Mutual Funds In DEC: టాప్-9 మ్యూచువల్ ఫండ్స్ మనసుపడ్డ స్టాక్స్ ఇవి, వీటిలోకి వేల కోట్లు గుమ్మరింపు
మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువగా షేర్ల లిస్ట్‌లో కేఫిన్ టెక్నాలజీస్, సులా వైన్‌యార్డ్స్, ల్యాండ్‌మార్క్ కార్స్ వంటి కొత్త IPO స్టాక్స్ కూడా ఉన్నాయి.
Mutual Funds In DEC: 2022 డిసెంబర్‌లో, మ్యూచువల్ ఫండ్స్ ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో రూ. 14,700 కోట్లను పెట్టుబడులు పెట్టగా, FIIలు రూ. 6,300 కోట్ల విలువైన షేర్లను విక్రయించాయి. డిసెంబరు నెలలో, మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువగా షేర్ల లిస్ట్‌లో కేఫిన్ టెక్నాలజీస్, సులా వైన్‌యార్డ్స్, ల్యాండ్‌మార్క్ కార్స్ వంటి కొత్త IPO స్టాక్స్ కూడా ఉన్నాయి.
నువామా ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ (Nuvama Institutional Equities) నివేదిక ప్రకారం, డిసెంబర్‌లో మ్యూచువల్ ఫండ్స్ కొత్తగా కొనుగోలు చేసిన స్టాక్స్ లిస్ట్ ఇది:
డిసెంబర్‌లో, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు చెందిన 5,00,000 షేర్లను HDFC మ్యూచువల్ ఫండ్ కొత్తగా కొనుగోలు చేసింది. సులా వైన్‌యార్డ్స్, ఫోర్టిస్ హెల్త్‌కేర్, ల్యాండ్‌మార్క్ కార్స్ కూడా దీని టాప్ న్యూ పెట్టుబడులలో ఉన్నాయి.
రెయిన్‌బో చిల్డ్రన్స్ మెడికేర్ కంపెనీకి చెందిన 17,85,000 షేర్లను ICICI మ్యూచువల్ ఫండ్ కొనుగోలు చేసింది. దీని ఇతర టాప్ న్యూ హోల్డింగ్స్‌లో రెప్కో హోమ్ ఫైనాన్స్, BEML కూడా ఉన్నాయి.
ఎలిన్ ఎలక్ట్రానిక్స్ కంపెనీకి చెందిన 14,75,000 షేర్లను కోటక్ మ్యూచువల్ ఫండ్ డిసెంబర్‌లో కొత్తగా కొనుగోలు చేసింది. ఇతర టాప్ న్యూ హోల్డింగ్స్‌లో సౌత్ ఇండియన్ బ్యాంక్, అదానీ పవర్, దీపక్ ఫెర్టిలైజర్స్ ఉన్నాయి.
సూలా వైన్‌యార్డ్స్ కంపెనీకి చెందిన 27,76,000 షేర్లను SBI మ్యూచువల్ ఫండ్ కొత్తగా కొనుగోలు చేసింది. దీని ఇతర టాప్ న్యూ పెట్టుబడులలో ఎలిన్ ఎలక్ట్రానిక్స్, సాగర్ సిమెంట్స్ ఉన్నాయి.
అపర్ ఇండస్ట్రీస్ కంపెనీకి చెందిన 7,97,000 షేర్లను DSP మ్యూచువల్ ఫండ్ కొత్తగా కొనుగోలు చేసింది. దీని ఇతర టాప్ న్యూ పెట్టుబడులలో హింద్‌వేర్ హోమ్, టాటా కమ్యూనికేషన్ ఉన్నాయి.
కేఫిన్ టెక్నాలజీస్ కంపెనీకి చెందిన 61,99,000 షేర్లను యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా కొనుగోలు చేసింది. వెస్ట్‌లైఫ్ ఫుడ్, L&T ఫైనాన్స్ హోల్డింగ్స్, ఇండియాబుల్స్ హౌసింగ్ దీని ఇతర టాప్ న్యూ హోల్డింగ్స్.
డిసెంబర్‌లో, GMM ఫ్లాడ్లర్ కంపెనీకి చెందిన కంపెనీ 17,00,000 షేర్లను ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా కొనుగోలు చేసింది. దీని ఇతర టాప్ న్యూ పెట్టుబడులలో సూలా వైన్‌యార్డ్స్, ఎలిన్ ఎలక్ట్రానిక్స్, ల్యాండ్‌మార్క్ కార్స్ ఉన్నాయి.
డిసెంబర్‌లో, కిర్లోస్కర్ ఫెర్రస్‌కు చెందిన 5,28,000 షేర్లను టాటా మ్యూచువల్ ఫండ్ కొత్తగా కొనుగోలు చేసింది. ఆస్టర్ DM హెల్త్, CCL ప్రొడక్ట్స్, మెట్రోపొలిస్ హెల్త్ దీని ఇతర టాప్ న్యూ పెట్టుబడులలో ఉన్నాయి.
LIC హౌసింగ్ ఫైనాన్స్‌కు చెందిన 7,00,000 షేర్లను UTI మ్యూచువల్ ఫండ్ కొత్తగా కొనుగోలు చేసింది. KFin టెక్నాలజీస్, రేడియంట్ క్యాష్ మేనేజ్‌మెంట్, KPR మిల్ వంటి దాని ఇతర టాప్ న్యూ పెట్టుబడుల్లో ఉన్నాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.