Hyderabad: దేశంలోనే హైదరాబాద్ టాప్.. పదేళ్లలో ఎంత మార్పో..! కేంద్రం తాజా నివేదికలో స్పష్టం
మెట్రో నగరాల్లో 2011-2021 మధ్య కాలంలో అటవీ విస్తీర్ణం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 48.66 చదరపు కిలో మీటర్లు పెరిగింది.
గత రెండేళ్ల వ్యవధిలో దేశవ్యాప్తంగా 2,261 చదరపు కిలోమీటర్ల మేర అటవీ విస్తీర్ణం పెరిగినట్లుగా ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదికలో వెల్లడైంది. అదే సమయంలో ఈశాన్య భారతంలో అటవీ విస్తీర్ణం తగ్గగా.. ఏపీ, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లో అత్యధికంగా అటవీ విస్తీర్ణం పెరిగింది. అంతేకాక, 2019తో పోలిస్తే దేశంలో మడ అడవుల విస్తీర్ణం 17 చదరపు కిలోమీటర్లు మాత్రమే పెరిగింది. ప్రతి రెండేళ్లకు ఓ సారి తయారు చేసే ఈ నివేదికలో కీలక విషయాలు వెల్లడించారు.
దేశంలోని మెట్రో నగరాల్లో 2011-2021 మధ్య కాలంలో అటవీ విస్తీర్ణం గ్రేటర్‌లో అత్యధికంగా 48.66 చదరపు కిలో మీటర్లు పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో 19.91 చదరపు కిలో మీటర్లు పెరిగింది. ఇదే సమయంలో అహ్మదాబాద్‌లో 8.55 చదరపు కిలో మీటర్లు, బెంగళూరులో 4.98 చదరపు కిలో మీటర్ల చొప్పున తగ్గింది. జీహెచ్‌ఎంసీ విస్తీర్ణం 634.18 చదరపు కిలో మీటర్ల పరిధిలో 2011లో కేవలం 33.15 చదరపు కిలో మీటర్ల మేర పచ్చదనం ఉండగా అది 2021లో 81.81 చదరపు కిలో మీటర్లకు మీటర్లకు పెరిగింది. దీంతో నగరంలో పచ్చదనం శాతం 5.23 శాతం నుంచి 12.9 శాతానికి పెరిగినట్లయింది.
Also Read: Hyderabad: తల్లికి అంత్యక్రియలు చేసిన కొడుకు.. వెంటనే అదే శ్మశానంలో ఉరేసుకొని..
తెలంగాణలో కలిసొచ్చిన హరిత హారం
ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్ర ప్రభుత్వం హరితహారం వంటి కార్యక్రమాలతో పచ్చదనం పెంపు కార్యక్రమాలు చేపట్టింది. గ్రేటర్ నగరంలో ఇప్పటి వరకు నిర్వహించిన హరిత హారం కార్యక్రమాల్లో భాగంగా దాదాపు 4 కోట్ల మొక్కలు ప్రభుత్వం తరపున నాటారు. ప్రజలకు పంపిణీ చేసి వారి చేత కూడా మొక్కలు నాటించారు.
హైదరాబాద్‌లో ప్రత్యేకంగా పచ్చదనం పెంచడం కోసం జీహెచ్‌ఎంసీ బడ్జెట్‌లో గ్రీన్ బడ్జెట్ పేరిట 10 శాతం నిధులు కేటాయించారు. నగరంలోని దాదాపు 4,850 కాలనీల్లో ఎక్కడా ఖాళీ స్థలం కనబడకుండా మొక్కలు నాటే చర్యలు తీసుకున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో సముద్రపు తుపానులు పెరగడం, వర్షాలు కురవకపోవడం అడవుల విస్తీర్ణంలో మార్పులకు ప్రధాన కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Also Read: అరె ఏంట్రా ఇది.. లోన్ రిజెక్ట్ చేశారని ఏకంగా బ్యాంకునే తగలెట్టేశాడు, అంతా బూడిదే
Also Read: Mahabubnagar: బైక్‌పై లవర్స్ త్రిబుల్ రైడింగ్.. మధ్యలో శవం, ఇంతలో షాకింగ్ సీన్
Also Read: Nalgonda Crime: గుడి ముందు మనిషి తలకాయ, ఈ మిస్టరీ కీలక వివరాలు వెలుగులోకి.. మృతుడు ఎవరంటే..