అన్వేషించండి

Stock Market Crash: స్టాక్‌ మార్కెట్‌ ఢమాల్‌ - సెన్సెక్స్‌ 1200 పాయింట్లు, నిఫ్టీ 350 డౌన్‌

Stock Market Updates: ఈ రోజు రెడ్‌ జోన్‌లో ప్రారంభమైన మార్కెట్లు, ఇప్పటి వరకు, ఏ దశలోనూ కోలుకోలేదు. ఆటో, ఫైనాన్షియల్స్‌ గట్టి దెబ్బకొట్టాయి.

Huge Correction In Sensex And Nifty: భారతీయ ఈక్విటీ బెంచ్‌మార్క్ సూచీలు బీఎస్‌ఈ సెన్సెక్స్, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఈ రోజు (సోమవారం, 30 సెప్టెంబర్‌ 2024) నీరసంగా ఓపెన్‌ అయ్యాయి. ఓపెనింగ్‌ బెల్‌ నుంచి, ఇప్పటి వరకు, నష్టాలను పొడిగిస్తూనే ఉన్నాయి. మార్కెట్‌ను కిందకు లాగుతున్న వాటిలో ఆటో, ఫైనాన్షియల్స్‌ అగ్రస్థానంలో ఉన్నాయి.

మార్కెట్‌ పతనానికి కారణాలు
వాస్తవానికి, ఈ రోజు ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌ సిగ్నల్స్‌ ఇచ్చాయి. చైనా మరిన్ని ఉద్దీపన చర్యలను ప్రకటించడంతో ఆ దేశ స్టాక్‌ మార్కెట్లు జోరుగా పరుగులు తీశాయి. అయితే, జపాన్ కొత్త ప్రధాన మంత్రి వడ్డీ రేట్లను సాధారణ స్థాయికి తీసుకురావడానికి మొగ్గు చూపుతున్నారన్న వార్తలతో ఆ దేశ ఇండెక్స్‌ నికాయ్‌ అతి భారీగా పతనమైంది. ఆ ఎఫెక్ట్‌ మిగిలిన ఆసియా మార్కెట్ల మీద కూడా పడింది.

దీనికితోడు, లెబనాన్‌ వ్యాప్తంగా ఇజ్రాయెల్ దాడులకు దిగడం, సిరియాలో అమెరికా దూకుడు పెరగడం కూడా గ్లోబల్‌ ఇన్వెస్టర్లను హడలెత్తించింది. భౌగోళిక రాజకీయ అనిశ్చితులు మరింత విస్తరిస్తాయన్న భయం కూడా పెట్టుబడిదార్లను వెంటాడింది. ఫలితంగా స్టాక్‌ మార్కెట్ల అమ్మకాలు పెరిగాయి.  

నవంబర్‌లో, యూఎస్‌ ఫెడరల్ రిజర్వ్ మరోమారు వడ్డీ రేట్లను తగ్గిస్తుందో, లేదో నిర్ణయించే పేరోల్స్ రిపోర్ట్‌ సహా, US ప్రధాన ఆర్థిక డేటాలు ఈ వారం రిలీజ్‌ అవుతాయి. దీంతో, పెట్టుబడిదార్లు వేచి చూసేందుకే మొగ్గు చూపారు, కొనుగోళ్ల జోలికి పోవడం లేదు. మార్కెట్ల పతానానికి ఇది కూడా ఒక కారణం.
 
ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటల సమయానికి, బీఎస్‌ఇ సెన్సెక్స్ 1,245.18 పాయింట్లు లేదా 1.46% శాతం క్షీణించి 84,326.67 వద్ద, నిఫ్టీ 373.60 పాయింట్లు లేదా 1.43% పడిపోయి 25,805.35 వద్ద ఉన్నాయి.

మార్కెట్‌ ఓపెనింగ్‌ టైమ్‌లో, బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో సగానికి పైగా స్టాక్స్‌ ఎరుపు రంగులో ఉన్నాయి. ఆ సమయానికి.. ఎన్‌టీపీసీ, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యు స్టీల్, టైటన్, బజాజ్ ఫైనాన్స్ లాభపడగా... టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, మహీంద్రా అండ్ మహీంద్రా, టీసీఎస్ పడిపోయాయి.

నిఫ్టీ50లోనూ 28 స్టాక్స్‌ నష్టాల్లో ఉన్నాయి. హీరో మోటోకార్ప్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్. మహీంద్రా అండ్ మహీంద్రా నష్టాలకు నాయకత్వం వహించాయి. మరోవైపు... బీపీసీఎల్, ఎన్‌టీపీసీ, హిందాల్కో, జేఎస్‌డబ్ల్యు స్టీల్, టాటా స్టీల్ లాభాలతో కొనసాగుతున్నాయి.

సెక్టార్ల వారీగా చూస్తే, నిఫ్టీ మెటల్ 1.41 శాతం పెరిగి టాప్ గెయినర్‌గా నిలిచింది. ఆ తర్వాత కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ & గ్యాస్ ఉన్నాయి. మరోపైపు... నిఫ్టీ రియాల్టీ 1.12 శాతం తగ్గి ఎక్కువగా నష్టపోయింది. ఐటీ, ఆటో సెక్టార్లు వరుసగా 0.95 శాతం, 0.80 శాతం క్షీణించాయి.

అదే సమయంలో, విస్తృత మార్కెట్లు రెడ్‌ కలర్‌లో ట్రేడ్‌ అవుతున్నాయి. బీఎస్‌ఈ స్మాల్‌ క్యాప్ ఇండెక్స్‌ 0.46 శాతం, బీఎస్‌ఈ మిడ్‌ క్యాప్ ఇండెక్స్‌ 0.43 శాతం క్షీణించాయి.

గత వారం రికార్డ్‌ల వర్షం
శుక్రవారం సహా, గత వారమంతా ఇండియన్‌ ఈక్విటీ బెంచ్‌మార్క్ సూచీలు సూపర్‌ పెర్ఫార్మెన్స్‌ చేశాయి. వారంలో దాదాపు ప్రతిరోజూ మార్కెట్లు కొత్త తాజా జీవితకాల గరిష్టాలను వెతుక్కుంటూ వెళ్లాయి. శుక్రవారం నాడు, బీఎస్‌ఈ సెన్సెక్స్  85,571.85 పాయింట్ల వద్ద, నిఫ్టీ 26,175.15 పాయింట్ల వద్ద క్లోజ్‌ అయ్యాయి. దీనికి ముందు రోజు, BSE సెన్సెక్స్ 85,978.25 వద్ద రికార్డు స్థాయికి చేరుకుంది. NSE నిఫ్టీ కూడా 26,277.35 వద్ద ఆల్ టైమ్ హైని తాకింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుమల బూంది పోటులో సిట్ అధికారుల పరిశీలన, క్వాలిటీపై ఆరాడ్రా అనుకున్న మ్యాచ్‌ని నిలబెట్టిన టీమిండియా, కాన్పూర్‌ టెస్ట్‌లో రికార్డుల మోతKTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Dussehra 2024 Prasadam : దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
Sobhita Dhulipala : శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
Embed widget