అన్వేషించండి

IT companies: ఐటీ కంపెనీల దారెటు, యాక్సెంచర్‌ ఏ సిగ్నల్‌ ఇచ్చింది?

భారతీయ ఐటీ కంపెనీల భవిష్యత్‌ను యాక్సెంచర్‌ ఆర్థిక ఫలితాల ఆధారంగా అంచనా వేస్తారు.

IT companies: అంతర్జాతీయ స్థాయి ఐటీ సేవల కంపెనీ 'యాక్సెంచర్‌', 2022-23 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం ‍‌(Q2FY23) ఫలితాలను గురువారం (23 మార్చి 2023) నాడు ప్రకటించింది.

సెప్టెంబరు-ఆగస్టు కాలాన్ని ఒక ఆర్థిక సంవత్సరంగా యాక్సెంచర్‌ పాటిస్తుంది. కాబట్టి, 2022 డిసెంబర్‌ - 2023 ఫిబ్రవరి కాలం ఈ కంపెనీకి రెండో త్రైమాసికం. 

యాక్సెంచర్‌ ఫలితాలే ప్రాతిపదిక
అన్ని ప్రముఖ IT కంపెనీల కంటే ముందుగా ఈ కంపెనీ ఆర్థిక ఫలితాలు వెల్లడవుతాయి. కాబట్టి.. ఆ త్రైమాసికంలో, భవిష్యత్‌లో ప్రపంచ ఐటీ కంపెనీల ఆదాయాలపై ఒక అంచనాకు రావడానికి విశ్లేషకులు ఈ కంపెనీ లెక్కలను, కామెంటరీని ప్రామాణికంగా తీసుకుంటారు. ముఖ్యంగా, భారతీయ ఐటీ కంపెనీల భవిష్యత్‌ను యాక్సెంచర్‌ ఆర్థిక ఫలితాల ఆధారంగా అంచనా వేస్తారు. కాబట్టి, యాక్సెంచర్‌ ఫలితాలు భారతీయ ఐటీ రంగానికి అత్యంత కీలకం.

స్థిర కరెన్సీ (CC) ప్రాతిపదికన, యాక్సెంచర్ డీల్స్‌ రెండో త్రైమాసికంలో 17% YoY పెరిగి $22.1 బిలియన్ల ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. దీంతో, భారత్‌లోని స్మాల్‌ క్యాప్‌ ఐటీ కంపెనీల కంటే లార్జ్‌ క్యాప్‌ ఐటీ కంపెనీలు ఎక్కువ లాభపడవచ్చని పెట్టుబడిదార్లు బెట్స్‌ వేస్తున్నారు.

"లార్జ్‌ డీల్స్‌పై క్లయింట్ ఫోకస్ పెరగడం, చిన్న డీల్స్‌లో తగ్గిపోవడాన్ని బట్టి చూస్తే.. మీడియం/స్మాల్‌ సైజ్‌ కంపెనీల కంటే పెద్ద ఐటీ సంస్థలకు పరిస్థితి అనుకూలంగా ఉంది" - జెఫరీస్ ఎనలిస్ట్‌లు అక్షత్ అగర్వాల్, అంకుర్ పంత్

యాక్సెంచర్ Q2 ఆదాయం YoYలో 9% పెరిగింది, కంపెనీ గతంలో చెప్పిన మాటల ప్రకారమే వృద్ధి కనిపించింది. అయితే, మొత్తం ఆర్థిక సంవత్సరానికి (FY23) వార్షిక ఆదాయ వృద్ధి అంచనాలను ఈ గ్లోబల్‌ కంపెనీ స్వల్పంగా, 100 bps లేదా 1 శాతం తగ్గించుకుని, 8-10 శాతంగా అంచనా వేసింది.

ఏ కంపెనీలకు ప్రయోజనం?
"ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మందగమనం కారణంగా, ఐటీ కంపెనీల క్లయింట్లు వ్యయ నియంత్రణపై దృష్టి పెట్టారు. ఈ తరహా జాగ్రత్తలు FY24లో ఐటీ రంగ వృద్ధి నామమాత్రంగా మార్చేస్తాయి. 2HFY23 కాలపు రాబడి విషయంలో యాక్సెంచర్‌ చెప్పిన మాటల్లో ఇది స్పష్టంగా కనిపిస్తోంది" - జెఫరీస్

డిమాండ్ వాతావరణం TCS, ఇన్ఫోసిస్‌ ‍‌(Infosys) వంటి పెద్ద కంపెనీలకు సరిగ్గా సరిపోతుందని, మధ్య స్థాయిలో ఉన్న ఎల్‌టీఐమైండ్‌ట్రీ ‍‌(LTIMindtree) LTIM, యంఫసిస్‌ (Mphasi)s కూడా పొందవచ్చని కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ అంచనా వేసింది. విప్రోకు ‍(Wipro) కాలం కలిసిరాకపోవచ్చని వెల్లడించింది.

బ్రోకింగ్‌ హౌస్‌ నోమురా టాప్ పిక్స్‌లో, లార్జ్‌ క్యాప్స్‌లో ఇన్ఫోసిస్, టెక్ మహీంద్ర (Tech Mahindra) ఉన్నాయి. మిడ్‌ క్యాప్స్‌లో కోఫోర్జ్ (Coforge), పెర్సిస్టెంట్ (Persistent) ఉన్నాయి.

యాక్సెంచర్ బలమైన బుకింగ్స్‌, బలమైన పైప్‌లైన్ కామెంటరీ భారతీయ IT లార్జ్‌ క్యాప్స్‌కు మంచి సిగ్నల్‌గా యాంటిక్ స్టాక్ బ్రోకింగ్ పేర్కొంది. లార్జ్‌ క్యాప్స్‌లో HCL టెక్, ఎల్‌టీఐమైండ్‌ట్రీ ఈ బ్రోకరేజ్‌ టాప్‌ పిక్స్‌.

దలాల్ స్ట్రీట్‌లో అధ్వాన్నంగా మారిన సూచీల్లో నిఫ్టీ IT ఇండెక్స్‌ ఒకటి. గత ఏడాది కాలంలో దాదాపు 23% నష్టపోయింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget