అన్వేషించండి

Weather Updates: బంగాళాఖాతంలో అల్పపీడనం... తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజుల్లో ఉరుములు, మెరుపులతో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖలు వెల్లడించాయి.

తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రాలు తెలిపారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న మూడు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉప‌రి‌తల ఆవ‌ర్తనం, ఉప‌రి‌తల ద్రోణి ప్రభా‌వంతో తూర్పు, ఈశాన్య, ఉత్తర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బంగాళాఖాతం ఒడిశా తీరంలో 3.1 కిలోమీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని పేర్కొంది. రుతుపవనాలు ప్రభావంతో ఇవాళ ఈశాన్య, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.

Also Read: PM Kisan Maandhan Pension Scheme: రైతులకు గుడ్ న్యూస్..మీ జేబులో నుంచి ఒక్క రూపాయి తీయకుండా ఈ పెన్షన్ పొందవచ్చు

పలు జిల్లాల్లో భారీ వర్షం

నిన్న తెలంగాణ వ్యాప్తంగా  పలు జిల్లాలో భారీ వర్షం కురిసింది. జగిత్యాల, కరీంనగర్‌, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షం పడింది. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడ్డాయి. సోమవారం ఉదయం 8 గంటల వరకు జగిత్యాల జిల్లా కోరుట్లలో 12.9 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదు అయ్యింది. ఆ తర్వాత వికారాబాద్‌ జిల్లా పుట్టపహాడ్‌లో 11.5 సెంటీమీటర్లు, సిద్దిపేట జిల్లా దూల్‌మిట్టాలో 10.7 సెం.మీ, జనగామ జిల్లా బచ్చన్నపేటలో 9.9 సెం.మీ, మహబూబ్‌నగర్‌ జిల్లా మహ్మదాబాద్‌లో 9.2 సెం.మీ, కరీంనగర్‌ జిల్లా నుస్తులాపూర్‌లో 8.6 సెం.మీ, భద్రాద్రి జిల్లా పెంట్లంలో 8 సెం.మీ వర్షపాతం నమోదైంది. 

Also Read: Horoscope Today : ఆ రాశివారు ఈ రోజు శుభవార్త వింటారు... వీళ్లు మాత్రం అనవసరంగా రిస్క్ తీసుకోవద్దు…

ఏపీలో భారీ వర్షాలు

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ప్రభావంతో ఇవాళ ఏపీలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఏపీలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తులశాఖ పేర్కొంది. తీరం వెంబడి గంటకు 50-60 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. సముద్రం అలజడిగా  ఉంటుందని మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారుల సూచించారు. ఏపీలో గత రెండు రోజులుగా పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి.  సోమవారం కూడా రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. ఇవాళ కూడా వర్షాలు కురుస్తాయన్న అంచనాలతో ప్రభుత్వం అధికారుల్ని అప్రమత్తం చేసింది. 

 

Also Read: IND vs ENG, 2 Test Highlights: లార్డ్స్ టెస్టులో భారత్ ఘన విజయం... 1-0 ఆధిక్యంలో భారత్... ఇంగ్లాండ్ 120 ఆలౌట్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana TET Exam Dates: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Nellore Alert : నెల్లూరులో జికా వైరస్ కేసు - డాక్టర్ల బృందం పర్యటన - ఈ జాగ్ర్తతలు తీసుకోవాల్సిందే !
నెల్లూరులో జికా వైరస్ కేసు - డాక్టర్ల బృందం పర్యటన - ఈ జాగ్ర్తతలు తీసుకోవాల్సిందే !
Poco M7 Pro 5G: పోకో ఎం7 ప్రో 5జీ వచ్చేసింది - బడ్జెట్ ధరలో మంచి ఫోన్!
పోకో ఎం7 ప్రో 5జీ వచ్చేసింది - బడ్జెట్ ధరలో మంచి ఫోన్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆటోలో అసెంబ్లీకి, కేటీఆర్ సహా బీఆఎర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనరేవంత్ ఎక్కడికెళ్లినా సెక్యూరిటీని పెట్టుకో, లేకుంటే కొడతారుఎడతెరపి లేకుండా వర్షం, డ్రాగా ముగిసిన గబ్బా టెస్ట్అలిగిన అశ్విన్, అందుకే వెళ్లిపోయాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana TET Exam Dates: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Nellore Alert : నెల్లూరులో జికా వైరస్ కేసు - డాక్టర్ల బృందం పర్యటన - ఈ జాగ్ర్తతలు తీసుకోవాల్సిందే !
నెల్లూరులో జికా వైరస్ కేసు - డాక్టర్ల బృందం పర్యటన - ఈ జాగ్ర్తతలు తీసుకోవాల్సిందే !
Poco M7 Pro 5G: పోకో ఎం7 ప్రో 5జీ వచ్చేసింది - బడ్జెట్ ధరలో మంచి ఫోన్!
పోకో ఎం7 ప్రో 5జీ వచ్చేసింది - బడ్జెట్ ధరలో మంచి ఫోన్!
Ravichandran Ashwin: అశ్విన్... స్పిన్ కింగ్, క్రికెట్ పిచ్ పై చెరగని సంతకం రవిచంద్రన్
అశ్విన్... స్పిన్ కింగ్, క్రికెట్ పిచ్ పై చెరగని సంతకం రవిచంద్రన్
Thandel Second Single: కాశీలో... శివుడి సన్నిధిలో 'తండేల్' సెకండ్ సాంగ్ రిలీజ్... 'శివ శక్తి'లో చైతన్య - సాయి పల్లవిని చూశారా?
కాశీలో... శివుడి సన్నిధిలో 'తండేల్' సెకండ్ సాంగ్ రిలీజ్... 'శివ శక్తి'లో చైతన్య - సాయి పల్లవిని చూశారా?
Telangana Congress Protest : తెలంగాణ రాజ్‌భవన్ ముట్టడికి సీఎం, డీసీఎం యత్నం- అడ్డుకున్న పోలీసులు- రాష్ట్రపతి భవన్ వద్ద ధర్నా చేస్తామన్న రేవంత్
తెలంగాణ రాజ్‌భవన్ ముట్టడికి సీఎం, డీసీఎం యత్నం- అడ్డుకున్న పోలీసులు- రాష్ట్రపతి భవన్ వద్ద ధర్నా చేస్తామన్న రేవంత్
Are Kapu Community Leaders Suffocating In YSRCP: జగన్‌కు కాపు సామాజిక వర్గం మరింత దూరం అవుతోందా..?
జగన్‌కు కాపు సామాజిక వర్గం మరింత దూరం అవుతోందా..?
Embed widget