By: ABP Desam | Updated at : 16 Oct 2021 02:37 PM (IST)
Edited By: Ramakrishna Paladi
పీఎఫ్ బ్యాలెన్స్ చెక్
దాదాపుగా ఉద్యోగులందరికీ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలు ఉంటాయి. ఉద్యోగితో పాటు యజమాని సైతం నెలనెలా అందులో డబ్బులను డిపాజిట్ చేస్తారు. అసంఘటిత రంగంలోనూ ఎంతోమందికి ఈపీఎఫ్ ఖాతాలు ఉన్నాయి. వారంతా పీఎఫ్ ఖాతాలో నగదు జమ ఎలా అవుతుందో? ఎప్పుడు చేస్తున్నారో? ఎంత బ్యాలెన్స్ ఉందో? చూసుకోవడం అవసరం. పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకొనేందుకు ఉద్యోగ భవిష్య నిధి సంస్థ ఏర్పాట్లు చేసింది. ఇప్పుడు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానాల్లో పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.
Also Read: ఒక్క రూపాయికే గ్రాసరీస్.. 200 క్యాష్ బ్యాక్.. అమెజాన్ ప్యాంట్రీలో ఆఫర్లు
ప్రస్తుతం పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకొనే ప్రక్రియ మొత్తం డిజిటల్ రూపంలోకి మారింది. మీరు ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్‌కు లాగిన్ అవ్వడం లేదా టెక్ట్స్ మెసేజ్ లేదా మిస్‌డ్ కాల్ సౌకర్యం ద్వారా తెలుసుకోవచ్చు. అయితే ఇందుకు మీ ఈపీఎఫ్‌వో నంబర్ అవసరం అవుతుంది. పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకొనేందుకు ముందే యూఏఎన్ లేదా ఈపీఎఫ్‌వో ఖాతా నంబర్ తీసుకోవడం ముఖ్యం.
Also Read: 4 రోజుల్లో రూ.1331 కోట్లు లాభం.. ఆ రెండు టాటా కంపెనీలతో పెరిగిన ఝున్‌ఝున్‌వాలా సంపద
ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్‌లో తెలుసుకోవడం
* మొదట https://passbook.epfindia.gov.in/MemberPassBook/Login లింకును వెబ్‌బ్రౌజర్‌లో ఎంటర్ చేయాలి.
* మీ యూఏఎన్ నంబర్, పాస్‌వర్డ్, క్యాప్చా వెరిఫికేషన్‌తో లాగిన్ అవ్వాలి.
* ఆ తర్వాత మెంబర్ ప్రొఫైల్ కనిపిస్తుంది.
* పాస్‌బుక్‌పై వ్యూ బటన్‌ను క్లిక్ చేయాలి. అప్పుడు మరో విండోకు రీడైరెక్ట్ అవుతుతుంది. అక్కడ మీ యూఏఎన్, పాస్‌వర్డ్, క్యాప్చాను మళ్లీ ఎంటర్ చేయాలి.
* యునిఫైడ్ మెంబర్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక ఆరు గంటలు మాత్రమే మీ పాస్‌బుక్ అందుబాటులో ఉంటుంది.
Also Read: క్రిప్టోకరెన్సీని నమ్ముకున్నారా? అయితే మీ పని ఇక అంతే! మీకు అర్థమవుతుందా?
ఎస్‌ఎంఎస్ విధానం
* మీ ఫోన్లో ఎస్‌ఎంఎస్ యాప్‌ను ఓపెన్ చేసి 7738299899 నంబర్‌ను సెండర్‌లో పెట్టాలి.
* మీ EPFOHOను టైప్ చేశాక 12 సంఖ్యల యూఏఎన్ నంబర్‌ను టైప్ చేయాలి. ఆ తర్వాత సెండ్ కొట్టాలి.
* వెంటనే బ్యాలెన్స్ చూపిస్తూ తిరిగి మీకు సందేశం వస్తుంది.
* మిస్‌డ్ కాల్ విధానం
మీ నమోదిత మొబైల్ నంబర్ ద్వారానూ పీఎఫ్ బాలెన్స్ తెలుసుకోవచ్చు. మీరు చేయాల్సిందల్లా 011-22901406 నంబర్‌కు మిస్‌డ్ కాల్ ఇవ్వడమే. చేయగానే పీఎఫ్ బ్యాలెన్స్ తెలుపుతూ ఎస్‌ఎంఎస్ వస్తుంది.
Also Read: ఉద్యోగం వద్దు బాబోయ్! లక్షల్లో రాజీనామాలు.. ఉక్కిరిబిక్కిరి అవుతున్న కంపెనీలు!
Gold and Silver Prices: నేటి బంగారం ధర: బంగారం, వెండి ధరలు తగ్గాయి, జనవరి 8న బంగారం ఎంత చౌకగా వచ్చిందో తెలుసుకోండి
YouTube Earnings : యూట్యూబ్‌లో 5,000 వ్యూస్ వస్తే ఎంత డబ్బు వస్తుంది? అసలు నిజం ఇదే
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
Gold Jewellery Insurance: బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది
Best Investment Options: తల్లి పేరు మీద ఇన్వెస్ట్ చేస్తే అధిక వడ్డీ ప్రయోజనాలు.. ఆ స్కీమ్స్ చూశారా
Seethakka Surekha meets KCR: ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
Jagan: రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
Geetu Mohandas: ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్... డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్
Revanth Reddy comments: కార్పొరేట్ కంపెనీల కోసమే ఉపాధి హామీ పథకంలో మార్పులు- మోదీ ప్రభుత్వంపై రేవంత్ సంచలన ఆరోపణలు