Low Home loan interest: పోతే దొరకని ఆఫర్! అతి తక్కువ వడ్డీరేటుకే ఈ బ్యాంకులో హోమ్‌లోన్.. వివరాలు ఇవే!
అతి తక్కువ వడ్డీరేటుకే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంటి రుణాలు అందజేస్తోంది. 6.40 శాతం వడ్డీకే రుణాలు ఇస్తామని ప్రకటించింది.
సొంత ఇంటి కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త! తక్కువ వడ్డీకే గృహ రుణం పొందేందుకు మరో మంచి అవకాశం! గతంలో ఎన్నడూ లేని విధంగా అతి తక్కువ వడ్డీరేటుకే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంటి రుణాలు అందజేస్తోంది. 6.40 శాతం వడ్డీకే రుణాలు ఇస్తామని ప్రకటించింది.
తగ్గించిన వడ్డీ రేట్లు 2021, అక్టోబర్ 27 నుంచి అమల్లోకి వస్తాయని యూబీఐ వెల్లడించింది. కొత్త హోమ్‌లోన్ దరఖాస్తు దారులు, ఇప్పటికే ఇతర సంస్థల్లో తీసుకున్న రుణాలు బదిలీ చేసుకొనేవారికీ, బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ చేసుకోనేవారికీ కొత్త వడ్డీరేట్లు వర్తిస్తాయని తెలిపింది.
పండగ సీజన్లో గృహ రుణాలకు డిమాండ్ పెరగడంతో ఈ ఆఫర్ ఇస్తున్నామని యూబీఐ తెలిపింది. వినియోగదారులు దీనివల్ల ప్రయోజనం పొందుతారని పేర్కొంది. తగ్గించిన వడ్డీరేటుతో ఇండస్ట్రీలో తాము గట్టిపోటీనిస్తామని వెల్లడించింది.
బ్యాంకుల పోటాపోటీ
గృహ రుణాలపై వడ్డీరేట్లను తగ్గించేందుకు బ్యాంకులన్నీ పోటీ పడుతున్నాయి. కస్టమర్లను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకుంటున్నాయి. కరోనా మహమ్మారి ప్రభావం తగ్గడం, ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంతో బ్యాంకులు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. రుణ సాధనాన్ని బట్టి వడ్డీ రేట్లు అమలు చేస్తున్నాయి. మొదట ఎస్‌బీఐ ఇంటి రుణాలపై వడ్డీని తగ్గించింది. ఆ తర్వాత ప్రైవేటు, ప్రభుత్వ బ్యాంకులు ముందుకొచ్చాయి. యాక్సిస్ బ్యాంకైతే ఏకంగా 35 ఏళ్ల కాల పరిమితితో తక్కువ వడ్డీకే గృహరుణం ఇస్తామని ప్రకటించింది.
Also Read: Diwali Bank Offers: కస్టమర్లకు ఆఫర్లే ఆఫర్లు! దీపావళికి ఏ బ్యాంకు ఏ ఆఫర్ ఇస్తోందో తెలుసా?
Also Read: Loan Options: మీకు అర్జెంట్‌గా డబ్బు కావాలా? ఇలా చేస్తే బెటర్!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Go ahead and bring your dreams to reality this festive season, powered by Union Personal Loan with attractive low EMIs . Know more here : https://t.co/h20xo4NzB5 #PersonalLoan #103FoundationDay #UBIFoundationDay #DigitalApnayen #AmritMahotsav #GoodPeopleToBankWith pic.twitter.com/4KAU0QOrnu
— Union Bank of India (@UnionBankTweets) October 25, 2021