Isha Ambani: ఇషా అంబానీకి అమెరికాలో అరుదైన గౌరవం..! ప్రతిష్ఠాత్మక సంస్థ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్‌కు ఎంపిక.. కమలా హ్యారిస్ ఆమోదం
ఇషా అంబానీ అమెరికాలోని ఓ మ్యూజియానికి బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్‌గా ఎంపికయ్యారు. అతి చిన్న వయసులోనే ఈ ఘనత అందుకున్నారు. భారతీయ, ఆసియా కళలు, సంస్కృతులను ఎక్కువ మందికి పరిచయం చేసేందుకు కృషి చేయనున్నారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కూతురు ఇషా అంబానీ అరుదైన ఘనత అందుకున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం, విద్య, పరిశోధన సంస్థకు చెందిన ప్రతిష్ఠాత్మక స్మిత్‌సోనియన్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఏసియన్ ఆర్ట్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్‌గా నియామకం అయ్యారు. అతి చిన్న వయసులోనే ఆమె ఈ గౌరవం దక్కించుకున్నారు.
ఇషా నియామకానికి అమెరికా చీఫ్ జస్టిస్ జాన్ జీ రాబర్ట్స్ నేతృత్వంలోని స్మిత్ సోనియన్స్ బోర్డ్ ఆఫ్ రెజెంట్స్, ఎక్స్ అఫీషియో సభ్యురాలైన అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఆమోద ముద్ర వేశారు. ఇషా నాలుగేళ్ల పాటు పదవిలో ఉండనున్నారు.
మ్యూజియంలోని విలువైన వస్తువులు, కలెక్షన్స్ మరింత మందికి చేరువయ్యేందుకు, భారతీయ, ఆసియా కళలు, సంస్కృతులను అందరూ ఉన్నతంగా అర్థం చేసుకొనేందుకు ఇషా దార్శనికత, అంకితభావం, అభిరుచి ఉపయోగపడతాయని స్మిత్‌సోనియన్స్ తెలిపింది. త్వరలోనే ఈ ప్రఖ్యాత మ్యూజియం శతాబ్ది వేడుకలకు ముస్తాబవ్వనుంది. ఇప్పుడు ఎంపికైన బోర్డు సభ్యులంతా ఈ ఉత్సవాన్సి ఘనంగా జరిపేందుకు కృషి చేయనున్నారు.
ఇషా అంబానీ ముంబయిలోని ధీరూభాయ్ అంబానీ అంతర్జాతీయ పాఠశాలలో చదివారు. ఆ తర్వాత అమెరికాలోని యేల్ యూనివర్సిటీ, స్టాన్‌ఫర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఉన్నత విద్యను అభ్యసించారు. కొన్నాళ్లు అమెరికాలోనే ఓ ప్రముఖ సంస్థలో ఉద్యోగం చేశారు. భారత్‌కు వచ్చాక రిలయన్స్ జియో స్థాపనలో కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం ఆమె జియోలో బోర్డు ఆఫ్ డైరెక్టర్‌గా ఉన్నారు.
Also Read: Diwali Gift: దీపావళికి బహుమతి పొందారా.. ఆఫీస్‌లో బోనస్ ఇచ్చారా.. మరి పన్ను కట్టాలని తెలుసా?
Also Read: Loan Options: మీకు అర్జెంట్‌గా డబ్బు కావాలా? ఇలా చేస్తే బెటర్!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Think it’s a clock with a sheet over it? You’ve been tricked.
— Smithsonian (@smithsonian) October 27, 2021
Wendell Castle carved “Ghost Clock” (1985) from a single block of laminated mahogany. This piece stands hauntingly silent in our @americanart’s #RenwickGallery. https://t.co/LGuJWEGM8o pic.twitter.com/Nzicm3PxA5