Laxman Narasimhan: స్టార్ బక్స్ కొత్త సీఈవోగా భారతీయుడు - ఆయన స్పెషాలిటీ ఇదే!
Laxman Narasimhan: గ్లోబల్ కాఫీ గెయింట్ స్టార్‌బక్స్‌కు కొత్త సీఈవోగా లక్ష్మణ్ నరసింహన్ నియమితులయ్యారు. కంపెనీ స్థాపకుడు హౌవర్డ్ షూల్జ్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన విశేషాలు ఇవే!

Laxman Narasimhan:
సీఈవోలను ఎంచుకొనేందుకు మల్టీ నేషనల్ కంపెనీలన్నీ భారతీయులు లేదా భారత సంతతి వైపే చూస్తున్నాయి. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, గూగుల్ సహా అనేక దిగ్గజ కంపెనీలకు మనోళ్లే దిక్కయ్యారు! తాజాగా లక్ష్మణ్ నరసింహన్ ఈ జాబితాలో చేరారు. గ్లోబల్ కాఫీ గెయింట్ స్టార్‌బక్స్‌కు కొత్త సీఈవోగా నియమితులయ్యారు. కంపెనీ స్థాపకుడు హౌవర్డ్ షూల్జ్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన విశేషాలు ఇవే!
లక్ష్మణ్ నరసింహన్ 2022, అక్టోబర్ 1న కాబోయే సీఈవోగా స్టార్ బక్స్‌లో చేరారు. 30 ఏళ్లుగా రెస్టారెంట్, ఈకామర్స్, అడ్వైసింగ్ రిటైన్ కంపెనీలు, గ్లోబల్ బిజినెస్‌లను నడిపించిన అనుభవం ఆయన సొంతం.
స్టార్‌బక్స్‌లో చేరడానికి ముందు ఆయన రెకిట్ (Reckitt)కు సీఈవోగా పనిచేశారు. ఇది కన్జూమర్ హెల్త్, హైజీన్, న్యూట్రిషన్ కంపెనీ. సరికొత్త కార్యక్రమాలతో కంపెనీ ఈ-కామర్స్ విభాగాన్ని ఆయన అభివృద్ధి చేశారు. కరోనా మహమ్మారి సమయంలో ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌కు అండగా నిలిచారు.
పెప్సీ కంపెనీలోనూ లక్ష్మణ్ నరసింహన్ వివిధ హోదాల్లో పనిచేశారు. గ్లోబల్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్, పెప్సీకో లాటిన్ అమెరికా, యూరప్, సబ్ సహారన్ ఆఫ్రిక ఆపరేషన్స్‌కు సీఈవోగా సేవలు అందించారు. పెప్సీ కో అమెరికా ఫుడ్స్ సీఎఫ్‌వోగా పనిచేశారు.
మెకిన్సే అండ్ కంపెనీని 19 ఏళ్లు సేవలు అందించారు. అమెరికా, భారత్, ఆసియాలోని కన్జూమర్ గూడ్స్, రిటైల్, హెల్త్‌కేర్ కంపెనీలకు సలహాదారుగా ఉన్నారు.
లక్ష్మణ్ నరసింహన్ పుణె విశ్వవిద్యాలయం నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ చేశారు. పెన్సిల్వేనియా యూనివర్సిటీకి చెందిన లాడర్ ఇన్‌స్టిట్యూట్‌లో జర్మనీ, ఇంటర్నేషనల్ స్టడీస్‌లో మాస్టర్స్ చేశారు. వార్టన్ సూల్ నుంచి ఫైనాన్స్‌లో ఎంబీయే పట్టా తీసుకున్నారు. ఆయన ఆరు భాషల్లో మాట్లాడగలరు. బ్రూకింగ్ ఇనిస్టిట్యూట్‌కు ట్రస్టీగా ఉన్నారు. వెరిజాన్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, యూకే ప్రైమ్ మినిస్టర్ బిల్డ్ బ్యాక్ బెటర్ కౌన్సిల్‌లో ఆయన సభ్యుడు.
Recharge your EV outside and relax inside with your fave Starbucks beverage. As part of our commitment to a sustainable future, Starbucks and @volvocars installed EV chargers at Starbucks Support Center, the start of a 1,350mi route from Denver to Seattle.https://t.co/4AIVh6ZLcK pic.twitter.com/khvOZQC1PM
— Starbucks News (@StarbucksNews) December 15, 2022





















