అన్వేషించండి

Gold and Silver Price: పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!

Gold and Silver Price: ప్రస్తుతానికి మార్కెట్‌ ట్రెండ్‌ ప్రతికూలంగానే ఉంది. బంగారం ధరలు 1,52,000 వద్ద వెండి 2,60,000 వద్ద రిసిస్టెన్స్‌ వస్తుందని చెబుతున్నారు

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఇరాన్ యుద్ధం ముదురుతున్నా బంగారం, వెండి ధరలు గణనీయంగా పడిపోయాయి.
  • అమెరికా బాండ్ల రాబడి పెరగడం, డాలర్ బలపడటం ధరల పతనానికి కారణాలు.
  • భారీ లివరేజ్ ట్రేడింగ్, స్టాప్-లాస్ ఆర్డర్లు మార్కెట్‌లో ఒత్తిడిని పెంచాయి.
  • భారత్‌లోనూ బంగారం, వెండి ధరలు లోయర్ సర్క్యూట్‌ను తాకి, దిగుమతులు దెబ్బతిననున్నాయి.

Gold and Silver Price: ప్రపంచ ఆర్థిక మార్కెట్‌లు ఊహించని షాక్‌కు గురయ్యాయి. సాధారణంగా యుద్ధం వాతావరణం ఉన్నప్పుడు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని తాకాలి. కానీ ఇరాన్ యుద్ధం ముదురుతున్న వేళ అందుకు భిన్నంగా విలువైన లోహాల మార్కెట్ కుప్పకూలింది కేవలం మూడు గంటల వ్యవధిలోనే బంగారం, వెండి మార్కెట్‌ విలువ నుంచి ఏకంగా 2 ట్రిలియన్ డాలర్లు అంటే సుమారు 165 లక్ష ళ కోట్లు తుడిచిపెట్టుకుపోయాయి. గ్లోబల్ మార్కెట్ చరిత్రలోనే ఇదొక అత్యంత వింతైన, ఆందోళనకరమైన పరిణామంగా ఆర్థిక నిపుణులు అభివర్ణిస్తున్నారు. 

యుద్ధం ఉన్నా బంగారం ధర ఎందుకు పడిపోయింది?

ఆర్థిక పాఠ్యపుస్తకాల ప్రకారం యుద్ధం లేదా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరిగినప్పుడు పెట్టుబడిదారులు తమ సొమ్మును సురక్షితంగా ఉంచుకోవడానికి బంగారం వైపు మొగ్గు చూపుతారు. అయితే ప్రస్తుతం ఇరాన్ యుద్ధం తీవ్రతరం అవుతున్నా, చమురు ధరలు పెరుగుతున్నా బంగారం ధరలు  పడిపోవడం వెనుక బలమైన ఆర్థిక కారణాలు ఉన్నాయి. 

దీనికి ప్రధాన కారణం అమెరికా బాండ్ మార్కెట్‌. అమెరికా పది ఏళ్ల ట్రెజరీ బాండ్ల రిటర్న్‌లు కేవలం కొన్ని వారాల్లోనే 4.4 శాతానికి చేరుకున్నాయి. సాధారణంగా బంగారంపై ఎలాంటి వడ్డీ రాదు. కానీ ప్రభుత్వం బాండ్లు 4.4 శాతం లాభాన్ని ఇస్తున్నప్పుడు, పెద్ద పెట్టుబడిదారులు బంగారాన్ని వదిలి బాండ్ల వైపు మళ్లుతున్నారు. దీని వల్ల బంగారం తన అల్టిమేట్‌ హెడ్జ్‌ హోదాను కోల్పోయి కేవలం ఒక సాధారణ రిస్క్ అసెట్‌లా మారింది. 

డాలర్ బలపడటం లోహాలకు శాపం 

ఇరాన్ యుద్ధం పెరుగుతున్న కొద్దీ, అమెరికా డాలర్‌ మళ్లీ పుంజుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్‌ బలపడితే, ఇతర కరెన్సీలలో బంగారం కొనడం ఖరీదుగా మారుతుంది. ఇది సహజంగానే బంగారంపై ఒత్తిడి పెంచుతుంది. పెట్టుబడిదారులు బంగారంతో పోలిస్తే డాలర్‌ను మరింత సురక్షితమైనదిగా భావించడం వల్ల పసిడి విక్రయాలు వెల్లువెత్తాయి. 

టెక్నికల్ పతనం- లిక్విడిటీ మాయం 

మార్కెట్‌ పరిశోధన సంస్థ కోబీసీ లెటర్‌ వ్యవస్థాపకుడు ఆడమ్‌ కో బీసీ అభిప్రాయం ప్రకారం, మార్కెట్‌లో ఏదో పెద్ద అపశృతి చోటు చేసుకుంది. గత కొన్ని నెలలుగా బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరగడంతో, చాలా మంది పెట్టుబడిదారులు భారీ స్థాయిలో లివరేజ్‌ తీసుకొని ట్రేడింగ్ చేశారు ధరలు ఒక్కసారిగా కీలక స్థాయిల కంటే కిందకు పడిపోవడంతో స్టాప్‌ లాస్‌ ఆర్డర్లు యాక్టివేట్ అయ్యాయి. దీని వల్ల సెకన్ల వ్యవధిలోనే ధరలు పాతాళానికి పడిపోయాయి. 

పెట్టుబడిదారులు తమ ఇతర నష్టాలను భర్తీ చేసుకోవడానికి బంగారాన్ని ఏటీఎఁ కార్డులా వాడుకుని నగదుగా మార్చుకుంటున్నారు. దీనిని నిపుణులు ఫోర్స్డ్‌ డిలివరేజింగ్ లేదా మార్జినల్ కాల్ అని పిలుస్తున్నారు. 

భారత్ మార్కెట్లపై ప్రభావం 

భారత్‌లోని మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌లో కూడా పసిడి మంటలు రేపింది. సోమవారం ట్రెడింగ్‌లో బంగారం, వెండి కాంట్రాక్టులు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. ఎంసీఎక్స్ గోల్డ్ ధర పది గ్రాములు 1,44,800 వద్ద ట్రేడ్ అవుతుంది. గత వారంలోనే ఇది 8 శాతం కంటే ఎక్కువ పతనమైంది. వెండి ధరలు మరింత దారుణంగా పడిపోయాయి. కిలో వెండి 10.72 శాతం తగ్గి 2,02,465 స్థాయికి చేరింది. గోల్డ్‌ ఈటీఎఫ్‌లు కూడా 9 శాతం వరకు నష్టపోయాయి. 

పరిశ్రమ దిగ్గజాల ఆందోళన 

చమురు సరఫరాలో అంతరాయాలు ద్రవ్యోల్బణానికి దారి తీస్తాయనే భయం మార్కెట్‌లను వణికిస్తోంది. వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉండటంతో దేశీయంగా బంగారం వినియోగంపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం అవుతోంది. రత్నాలు, ఆభరణాల ఎగుమతులు ఈ సంక్షోభం వల్ల తీవ్ర దెబ్బతినే అవకాశం ఉంది. 

భవిష్యత్‌ ఎలా ఉంటుంది?

ప్రస్తుతానికి మార్కెట్‌ ట్రెండ్‌ ప్రతికూలంగానే ఉంది. బంగారం ధరలు 1,52,000 వద్ద వెండి 2,60,000 వద్ద రిసిస్టెన్స్‌ వస్తుందని చెబుతున్నారు యుద్ధం కంటిన్యూ అయితే ద్రవ్యోల్బణం పెరిగి మళ్లీ బంగారం తన విలువను తిరిగి పొందే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. 

 కానీ ప్రస్తుతం జరుగుతున్న ఈ ప్రళయ కేవలం ఒక ఆరంభం మాత్రమేనా? ఇదే ఒత్తిడి ఇతర మార్కెట్లు అంటే క్రెడిట్ మార్కెట్, బిగ్ టెక్ కంపెనీలపై పడితే పరిస్థితి ఏంటీ అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను వేధిస్తున్నాయి. పెట్టుబడిదారులు ప్రస్తుతానికి అప్రమత్తంగా ఉండాలని, ధరలు పెరిగిన ప్రతిసారీ విక్రయించే వ్యూహాన్ని అనుసరించాలని నిపుణులు సూచిస్తున్నారు. 

Frequently Asked Questions

ఇరాన్ యుద్ధం ముదురుతున్న వేళ బంగారం, వెండి ధరలు ఎందుకు పడిపోయాయి?

అమెరికా పది ఏళ్ల ట్రెజరీ బాండ్ల రిటర్న్స్ పెరగడం, డాలర్ బలపడటం, మరియు టెక్నికల్ పతనం వంటి కారణాల వల్ల బంగారం, వెండి ధరలు పడిపోయాయి.

అమెరికా బాండ్ మార్కెట్ బంగారం ధరపై ఎలా ప్రభావం చూపింది?

అమెరికా బాండ్లు 4.4 శాతం లాభాన్ని ఇస్తున్నప్పుడు, పెద్ద పెట్టుబడిదారులు బంగారాన్ని వదిలి బాండ్ల వైపు మళ్లారు. దీనివల్ల బంగారం తన సురక్షిత పెట్టుబడి హోదాను కోల్పోయింది.

డాలర్ బలపడటం బంగారం ధరలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

డాలర్ బలపడితే, ఇతర కరెన్సీలలో బంగారం కొనడం ఖరీదుగా మారుతుంది. ఇది బంగారంపై ఒత్తిడి పెంచుతుంది మరియు పెట్టుబడిదారులు డాలర్‌ను సురక్షితంగా భావించడం వల్ల అమ్మకాలు వెల్లువెత్తుతాయి.

టెక్నికల్ పతనం అంటే ఏమిటి మరియు అది బంగారం ధరలను ఎలా ప్రభావితం చేసింది?

పెట్టుబడిదారులు భారీగా లివరేజ్ తీసుకొని ట్రేడింగ్ చేసినప్పుడు, ధరలు కీలక స్థాయిల కంటే కిందకు పడిపోతే స్టాప్-లాస్ ఆర్డర్లు యాక్టివేట్ అయి, సెకన్ల వ్యవధిలో ధరలు పతనమవుతాయి.

భారతదేశంలో బంగారం, వెండి ధరలపై ఈ పరిణామాల ప్రభావం ఎలా ఉంది?

భారతదేశంలోనూ బంగారం, వెండి ధరలు గణనీయంగా పడిపోయాయి. ఎంసీఎక్స్ గోల్డ్, సిల్వర్ కాంట్రాక్టులు లోయర్ సర్క్యూట్ ను తాకాయి మరియు గోల్డ్ ఈటీఎఫ్ లు కూడా నష్టపోయాయి.

టాప్ హెడ్ లైన్స్

EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Gold- Silver Price Today 10 August 2026: ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
FMCG Price Hike: ధరలు పెంచడానికి రెడీ అవుతున్న ఎఫ్‌ఎంసిజి బ్రాండ్లు! మీ ఇంటి బడ్జెట్‌పై ఎఫెక్ట్‌! 
ధరలు పెంచడానికి రెడీ అవుతున్న ఎఫ్‌ఎంసిజి బ్రాండ్లు! మీ ఇంటి బడ్జెట్‌పై ఎఫెక్ట్‌! 
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget