అన్వేషించండి

Mukesh Ambani: ముకేష్‌ అంబానీ ఒకరోజు సంపాదన ఎంతో తెలిస్తే మీరు షాక్‌ అవుతారు

Mukesh Ambani Net Worth: బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, ముకేష్ అంబానీ సంపద విలువ 116 బిలియన్‌ డాలర్లని అంచనా. కరోనా మహమ్మారి నుంచి ఆయన జీతం కూడా తీసుకోవడం లేదు.

Mukesh Ambani One Day Income: రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ & ఎండీ అయిన ముకేష్ అంబానీ (Mukesh Ambani, Chairman & MD of Reliance Industries) భారతదేశంలో మాత్రమే కాదు, ఆసియాలోనే అత్యంత ధనవంతుడు. ముకేష్‌ అంబానీ నెట్‌వర్త్‌ (సంపద విలువ‌) సుమారు 116 బిలియన్‌ డాలర్లు ఉంటుందని అంచనా వేశారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, రిలయన్స్‌ ఛైర్మన్‌ ప్రపంచంలో 12వ అత్యంత సంపన్న వ్యక్తి. అతని తర్వాత, అదానీ గ్రూప్‌ ఓనర్‌ గౌతమ్ అదానీ (Gautam Adani) 13వ ర్యాంక్‌లో ఉన్నారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, అంబానీ నికర విలువ 104 బిలియన్‌ డాలర్లు. 

భారతదేశంలో అత్యంత ధనవంతుడు ముకేష్ అంబానీ గంటకు ఎంత సంపాదిస్తున్నారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా?. ఆయన రోజు సంపాదన ఎంతో మీకు తెలుసా?

ముకేష్ అంబానీ రోజు సంపాదన ఇది
ముకేష్ అంబానీ సంపదను అంచనా వేయడానికి ఒక లెక్క ఉంది. ఒక వ్యక్తి, ప్రతి సంవత్సరం రూ. 4 లక్షలు సంపాదిస్తే, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ప్రస్తుత సంపద స్థాయికి చేరుకోవడానికి అతనికి 1.74 కోట్ల సంవత్సరాలు పడుతుంది. ఇది ఆశ్యర్యం కలిస్తున్నా, ఇదే నిజం. 

గతంలో, ముకేష్ అంబానీ ప్రతి సంవత్సరం దాదాపు 15 కోట్ల రూపాయల జీతం తీసుకునేవారు. కానీ, కరోనా నుంచి జీతం తీసుకోకుండానే పని చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఆయన రోజుకు సగటున రూ.163 కోట్లు సంపాదిస్తున్నారు. గంటకు దాదాపు 6.80 కోట్లు ఆర్జిస్తున్నారు. అంటే, అంబానీ తన ఇంట్లో ప్రశాంతంగా నిద్ర పోతున్నప్పటికీ, ప్రతి గంటకూ ఆయన సంపద విలువ 6.80 కోట్లు పెరుగుతుంది. కరోనా కాలం నుంచి జీతం లేకపోతే అంబానీకి ఇంత డబ్బు ఎలా వస్తుంది?. ఈ డబ్బు అతనికి రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో వాటాల నుంచి వస్తుంది. పెట్రో కెమికల్, ఆయిల్, టెలికాం, రిటైల్ వంటి చాలా రంగాల్లోకి రిలయన్స్ ఇండస్ట్రీస్‌ విస్తరించింది, పదుల సంఖ్యలో వ్యాపారాలు ఉన్నాయి. ఇది కాకుండా, ముంబైలోని సొంత ఇల్లు యాంటిలియాతో సహా రియల్ ఎస్టేట్‌లో ముకేష్‌ అంబానీ చాలా పెట్టుబడులు పెట్టారు. యాంటిలియా విలువ దాదాపు రూ.15,000 కోట్లు ఉంటుందని అంచనా. 

2020 నాటికి ప్రతి గంటకు రూ.90 కోట్ల సంపాదన
2020 నాటికి ముకేష్ అంబానీ ప్రతి గంటకు సగటున రూ.90 కోట్లు సంపాదించేవారట. అంటే, రోజుకు 2,160 కోట్ల ఆదాయం. మరోవైపు, భారతదేశంలో దాదాపు 24 శాతం మంది ప్రజలు నెలకు కేవలం 3000 రూపాయలు మాత్రమే సంపాదించగలుగుతున్నారు. 

అంబానీ కుటుంబ కార్యక్రమాలు కూడా వారి హోదాకు తగ్గట్టుగానే ఉంటాయి. ఈ ఏడాది, తన చిన్న కొడుకు అనంత్ అంబానీ పెళ్లి కోసం దాదాపు రూ.5000 కోట్లు వెచ్చించి యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు ముకేష్‌ అంబానీ. ఈ పెళ్లికి సంబంధించిన ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ కార్యక్రమాలు కూడా ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచాయి. ఇటీవల, సుమారు రూ. 1000 కోట్లు ఖర్చు పెట్టి బోయింగ్ 737 మ్యాక్స్‌ లగ్జరీ విమానాన్ని తన కోసం కొనుగులు చేశారు.

మరో ఆసక్తికర కథనం: స్టాక్‌ మార్కెట్‌ ఢమాల్‌ - సెన్సెక్స్‌ 1200 పాయింట్లు, నిఫ్టీ 350 డౌన్‌

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనేసీఎస్‌కేలోకి అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా ఎమ్‌ఎస్ ధోని, రిటెన్షన్ కొత్త రూల్స్‌తో సస్పెన్స్తిరుమలలో మరోసారి చిరుత కలకలం, సీసీటీవీ ఫుటేజ్‌తో సంచలనం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Dussehra 2024 Prasadam : దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
Sobhita Dhulipala : శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
Embed widget