Petrol Diesel Price 16 October 2021: వరుసగా మూడో రోజూ పెరిగిన ఇంధన ధరలు... ప్రధాన నగరాల్లో ఇవాళ్టి పెట్రోల్, డీజిల్ ధరలు
వరుసగా మూడో రోజూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఇవాళ(శనివారం) లీటర్ పెట్రోల్ ధరపై 36 పైసలు, డీజిల్ ధరపై 38 పైసలు పెరిగింది.
దేశంలో చమురు ధరల పెంపు కొనసాగుతూనే ఉంది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా మూడో రోజూ పెరిగాయి. గత మూడు వారాల్లో డీజిల్ ధరలు 18 సార్లు, పెట్రోల్ ధరలు 15 సార్లు పెరిగాయి. శనివారం లీటర్ పెట్రోల్ ధర 36 పైసలు, డీజిల్‌పై 38 పైసలు పెరిగాయి. హైదరాబాద్‌లో లీటర్ డీజిల్ ధర రూ. 102.80, లీటర్ పెట్రోల్ ధర రూ.109.73గా ఉంది. వరంగల్‌లో తాజాగా పెట్రోల్ ధర రూ.0.57 పైసలు పెరిగి రూ.109.09గా ఉంది. డీజిల్ ధర రూ.0.58 పైసలు పెరిగి రూ.102.15 గా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర. రూ.109.24, డీజిల్ ధర రూ.102.29 గా ఉన్నాయి.
Also read: మహనీయుల్లో కనిపించే లక్షణాలు ఇవన్నీ... నేర్చుకుంటే మీరూ గొప్పవారే
కరీంనగర్‌లో పెట్రోల్ ధర ముందు రోజు ధరతో పోలిస్తే రూ.0.53 పైసలు పెరిగి.. రూ.109.70గా ఉంది. డీజిల్ ధర రూ.0.54 పైసలు పెరిగి రూ.102.72 కు చేరింది. నిజామాబాద్‌లోనూ ఇంధన ధరలు కాస్త పెరిగాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ.0.07 పైసలు పెరిగి రూ.111.15 గా ఉంది. డీజిల్ ధర రూ.0.10 పైసలు పెరిగి రూ.104.07 గా ఉంది. గత కొన్ని రోజులుగా ఇక్కడ ఇంధన ధరల్లో ఎక్కువగా హెచ్చుతగ్గులు ఉన్నాయి.
Also Read: బాగా బతకడమంటే ఎక్కువ సంపాదించడం కాదు, బాగా తినడం!
ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
ఇక విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధరలు తాజాగా పెరిగాయి. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర. రూ.112.04 గా ఉంది. పెట్రోల్ ధర రూ.0.56 పైసలు పెరిగింది. డీజిల్ ధర రూ.0.56 పైసలు పెరిగి రూ.104.44కు చేరింది. అయితే, అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా పెరుగుతూనే ఉన్నాయి. విశాఖపట్నం ఇంధన మార్కెట్‌లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.110.99గా ఉంది. గత ధరతో పోలిస్తే రూ.0.71 పైసలు పెరిగింది. డీజిల్ ధర విశాఖపట్నంలో రూ.103.43గా ఉంది. విశాఖలో కూడా కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో సరాసరి హెచ్చు తగ్గులు ఉంటున్నాయి. చిత్తూరులో ఇంధన ధరల్లో పెరుగుదల కనిపించింది. లీటరు పెట్రోలు ధర రూ.111.97 కు చేరింది. ఇక డీజిల్ ధర రూ.104.33గా ఉంది.
Also Read: మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు... ప్రధాన నగరాల్లో ఇవాళ్టి ధరలు ఇలా
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి