చేరింది. ముంబయిలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.180 తగ్గి రూ.45,980కి పతనమైంది.
Also Read: Horoscope Today : ఆ రాశివారు ఈ రోజు శుభవార్త వింటారు... వీళ్లు మాత్రం అనవసరంగా రిస్క్ తీసుకోవద్దు…
వెండి ధర స్థిరంగా..
వెండి ధర నిన్న స్థిరంగా ఉంది. గత 10 రోజుల్లో ధర 6 సార్లు తగ్గగా... 2 పర్యాయాలు పెరిగింది. రెండుసార్లు స్థిరంగా ఉంది. ఈ ఉదయానికి (మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) వెండి ధర 1 గ్రాము రూ.68.20 ఉంది. అదే... 8 గ్రాములు (తులం) కావాలంటే ధర రూ.545.60 ఉంది. 10 గ్రాములు కావాలంటే... ధర రూ.682 ఉంది. 100 గ్రాములు ధర రూ.6,820 ఉండగా... కేజీ వెండి ధర రూ.68,200 ఉంది. నిన్న కేజీ వెండి ధరలో మార్పు రాలేదు. వెండి నగలు కొనుక్కోవాలి అనుకునేవారికి ఇది సరైన సమయం. ఎందుకంటే... జూన్ 1న కేజీ వెండి ధర రూ.76,800 ఉంది. ఇప్పుడు రూ.68,200 ఉంది. అంటే... ఈ రెండున్నర నెలల కాలంలో ధర రూ.8,600 తగ్గింది. అయితే ఆగస్ట్ 8 నుంచి వెండి ధర పెరుగుతోంది. మున్ముందు కూడా ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి.
దేశంలో వెండి ధరలు కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి. సోమవారం ప్రారంభ ధరతో పోలీస్తే కేజీ వెండి రూ.68,200గా ఉంది. మంగళవారం వెండి 10 గ్రాములు రూ.682గా ఉంది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ 68,200 ఉంది. ఇవి మంగళవారం ఉదయం ఉన్న ధరలు, స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.
Also Read: రైతులకు గుడ్ న్యూస్..మీ జేబులో నుంచి ఒక్క రూపాయి తీయకుండా ఈ పెన్షన్ పొందవచ్చు
Petrol-Diesel Price, 9 August: నేడు చాలాచోట్ల పెట్రోల్, డీజిల్ ధరలు పైకి - మీ నగరంలో ఇవాళ ఇలా
Gold-Silver Price: బంగారం కొంటున్నారా? మీ నగరంలో లేటెస్ట్ గోల్డ్, సిల్వర్ రేట్స్ ఇలా
Cryptocurrency Prices: రివ్వున ఎగిసిన క్రిప్టోలు! భారీగా పెరిగిన బిట్‌కాయిన్
Stock Market News: రిలాక్స్ గాయ్స్! దూసుకెళ్లిన సెన్సెక్స్, నిఫ్టీ! రూపాయి మాత్రం...!
Modi Govt Scheme: పెళ్లైన వారికి బొనాంజా! రూ.200తో ఏటా రూ.72వేలు పొందే స్కీమ్ ఇది!
Sajjala On Gorantla : ఫిర్యాదు లేదు - చర్యలుండవ్ ! గోరంట్ల మాధవ్ విషయంలో సజ్జల క్లారిటీ
India Medal Tally: 22 స్వర్ణాలతో నాలుగో స్థానంలో భారత్ - కామన్వెల్త్ గేమ్స్‌లో మన ప్రస్థానం ఇదే!
కేవలం 12 నిమిషాల్లోనే 80 శాతం చార్జింగ్ - రియల్మీ కొత్త ఫోన్ లాంచ్‌కు రెడీ!
రాఖీకి మీ సోదరికి మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా - అయితే ఈ ఆప్షన్లపై ఓ లుక్కేయండి!