By: ABP Desam | Updated at : 15 Jan 2022 07:49 AM (IST)
పెట్రోల్, డీజిల్ ధరలు (File Photo)
Petrol-Diesel Price 15 January 2022: గత ఏడాది డిసెంబర్ తొలి వారం నుంచి దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు నిలకడగా ఉన్నాయి. అక్కడ పెట్రోల్ లీటర్ ధర రూ.95.41, డీజిల్ ధర రూ.86.67 వద్ద ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో గత ఏడాది డిసెంబర్ రెండో వారం నుంచి ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి.పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20 వద్ద ఉండగా.. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
ఇక వరంగల్‌లో పెట్రోల్ ధర 27 పైసలు తగ్గగా లీటర్ ధర రూ.107.69 అయింది. డీజిల్‌పై 25 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.94.14 కి పతనమైంది. వరంగల్ రూరల్ జిల్లాలో పెట్రోల్ లీటర్ ధర రూ.107.92 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.94.35గా ఉంది. కరీంనగర్ లో పెట్రోల్ ధర 18 పైసలు తగ్గడంతో నేడు లీటర్ ధర రూ.108.39 కాగా, 16 పైసలు తగ్గడంతో డీజిల్ ధర రూ.94.79 అయింది. నిజామాబాద్‌లో ఇంధన ధరలు భారీగా పెరిగాయి. పెట్రోల్ పై రూ.0.56 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.110.09 అయింది. డీజిల్ ధర రూ.0.53 పైసలు పెరగడంతో రూ.96.38 అయింది. గత కొన్ని రోజులుగా నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు..
ఇక విజయవాడలో పెట్రోల్ లీటర్ ధర రూ.110.32 అయింది. ఇక్కడ డీజిల్ ధర రూ.96.41కి తగ్గింది. అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉన్నాయి. విశాఖపట్నం మార్కెట్‌లో పెట్రోల్ ధర 0.35 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.109.40 అయింది. డీజిల్ ధర 0.33 పైసలు పెరగడంతో విశాఖపట్నంలో డీజిల్ ధర లీటర్ రూ.95.51 కు చేరింది.
చిత్తూరు జిల్లాలో..
చిత్తూరులోనూ ఇంధన ధరలు భారీగా దిగొచ్చాయి. లీటరుపై 39 పైసలు తగ్గడంతో పెట్రోలు ధర ప్రస్తుతం రూ.110.93 కి దిగొచ్చింది. ఇక డీజిల్ ధర రూ.0.37 పైసల మేర తగ్గడంతో ధర లీటర్ ధర రూ.96.91 అయింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి.
ధరల పెరుగుదలకు కారణం..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులు పెంచడంతో ఇంధన ధరలు పెరిగాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.30 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా డిసెంబరు 2 నాటి ధరల ప్రకారం 66.52 డాలర్ల వద్ద ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఆ పెంచిన పన్నులను తగ్గించలేదు. అందుకే ఇంధన ధరలు మన దేశంలో జీవితాల గరిష్ఠానికి చేరుతూ సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
Also Read: ఓర్నీ.. చేప వీర్యంతో స్పెషల్ కర్రీ.. అంత కరువేంది బ్రో!
Also Read: Gold Silver Price Today: మళ్లీ భగ్గుమన్న బంగారం ధర.. స్వల్పంగా తగ్గిన వెండి.. లేటెస్ట్ రేట్లు ఇవే..
Also Read: Hyderabad: దేశంలోనే హైదరాబాద్ టాప్.. పదేళ్లలో ఎంత మార్పో..! కేంద్రం తాజా నివేదికలో స్పష్టం
Also Read: బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్, ఉపకారవేతనాలు వెంటనే చెల్లించాలి
Economic Survey 2023: భారత ఎకానమీకి 5 బూస్టర్లు - ట్రెండ్ కొనసాగిస్తే మన రేంజు మారిపోద్ది!
Adani Enterprises FPO: అదానీ ఎంటర్ ప్రైజెస్ FPO సూపర్ హిట్టు! పూర్తిగా సబ్‌స్క్రైబ్ - ఇన్వెస్టర్లకు భయం పోయిందా?
Stock Market News: బడ్జెట్ ముందు పాజిటివ్‌గా స్టాక్ మార్కెట్ల ముగింపు - రేపు డబ్బుల వర్షమేనా!!
Cryptocurrency Prices: ఒక్కసారిగా పడిపోయిన బిట్ కాయిన్ - రూ.55 వేలు డౌన్!
Adani Group Buyback: అదానీ షేర్లలో బైబ్యాక్ ఉత్సాహం, తూచ్ అంతా ఉత్తదేనన్న మేనేజ్మెంట్
హైదరాబాద్ లో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం, కీలక ప్రకటన చేసిన శాండోస్ కంపెనీ
కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని
Dhanbad Fire Accident: జార్ఖండ్‌లో భారీ అగ్నిప్రమాదం, అపార్ట్ మెంట్లో మంటలు చెలరేగి 14 మంది దుర్మరణం
Director Atlee: తండ్రయిన అట్లీ, పండంటి బాబు పుట్టినట్లు వెల్లడి