By: ABP Desam | Updated at : 23 Oct 2022 08:53 AM (IST)
Edited By: Arunmali
క్యూ2లో క్యూట్ ప్రాఫిట్ పట్టిన కోటక్ బ్యాంక్
Kotak Mahindra Bank Q2 Results: ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (Q2FY23), ప్రైవేట్ రంగ రుణదాత కోటక్ మహీంద్ర బ్యాంక్ క్యూట్ రిజల్ట్స్ పోస్ట్ చేసింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో స్వతంత్ర పన్ను తర్వాతి లాభాన్ని (Standalone PAT), నికర వడ్డీ ఆదాయాన్ని (NII) 27 శాతం చొప్పున పెంచుకుంది.
సమీక్ష కాల త్రైమాసికంలో కోటక్ మహీంద్ర బ్యాంక్ స్వతంత్ర లాభం రూ. 2,581 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రూ.2,032 కోట్లుగా నమోదైంది. ఏకీకృత (Consolidated) ప్రాతిపదికన జులై- సెప్టెంబర్ నెలల నికర లాభం 21 శాతం పెరిగి రూ. 3,608 కోట్లకు చేరింది. 2021-22 ఇదే త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం రూ. 2,989 కోట్లుగా నమోదైంది.
NII మార్జిన్ వృద్ధి
బ్యాంక్ మొత్తం ఆదాయం గత ఏడాది జులై-సెప్టెంబర్ కాలంలోని రూ. 8,408 కోట్ల నుంచి Q2FY23లో రూ. 10,047 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం (తీసుకునే వడ్డీకి, చెల్లించే వడ్డీకి మధ్య వ్యత్యాసం) కూడా ఇదే కాలంలో రూ. 4,021 కోట్ల నుంచి రూ. 5,099 కోట్లకు వృద్ధి చెందింది. నికర వడ్డీ మార్జిన్ 72 బేసిస్ పాయింట్లు (bps) లేదా 0.72 శాతం (YoY) పెరిగి 5.17 శాతానికి విస్తరించింది. గత ఏడాది సెప్టెంబర్ త్రైమాసికంలో ఇది 4.45 శాతంగా ఉంది.
సమీక్ష కాల త్రైమాసికంలో వడ్డీయేతర ఆదాయం(Other Income) దాదాపు 8 శాతం పెరిగి రూ. 1,955 కోట్లకు చేరుకుంది. డిపాజిట్లు 11.5 శాతం పెరిగి రూ. 3.25 లక్షల కోట్లకు చేరాయి.
పెరిగిన ఆస్తుల నాణ్యత
రెండో త్రైమాసికంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ ఆస్తుల నాణ్యత పెరిగింది. స్థూల నిరర్థక ఆస్తులు (GNPAs) గత ఏడాది సెప్టెంబర్ త్రైమాసికంలోని 3.19 శాతం నుంచి 2.08 శాతానికి గణనీయంగా తగ్గాయి. ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో (Q1FY23) నమోదైన 2.24 శాతం పోల్చినా ఇప్పుడు తగ్గాయి. నిరక నిరర్థక ఆస్తులు (NNPAs) కూడా 0.55 శాతానికి తగ్గాయి. ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో ఇవి 0.62 శాతంగా, Q2FY22లో 1.06 శాతంగా ఉన్నాయి.
సెప్టెంబర్ త్రైమాసికంలో మొత్తం కేటాయింపులు (Provisions) వార్షిక ప్రాతిపదికన రూ. 435.25 కోట్ల నుంచి రూ. 136.5 కోట్లకు పడిపోయాయి.
నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లను జారీ చేసి నిధులు సమీకరిస్తామని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కోటక్ మహీంద్రా బ్యాంక్ తెలిపింది.
శుక్రవారం రూ.41.45 లేదా 2.22 శాతం పెరిగిన కోటక్ మహీంద్రా బ్యాంక్ షేరు ధర, రూ.1,905 వద్ద ముగిసింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Economic Survey 2023: భారత ఎకానమీకి 5 బూస్టర్లు - ట్రెండ్ కొనసాగిస్తే మన రేంజు మారిపోద్ది!
Adani Enterprises FPO: అదానీ ఎంటర్ ప్రైజెస్ FPO సూపర్ హిట్టు! పూర్తిగా సబ్‌స్క్రైబ్ - ఇన్వెస్టర్లకు భయం పోయిందా?
Stock Market News: బడ్జెట్ ముందు పాజిటివ్‌గా స్టాక్ మార్కెట్ల ముగింపు - రేపు డబ్బుల వర్షమేనా!!
Cryptocurrency Prices: ఒక్కసారిగా పడిపోయిన బిట్ కాయిన్ - రూ.55 వేలు డౌన్!
Adani Group Buyback: అదానీ షేర్లలో బైబ్యాక్ ఉత్సాహం, తూచ్ అంతా ఉత్తదేనన్న మేనేజ్మెంట్
TSPSC Group1 Mains Exam Dates: గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్ - మెయిన్స్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల చేసిన టీఎస్ పీఎస్సీ
KTR: దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్, మా దారిలోనే ఇతర రాష్ట్రాలు ప్లాన్ : మంత్రి కేటీఆర్
Nellore Anam : నెల్లూరు వైఎస్ఆర్సీపీలో మరోసారి ఆనం బాంబ్ - ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు - ప్రాణ హానీ ఉందని ఆందోళన !
Thalapathy 67 Update: ‘దళపతి 67‘ నుంచి అదిరిపోయే అప్ డేట్, కీ రోల్లో సంజయ్ దత్, హీరోయిన్గా త్రిష