By: ABP Desam | Updated at : 16 Sep 2021 12:02 PM (IST)
Edited By: Ramakrishna Paladi
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2021
పండగల సీజన్ మొదలవుతోంది. వినియోగ వస్తువులు తయారు చేసే, విక్రయించే కంపెనీలన్నీ భారీ ఆఫర్లతో ముందుకొస్తున్నాయి. ఈ క్రమంలో ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ భారీ స్థాయిలో ఆఫర్లు ప్రకటిస్తోంది. అతి త్వరలోనే 'బిగ్ బిలియన్ డేస్ 2021' మొదలవుతాయని తెలిపింది. దసరా, దీపావళి సందర్భంగా ప్రత్యేక రాయితీలపై ఉత్పత్తులు కొనుగోలు చేయొచ్చని వెల్లడించింది. బిగ్ బిలియన్ డేస్ ఆఫర్ల గురించి చెప్పినప్పటికీ తేదీలు మాత్రం ఇంకా ప్రకటించకపోవడం గమనార్హం.
'మీ అవసరాలు తీర్చేందుకు ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2021 అతి త్వరలో రాబోతోంది. స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, టీవీలు, వాషింగ్ మెషిన్లు సహా అనేక ఉత్పత్తులు బిగ్‌బిలియన్ డేస్ విక్రయాల్లో అందుబాటులో ఉన్నాయి. అన్ని రకాల వస్తువులపై మీరు భారీ రాయితీలు ఆశించొచ్చు. మీ కొనుగోలు జాబితాను సంతృప్తికరంగా ముగించొచ్చు' అని ఫ్లిప్‌కార్ట్ తమ వెబ్‌సైట్లో ప్రకటించింది.
బ్యాంకు వినియోగదారులకు..
ప్రస్తుతం ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకులతో ఫ్లిప్‌కార్ట్ ఒప్పందం కుదుర్చుకొంది. ఆ బ్యాంకుల వినియోగదారులు వస్తువలు కొనుగోలుపై అదనపు రాయితీలు పొందొచ్చని తెలిపింది. పేటీఎం ద్వారా షాపింగ్ చేసేవారికీ రాయితీలు లభిస్తాయని వెల్లడించింది.
ప్రత్యేక ఆఫర్లు ఇవే..
బాట్ సంస్థ ఉత్పత్తులపై 80 శాతం వరకు రాయితీ లభించనుంది. స్మార్ట్ వాచ్లపై 70 శాతం వరకు డిస్కౌట్ వస్తుందని తెలిసింది. డిజో ఉత్పత్తులపై 60, ఇంటెల్ ల్యాప్‌టాప్లపై 40 శాతం వరకు రాయితీలు రానున్నాయి.
అంతేకాకుండా ఇతర బ్రాండ్‌ల ల్యాప్‌టాపులు, స్మార్ట్ వేరబుల్స్, హెడ్‌ఫోన్లు, స్పీకర్లపై 80 శాతం వరకు రాయితీలు లభిస్తాయి. రిఫ్రిజరేటర్లపై 70శాతం వరకు డిస్కౌట్లు ఉంటాయని తెలిసింది. ఇక ఫ్లిప్‌కార్టులో లభించే ప్రతి వస్తువలపై కనీసం 50-70 శాతం వరకు రాయితీలు లభిస్తాయి. సామ్‌సంగ్ స్మార్ట్ ఫోన్లు, ఒప్పో ఉత్పత్తులు, వివో స్మార్ట్‌ఫోన్లు, ఐఫోన్ 12 సిరీస్‌లపై ప్రత్యేక డిస్కౌంట్లు ఇవ్వనున్నారు.
Apko Healthy banna hai to Kuvings b1700 cold press juicer is the way to go. This juicer makes for up to 80% nutrition extraction from your favourite fruits and vegetables, Get yours today from Flipkart. #FlipkartStudios #LargeAppliances pic.twitter.com/DLLslpH9E4
— Flipkart (@Flipkart) September 15, 2021
Petrol-Diesel Price 06 June 2023: తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి పెట్రోల్, డీజిల్ ధరలు - కొత్త రేట్లివి
Latest Gold-Silver Price Today 06 June 2023: పసిడికి డిమాండ్ - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
Adani Group: అప్పు తీర్చిన అదానీ, షేర్ ప్రైస్‌లో స్మార్ట్ రియాక్షన్
Stock Market News: కొనసాగుతున్న కన్సాలిడేషన్ - స్వల్పంగా తగ్గిన నిఫ్టీ, సెన్సెక్స్
RBI: కొత్త వడ్డీ రేట్లపై నేటి నుంచి ఆర్‌బీఐ సమీక్ష, రెపో రేట్ ఎంత పెరగొచ్చు?
జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షల్లో స్మార్ట్ కాపీయింగ్- స్నేహితుల కోసం చీట్ చేసి చిక్కిన టాపర్
WTC Final 2023 Live Streaming: డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ఫ్రీ లైవ్‌స్ట్రీమింగ్ ఎందులో? టైమింగ్, వెన్యూ ఏంటి?
Bro Special Song Cost : ఏంటిది పవన్ 'బ్రో' - ఊర్వశి స్పెషల్ సాంగ్‌కు అంత ఖర్చా?
మహేష్ బాబు ఫ్యామిలీ పార్టీ టైమ్ - శ్రీయా భూపాల్ బేబీ షవర్‌లో సందడి