అన్వేషించండి

ITC surges 8 percent: మార్కెట్లలో ఐటీసీ హవా.. 8 శాతం పెరిగిన షేరు.. 7 నెలల గరిష్ఠానికి చేరిక

భారత స్టాక్‌ మార్కెట్లలో గురువారం ఐటీసీ షేర్ల హవా కొనసాగుతోంది. ఏడాది కాలంగా ఆ షేరు స్థాయికి తగినట్టుగా పెరగలేదు. గురువారం మాత్రం ఏకంగా ఎనిమిది శాతం ఎగిసింది. ఏడు నెలల గరిష్ఠ ధర రూ.233.30ను తాకింది.

భారత స్టాక్‌ మార్కెట్లలో గురువారం ఐటీసీ షేర్ల హవా కొనసాగుతోంది. ఏడాది కాలంగా ఆ షేరు స్థాయికి తగినట్టుగా పెరగలేదు. గురువారం మాత్రం ఏకంగా ఎనిమిది శాతం ఎగిసింది. ఏడు నెలల గరిష్ఠ ధర రూ.233.30ను తాకింది. 

దేశ వ్యాప్తంగా కొవిడ్‌ టీకాలు వేస్తుండటం, మార్కెట్లు స్థిరంగా కొనసాగుతుండటం, సిగరెట్ల వ్యాపారానికి గిరాకీ పెరగడం, నిత్యావసరం సరుకుల ఉత్పత్తి సరఫరా  పెరగడంతో ఈ షేరు రాణిస్తోందని నిపుణులు అంటున్నారు.

Also Read: Flipkart Big Billion Days 2021: వచ్చేస్తోంది బిగ్‌ బిలియన్‌ సేల్‌.. ఏ గ్యాడ్జెట్‌పై ఎంత డిస్కౌంట్‌ ఇస్తున్నారో తెలుసా!

ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత ఐటీసీ షేరు అత్యున్నత స్థాయిలో కొనసాగడం ఇదే తొలిసారి. ఫిబ్రవరి 9న రూ.239.15 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని తాకింది. ఆ తర్వాత నేడు బీఎస్‌ఈ ఇంట్రాడేలో రూ.233.30ను తాకింది. ఇక ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలో సంయుక్తంగా 72.1 మిలియన్ల ఈక్విటీ షేర్లు నేడు చేతులు మారాయి.

Also Read: Rakesh Jhunjhunwala Update: ఈ షేరుతో ఒక్కరోజులోనే రూ.21 కోట్లు ఆర్జించిన రాకేశ్‌ ఝుంఝున్‌వాలా.. ఏంటా షేరు?

'పెర్ఫామెన్స్‌ పరంగా చెప్పాలంటే ఈ షేరు స్థాయికి తగినంతగా రాణించలేదు. అందుకే ఇతర షేర్లతో పోలిస్తే తక్కువకే దొరుకుతోంది. నేడు నిఫ్టీ పుంజుకోవడానికి ఐటీసీయే కారణం. నిఫ్టీ పెరుగుదలలో 30 పాయింట్ల వరకు సాయం చేసింది' అని ఐడీబీఐ క్యాపిటల్‌ రీసెర్చ్ హెడ్‌ ప్రభాకర్‌ అంటున్నారు. 

Also Read: Petrol-Diesel Price, 16 September 2021: తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు...దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో ఇవాళ్టి ధరలు ఇలా...

ఏడాది కాలంగా బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 50 శాతం రాణించగా ఐటీసీ మాత్రం 28 శాతమే పెరగడం గమనార్హం. మూడేళ్లుగా ఈ షేరు 25 శాతం నష్టపోయింది.  ఐటీసీ అనూహ్యంగా పుంజుకోవడంతో మదుపర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ట్విటర్లో మీమ్స్‌తో అలరిస్తున్నారు. జులై 24న ఐటీసీ తమ వ్యాపార ఫలితాలను వెల్లడించిన సంగతి తెలిసిందే.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Vijayamma Birthday : తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు -   షర్మిలారెడ్డి ఎమోషనల్ -  సీఎం జగన్ కూడా !
తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు - షర్మిలారెడ్డి ఎమోషనల్ - సీఎం జగన్ కూడా !
Brs Mla: బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?
బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?
ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిజైల్‌, భారత్‌ నుంచి తొలిసారి ఎగుమతి - ABP ఎక్స్‌క్లూజివ్ ఫొటోలు
ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిజైల్‌, భారత్‌ నుంచి తొలిసారి ఎగుమతి - ABP ఎక్స్‌క్లూజివ్ ఫొటోలు
Allu Arjun: బాలీవుడ్ హీరోలను బీట్ చేసిన బన్నీ - 1000 కోట్లు ఏంటి సామి? నంబర్ వన్ రేసులో దూసుకెళ్తున్న బన్నీ
బాలీవుడ్ హీరోలను బీట్ చేసిన బన్నీ - 1000 కోట్లు ఏంటి సామి? నంబర్ వన్ రేసులో దూసుకెళ్తున్న బన్నీ
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Nandamuri Balakrishna Files Nomination | Hindupur | హిందూపురంలో నామినేష్ వేసిన నందమూరి బాలకృష్ణ |ABPMadhavi Latha Shoots Arrow At Mosque |Viral Video | బాణం వేసిన మాధవి లత... అది మసీదు వైపే వేశారా..?RK Roja Files Nomination | నగరిలో నామినేషన్ వేసిన రోజా... హాజరైన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిKiran Kumar reddy on Peddireddy | పెద్దిరెడ్డిపై మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Vijayamma Birthday : తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు -   షర్మిలారెడ్డి ఎమోషనల్ -  సీఎం జగన్ కూడా !
తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు - షర్మిలారెడ్డి ఎమోషనల్ - సీఎం జగన్ కూడా !
Brs Mla: బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?
బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?
ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిజైల్‌, భారత్‌ నుంచి తొలిసారి ఎగుమతి - ABP ఎక్స్‌క్లూజివ్ ఫొటోలు
ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిజైల్‌, భారత్‌ నుంచి తొలిసారి ఎగుమతి - ABP ఎక్స్‌క్లూజివ్ ఫొటోలు
Allu Arjun: బాలీవుడ్ హీరోలను బీట్ చేసిన బన్నీ - 1000 కోట్లు ఏంటి సామి? నంబర్ వన్ రేసులో దూసుకెళ్తున్న బన్నీ
బాలీవుడ్ హీరోలను బీట్ చేసిన బన్నీ - 1000 కోట్లు ఏంటి సామి? నంబర్ వన్ రేసులో దూసుకెళ్తున్న బన్నీ
Hyderabad News: సంతానం కోసం గరుడ ప్రసాదం వితరణ - చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం
సంతానం కోసం గరుడ ప్రసాదం వితరణ - చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం
ఉదయం 11 గంటల సమయానికి 24.5% పోలింగ్, కొనసాగుతున్న తొలి విడత ఓటింగ్
ఉదయం 11 గంటల సమయానికి 24.5% పోలింగ్, కొనసాగుతున్న తొలి విడత ఓటింగ్
నెలకు లక్ష రూపాయల స్కాలర్‌షిప్‌- తెలుగు విద్యార్థులకు స్వీట్ న్యూస్ చెప్పిన జపాన్‌
నెలకు లక్ష రూపాయల స్కాలర్‌షిప్‌- తెలుగు విద్యార్థులకు స్వీట్ న్యూస్ చెప్పిన జపాన్‌
Heavy Temparatures: నిప్పుల గుండంలా తెలుగు రాష్ట్రాలు - ఈ జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
నిప్పుల గుండంలా తెలుగు రాష్ట్రాలు - ఈ జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
Embed widget