By: ABP Desam | Updated at : 11 Aug 2023 03:04 PM (IST)
మ్యూచువల్ ఫండ్ అకౌంట్‌లో నామినీ పేరును ఎలా యాడ్ చేయాలి?
Mutual Fund Nomination: మ్యూచువల్ ఫండ్ అకౌంట్‌లో నామినీ పేరును చేర్చాల్సిన తుది గడువును, గత మార్చి నెలలో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) పొడిగించింది. 30 సెప్టెంబర్ 2023ని నామినేషన్‌కు లాస్ట్ డేట్‌గా ప్రకటించింది. ఈ గడువు కూడా ఇప్పుడు దగ్గర పడుతోంది.
అన్ని సింగిల్ & జాయింట్ మ్యూచువల్ ఫండ్ అకౌంట్స్‌లో నామినేషన్ పూర్తి చేయడానికి లాస్ట్ డేట్ 30 సెప్టెంబర్ 2023. ఈలోగా నామినీ పేరును ఖాతాలో చేర్చకపోతే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియో స్తంభించిపోతుందని సెబీ హెచ్చరించింది. అన్ని అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలను (AMCలు) కూడా సెబీ అలెర్ట్ చేసింది. సెప్టెంబర్ 30 లోపు తమ కస్టమర్లతో నామినేషన్ ప్రక్రియను పూర్తి చేయించే బాధ్యత AMCలదేనని ఆదేశించింది.
మ్యూచువల్ ఫండ్ ఖాతాలతో పాటు, డీమ్యాట్ & ట్రేడింగ్ ఖాతాల్లో నామినేషన్ గడువును కూడా ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు సెబీ పొడిగించింది.
మ్యూచువల్ ఫండ్ అకౌంట్‌లో నామినీ పేరును ఎందుకు చేర్చాలి?
మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ల మంచి కోసమే సెబీ ఈ రూల్ తీసుకొచ్చింది. ఒక వ్యక్తి మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడులు పెట్టిన తర్వాత, ఆ పథకం మెచ్యూరిటీకి ముందే దురదృష్టవశాత్తు మరణిస్తే, నామినేషన్ లేని పక్షంలో ఆ డబ్బును కుటుంబ సభ్యులకు బదిలీ చేయడం కష్టం అవుతుంది. అదే, నామినేషన్ ప్రక్రియ పూర్తయి ఉంటే ఎలాంటి సమస్య లేకుండా ఆ డబ్బు సులభంగా నామినీకి అందుతుంది, ఆ కుటుంబానికి ఆర్థికంగా రక్షణ లభిస్తుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని, పెట్టుబడిదార్ల ప్రయోజనం కోసమే మ్యూచువల్ ఫండ్స్‌లో నామినేషన్‌ను SEBI తప్పనిసరి చేసింది. కొంతమంది మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టి మరిచిపోతున్నారు, మరికొందరు మెచ్యూరిటీ తర్వాత కూడా డబ్బు వెనక్కు తీసుకోవడం లేదు. ఇలాంటి సందర్భాల్లోనూ నామినీని గుర్తించి ఆ డబ్బు ఇవ్వడానికి నామినేషన్ ఉపయోగపడుతుంది.
ఆన్‌లైన్ & ఆఫ్‌లైన్‌లో నామినేషన్ ప్రక్రియ
మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు ఆన్‌లైన్‌లోనూ, ఆఫ్‌లైన్‌లోనూ నామినేషన్ పనిని పూర్తి చేయవచ్చు. ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా నామినీ పేరును ఖాతాకు జత చేయడానికి, సంబంధిత మ్యూచువల్ ఫండ్ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అకౌంట్‌లో లాగిన్ అయిన తర్వాత, అకౌంట్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అందులో నామినీ డిటెయిల్స్ ఆప్షన్‌ను ఎంచుకుని, మిగిలిన పనిని పూర్తి చేయవచ్చు. ఈ ప్రాసెస్ ఒక్కో కంపెనీ వెబ్‌సైట్‌కు ఒక్కో విధంగా ఉంటుంది. ఆన్‌లైన్‌లో నామినేషన్ నింపడంలో మీకు కన్‌ఫ్యూజన్‌గా అనిపిస్తే, అధికారిక హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి సాయం తీసుకోవచ్చు. ఆఫ్‌లైన్ ద్వారా కూడా ఈ పూర్తి చేయవచ్చు. ఇందుకోసం కూడా హెల్ప్‌లైన్ నంబర్ నుంచి సాయం కోరవచ్చు. ఆఫ్‌లైన్ ద్వారా నామినేషన్ పనిని పూర్తి చేయడానికి కొన్నిసార్లు ఎక్కువ సమయం పడుతుంది.
మరో ఆసక్తికర కథనం: కస్టమర్లకు భారీ షాక్, FD రేట్లను అడ్డంగా కత్తిరించిన 5 బ్యాంకులు
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
SIP , PPFలో లాంగ్ టెర్మ్ ఇన్వెస్ట్మెంట్కి ఏది ఉత్తమం? ఎక్కడ ఎక్కువ సంపాదించవచ్చు?
Investments for Child : పిల్లల ఫ్యూచర్ కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా ? ఈ ఈక్విటీ ఫండ్స్‌తో అధిక రాబడి మీ సొంతం
Children Day: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
Money Earning Tips: ఇలా SIP చేస్తే కోటీశ్వరులు అవుతారు.. రూ.2000తో మొదలుపెట్టి ఇలా ఇన్వెస్ట్ చేయాలి
Passive Income: SIPs నుంచి REITs దాకా పాసివ్ ఆదాయం ఎలా సంపాదించాలో తెలుసుకోండి
KCR About Chandrababu: హైప్ ఆద్యుడు చంద్రబాబు, బిజినెస్ మీట్స్‌లో వంటవాళ్లతో MOUలు చేసుకున్నాడు: కేసీఆర్
India U19 vs Pakistan U19 Final highlights: అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్.. ఫైనల్లో భారత్‌పై 191 రన్స్ తేడాతో ఘన విజయం
Kishan Reddy Letter to Sonia Gandhi: 6 గ్యారంటీలు, అభయహస్తమే భస్మాసుర హస్తంగా మారతాయి- సోనియా గాంధీకి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
Maruti S Presso నుంచి టాటా పంచ్ వరకు.. దేశంలోని చౌకైన ఆటోమేటిక్ కార్లు, వాటి ధర