By: ABP Desam | Updated at : 24 Jul 2023 01:25 PM (IST)
4 types of mutual fund SIPs
Types Of Mutual Fund SIPs: స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టే ఆప్షన్స్‌లో మ్యూచువల్ ఫండ్ ఒకటి. మార్కెట్ రిస్క్ ప్రభావం లేకుండా ఇన్వెస్ట్‌మెంట్ సేఫ్‌గా ఉండాలి, భారీ లాభాలు రాకపోయినా పర్వాలేదు కొద్దిగా లాభాలు వచ్చినా చాలు అనుకునే వాళ్లకు మ్యూచువల్ ఫండ్స్ ఒక బెస్ట్ ఛాయిస్. మార్కెట్ గురించి పెద్దగా అవగాహన/అనుభవం లేని పెట్టుబడిదార్లకు కూడా ఇవి పనికొస్తాయి. ఏ మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌నైనా ఒక ఎక్స్‌పర్ట్స్ టీమ్ నిర్వహిస్తుంది.
మ్యూచువల్ ఫండ్స్‌లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ ద్వారా ఒక పెద్ద కార్పస్ సృష్టించొచ్చు. ఇందుకు, సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) పనికొస్తుంది. మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడానికి ఎఫెక్టివ్ టూల్ ఇది. SIP అంటే, మీకు వీలయినంత డబ్బును నెలనెలా ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం. అంటే, పెద్దగా బర్డెన్ లేకుండానే చిన్న మొత్తాలతో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లోనూ కొన్ని రకాలు ఉన్నాయి.
సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ రకాలు:
రెగ్యులర్ SIP
ప్లెయిన్ వెనిల్లా వేరియంట్ లాంటిది ఈ రెగ్యులర్ SIP. ఎక్కువ మంది ఫాలో అవుతున్న టైప్. ఈ రూట్‌లో, నెలకు లేదా మూడు నెలలకు ఒకసారి నిర్ణీత మొత్తాన్ని క్రమపద్ధతిలో పెట్టుబడి పెట్టవచ్చు. స్థిరంగా పెట్టుబడి (Fixed Amount) పెట్టే సామర్థ్యం, దీర్ఘకాలం దానిని కంటిన్యూ చేయగల ఇన్వెస్టర్లకు రెగ్యులర్ SIP అనుకూలంగా ఉంటుంది.
స్టెప్-అప్ SIP
ఏటా తన ఆదాయం పెరుగుతుంది, దానిని బట్టి పెట్టుబడి పెంచుకోగలను అనుకునే ఇన్వెస్టర్‌కు ఇది సూటవుతుంది. స్టెప్-అప్ SIP ద్వారా, కాలానుగుణంగా ఇన్వెస్ట్‌మెంట్ మొత్తాన్ని పెంచుకుంటూ వెళ్లవచ్చు. ఆదాయాలు పెరినప్పుడల్లా పెట్టుబడిని పెంచుకునే లేదా, పెట్టుబడుల్లో వేగం పెంచాలనుకునే వాళ్లకు ఇది పనికొస్తుంది. SIP ఇన్‌స్టాల్‌మెట్స్‌ను ఏడాదికి లేదా ఆరు నెలలకు ఒకసారి పెంచుకుంటూ వెళ్లే ఆప్షన్ ఇందులో ఉంది.
ఫ్లెక్సిబుల్ SIP
మార్కెట్ హెచ్చుతగ్గులకు అనుగుణంగా ఇన్వెస్ట్‌మెంట్ మొత్తాన్ని సర్దుబాటు చేసుకునే స్వేచ్ఛను ఫ్లెక్సిబుల్ సిప్స్ పెట్టుబడిదార్లకు అందిస్తాయి. SIP మొత్తం ముందుగా నిర్ణయించిన ఫార్ములా ద్వారా నిర్ణయిస్తారు. మార్కెట్ పడిపోయినప్పుడు పెట్టుబడిదార్లు ఎక్కువ డబ్బు పంప్ చేయడానికి, మార్కెట్ పెరిగినప్పుడు SIP అమౌంట్‌ను తగ్గించడానికి ఈ ప్లాన్ వీలు కల్పిస్తుంది.
ట్రిగ్గర్ SIP
పెట్టుబడిదార్లు ముందే పెట్టుకున్న కొన్ని కండిషన్ల ఆధారంగా SIP ఇన్‌స్టాల్‌మెంట్స్‌ను ప్రారంభించడానికి ఇవి అనుమతిస్తాయి. ఉదాహరణకు... ఒక ఇండెక్స్ ఒక స్థాయికి వచ్చినప్పుడు, లేదా ఒక ఫండ్ పనితీరు ఒక లెవెల్‌కు చేరినప్పుడు పెట్టుబడి పెట్టడం లాంటి మార్కెట్ పరిస్థితులపై ఈ సిప్ ఆధారపడి ఉంటుంది. ట్రిగ్గర్ కండిషన్ నెరవేరినప్పుడు, ఆటోమేటిక్‌గా డబ్బు ఇన్వెస్ట్ అవుతుంది.
మరో ఆసక్తికర కథనం: ఈరోజు 'ఇన్‌కమ్ టాక్స్ డే' - స్వాతంత్ర పోరాటానికి, ఇన్‌కమ్ టాక్స్‌కు లింక్ ఏంటి?
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Monthly Income: మ్యూచువల్ ఫండ్ నుంచి నెలనెలా ఆదాయాన్ని ఇచ్చే సిస్టమాటిక్ విత్‌డ్రాల్ ప్లాన్
Investment Options: 'గోడ మీద పిల్లి' ఫార్ములా, మ్యూచువల్ ఫండ్స్‌లో బాగా పని చేస్తుంది
Mutual Fund SIPs: 'సిప్' పెట్టుబడిని మీ ఇష్టం వచ్చినట్లు మార్చుకోవచ్చు, ఈ 4 టైప్స్‌లో ఒకదాన్ని ఫాలో కావచ్చు
Mutual Fund SIP: ₹10,000 ఇన్వెస్ట్ చేస్తే ఏకంగా ₹2.10 కోట్లు రిటర్న్ వచ్చాయి, సిప్ చేసిన మ్యాజిక్ ఇది
Loan On Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్ మీద లోన్ తీసుకోవచ్చు, వడ్డీ కూడా తక్కువే!
Revanth Reddy Resigns: రేవంత్ రెడ్డి రాజీనామా- ఢిల్లీకి వెళ్లి రిజైన్ లెటర్ అందజేత
KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం
Jr NTR: నెట్‌ఫ్లిక్స్ సీఈవోకు జూనియర్ ఎన్టీఆర్ ఆతిథ్యం - మధ్యాహ్నం బాగా గడిచిందంటూ ట్వీట్!
Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే
/body>