News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

PM Kisan Maandhan Pension Scheme: రైతులకు గుడ్ న్యూస్..మీ జేబులో నుంచి ఒక్క రూపాయి తీయకుండా ఈ పెన్షన్ పొందవచ్చు

రైతులకు శుభవార్త.. మీరు పీఎం కిసాన్ యోజన కింద ఖాతాదారులై ఉన్నారా? అయితే.. పీఎం కిసాన్ మాన్ ధన్ స్కీమ్ లో చేరిపోవచ్చు. 

FOLLOW US: 
Share:

ఆరుగాలం కష్టించి ఆహార ధాన్యాలను పండించిన రైతులకు మలి వయసులో ఆర్థిక ఆసరాను ఇచ్చి ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రధాన మంత్రి కిసాన్‌ మాన్‌ధన్‌ యోజనను కేంద్రం తీసుకొచ్చింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి (పీఎం కిసాన్) కింద డబ్బులు పొందే రైతులకు ఇది గుడ్ న్యూస్. పీఎం కిసాన్ కింద డబ్బులు వచ్చే రైతులు రూ.3000 వరకు పెన్షన్ పొందుతారు.

పీఎం కిసాన్ మాన్‌ధన్‌ యోజన కింద రైతులకు 60 సంవత్సరాల తర్వాత పెన్షన్ వస్తుంది. ఒకవేళ మీరు పీఎం కిసాన్ ఖాతాదారు అయితే.. మీ రిజిస్ట్రేషన్ నేరుగా పీఎం కిసాన్ మాన్‌ధన్‌ స్కీమ్‌లో చేసుకోవచ్చు. 60 ఏళ్ల తర్వాత ఈ స్కీమ్ కింద పెన్షన్ అందుతుంది. 18 సంవత్సరాల నుండి 40 ఏళ్ల వరకు ఏ రైతు అయినా ఈ పథకంలో చేరొచ్చు. దీని కింద.. రైతు నెలవారీ పెన్షన్ రూ.3000 వరకు పొందుతాడు.

కావాల్సి పత్రాలు

1. ఆధార్ కార్డ్ 2. గుర్తింపు కార్డు 3. వయస్సు సర్టిఫికెట్ 4. ఆదాయ ధృవీకరణ పత్రం 5. సర్వే నంబర్  6. బ్యాంక్ ఖాతా పాస్ బుక్ 7. మొబైల్ నంబర్ 8. పాస్‌పోర్ట్ సైజు ఫోటో

ఈ పథకం కింద నమోదైన వారు..  60 ఏళ్ల తర్వాత  వార్షిక పెన్షన్ రూ .36,000 పొందుతారు. దీని కోసం రైతులు రూ. 55 నుంచి రూ.200 వరకు నెలవారీ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. పీఎం కిసాన్ మాన్‌ధన్‌లో కుటుంబ పెన్షన్ కూడా ఉంది. రైతు అకాల మరణం చెందితే జీవిత భాగస్వామికి పథకం వర్తిస్తుంది. ఆ తరువాత ఆమెకు 50 శాతం పింఛను అందుతుంది.

పీఎం కిసాన్ స్కీమ్ కింద.. ప్రభుత్వం ప్రతి ఏటా.. అర్హులైన రైతులకు రూ. 2,000 చొప్పున 3 విడతలుగా రూ. 6,000 ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ మొత్తం నేరుగా రైతు ఖాతాల్లో పడుతుంది. ఒకవేళ రైతులు మాన్‌ధన్‌ కింద ప్రీమియం చెల్లించాలనుకుంటే.. రిజిస్ట్రేషన్ సులభంగా జరుగుతుంది. మాన్‌ధన్‌ కింద చెల్లించాలని అనే ఆప్షన్ ఎంచుకుంటే... ప్రతి నెల ప్రీమియం చెల్లించాల్సిన డబ్బులు పీఎం కిసాన్ యోజన కింద వచ్చే డబ్బుల నుంచి కట్ అవుతాయి. ఇలా అయితే రైతుల తమ చేతులో నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండదు.

Also Read: KCR Starts Dalitha Bandhu: రూ. 10 లక్షలు ఇస్తున్నాం.. రాబోయే ఏడాదిలో రూ. 20 లక్షలు చేసి చూపించాలే.. దళిత బంధు సభలో కేసీఆర్

Published at : 17 Aug 2021 02:01 AM (IST) Tags: PM Kisan PM Kisan Maandhan Yojana Farmers Pension PM Kisan Maandhan Yojana Apply

ఇవి కూడా చూడండి

Mynampally Hanumanth Rao Resign: బీఆర్ఎస్‌కు ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు రాజీనామా

Mynampally Hanumanth Rao Resign: బీఆర్ఎస్‌కు ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు రాజీనామా

Nara Lokesh: మరికొన్ని రోజులు ఢిల్లీలోనే లోకేశ్! ఆ పరిణామంతో ఒక్కసారిగా మారిన నిర్ణయం!

Nara Lokesh: మరికొన్ని రోజులు ఢిల్లీలోనే లోకేశ్! ఆ పరిణామంతో ఒక్కసారిగా మారిన నిర్ణయం!

Telangana Rain: మరో మూడు రోజుల్లో భారీ వర్షాలు, 16 జిల్లాల్లో అలర్ట్ - వెల్లడించిన వాతావరణ శాఖ

Telangana Rain: మరో మూడు రోజుల్లో భారీ వర్షాలు, 16 జిల్లాల్లో అలర్ట్ - వెల్లడించిన వాతావరణ శాఖ

ABP Desam Top 10, 22 September 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 22 September 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ECIL: ఈసీఐఎల్‌లో 484 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు, అర్హతలివే

ECIL: ఈసీఐఎల్‌లో 484 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు, అర్హతలివే

టాప్ స్టోరీస్

Pocharam Srinivas: చంద్రబాబు అరెస్ట్‌పై తెలంగాణ స్పీకర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Pocharam Srinivas: చంద్రబాబు అరెస్ట్‌పై తెలంగాణ స్పీకర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Minister KTR: బీజేపీ నుంచి BRSలోకి వలసలు, కేటీఆర్ సమక్షంలో చేరిన కీలక నేత

Minister KTR: బీజేపీ నుంచి BRSలోకి వలసలు, కేటీఆర్ సమక్షంలో చేరిన కీలక నేత

Chandrayaan 3 Reactivation: చంద్రయాన్ రీయాక్టివేషన్ కోసం ఇస్రో కసరత్తులు, ఇప్పటిదాకా నో సిగ్నల్స్ - ఇస్రో

Chandrayaan 3 Reactivation: చంద్రయాన్ రీయాక్టివేషన్ కోసం ఇస్రో కసరత్తులు, ఇప్పటిదాకా నో సిగ్నల్స్ - ఇస్రో

iPhone 15 Series: ఐఫోన్ 15 సిరీస్ కోసం స్టోర్ల దగ్గర పడిగాపులు మొదలు - డెలివరీలు ఎప్పటి నుంచి ప్రారంభం కావచ్చు?

iPhone 15 Series: ఐఫోన్ 15 సిరీస్ కోసం స్టోర్ల దగ్గర పడిగాపులు మొదలు - డెలివరీలు ఎప్పటి నుంచి ప్రారంభం కావచ్చు?