By: ABP Desam | Updated at : 10 May 2023 05:00 PM (IST)
నెక్స్ ఫ్యాన్లు ( Image Source : Social Media )
Business News:
ఈ వేసవిలో చల్లచల్లని గాలి కోసం తపన పడుతున్నారా? అయితే మీలాంటి వారి కోసమే నెక్స్ బ్రాండ్ సరికొత్త ఫ్యాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇవి మార్కెట్‌లో లభిస్తున్న ఫ్యాన్లతో పోలిస్తే 20% అధికంగా గాలిని వెదజల్లుతాయని కంపెనీ తెలిపింది. అతి తక్కువ శబ్దంతో నడుస్తాయని, బీఎల్‌డీసీ సాంకేతికత వల్ల విద్యుత్ వినియోగం తగ్గుతుందని పేర్కొంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేయొచ్చని వెల్లడించింది.
నెక్స్ బ్రాండ్ ఫ్యాన్లను బజాజ్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ విడుదల చేసింది. 'హౌస్ ఆఫ్ బ్రాండ్స్‌గా నిలవాలనే బజాజ్ ఎలక్ట్రికల్స్ ప్రయత్నంలో నెక్స్ ఆవిష్కరణ కీలకమైన మైలురాయిగా నిలుస్తుంది. మార్కెట్ అంతరాన్ని పూడ్చేందుకు ఇది ఉపయోగపడనుంది. మా ప్రస్తుత పోర్ట్‌ఫోలియోను సమున్నతం చేయనుంది. మేం నాలుగు బ్రాండ్లను అందిస్తున్నాము. కస్టమర్లకు సుదీర్ఘ కాలం సేవలు అందించేందుకు నూతన ఆవిష్కరణలు తీసుకొస్తున్నాం'’అని అన్నారు. బజాజ్ ఎలక్ట్రికల్స్ ఎండీ, సీఈఓ అనూజ్ పొద్దార్ అన్నారు.
నగర వాసుల అవసరాలను తీర్చేందుకే.. అనుభవం, సాంకేతికత, డిజైన్ పరంగా సరికొత్త అప్లయన్సెస్‌ను రూపొందిస్తున్నామని నెక్స్ తెలిపింది. గాలి కోసం ఎక్కువ మంది ఫ్యాన్ల మీదే ఆధారపడుతున్నట్టు తమ సర్వేలో తేలిందని పేర్కొంది. వారి కోసమే తాము వినూత్నమైన సాంకేతిక వేదిక ఎయిరాలజీని అభివృద్ధి చేశామంది. ఇది సీలింగ్ ఫ్యాన్‌లోని బ్లేడ్, మోటర్‌తో కలిసి పనిచేస్తూ చల్లని గాలి అనుభవాన్ని అందిస్తుందని వెల్లడించింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
నెక్స్ ఫ్యాన్లలో పీక్ టార్క్ మోటర్ ఉందని కంపెనీ తెలిపింది. ఇది అత్యధిక టార్క్‌ను అందించడమే కాకుండా కస్టమ్ డిజైన్డ్ ఎయిర్‌ఫ్లూయెన్స్ బ్లేడ్స్‌ను అతి తక్కువగా లాగి, అతి తక్కువ శబ్దం వచ్చేలా చేస్తుందని వివరించింది. 20% అధిక గాలిని అందించినప్పటికీ విద్యుత్ వినియోగం తక్కువగానే వినియోగించుకుంటుందని వెల్లడించింది.
Tata Altroz CNG: దేశంలోనే అత్యంత చవకైన సన్‌రూఫ్ కారు లాంచ్ చేసిన టాటా - రూ.8 లక్షల లోపే!
Top 5 160 CC Bikes: బెస్ట్ 160 సీసీ బైక్ కొనాలనుకుంటున్నారా - ఈ ఐదు ఆప్షన్లపై ఓ లుక్కేయండి!
UPI: ఫోన్ తియ్-పే చెయ్, మే నెలలో యూపీఐ లావాదేవీల రికార్డ్
Stock Market News: 18,500 మీదే నిఫ్టీ క్లోజింగ్ - ఆటో, రియాల్టీ, మెటల్స్ బూమ్!
Education Loan: సిబిల్ స్కోర్ తక్కువైనా ఎడ్యుకేషన్ లోన్ వస్తుంది, హైకోర్ట్ కీలక నిర్దేశం
Chandrababu : టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !
Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు
Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?
24 శాతం వడ్డీకి కోట్లాది రూపాయలు అప్పు చేసి ‘బాహుబలి’ తీశాం: రానా