iPhone 13 vs iPhone 12: కొత్త ఐఫోన్ 13 పై నెట్టింట మీమ్స్ వైరల్... ఐఫోన్ 12 - ఐ ఫోన్ 13 మధ్య తేడాలు వెతుకుతున్న నెటిజన్లు
5జీ ఐఫోన్ 13 సిరీస్ మోడల్ తమను నిరాశపరిచిందని ఎంతో మంది ట్విటర్ ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నో మీమ్స్ వైరల్‌గా మారాయి.
ప్రముఖ యాపిల్ కంపెనీ 5జీ ఐఫోన్ 13 సిరీస్‌ను ఫోన్ ప్రియుల కోసం తాజాగా తీసుకువచ్చింది. ఈ కొత్త ఐఫోన్ మోడల్ కోసం చాలా మంది ఎంతగానో వేచి చూశారు. అయితే ఈ మోడల్ తమను నిరాశపరిచిందని ఎంతో మంది ట్విటర్ ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నో మీమ్స్ వైరల్‌గా మారాయి.
Me trying to spot the difference between iPhone 13 and iPhone 12#AppleEvent pic.twitter.com/Lv61EDLptU
— Rash (@Rashousmane) September 14, 2021
ఎక్కువ శాతం మంది ఐఫోన్ 12 - ఐఫోన్ 13 సిరీస్‌లకు మధ్య తేడా ఏంటా అని ప్రశ్నిస్తున్నారు. ఈ రెండింటికీ భూతద్దం వేసి వెతికినా తేడాలు తెలియడం లేదని వాపోతున్నారు. రెండు సిరీస్ ఫోన్లకు తేడాలు అంతగా లేనప్పుడు కొత్త సిరీస్ తేవడం ఎందుకు? పాత సిరీస్ పేరే ఉంచొచ్చుగా అని వ్యాఖ్యలు జత చేస్తున్నారు. ఇంతకీ నెట్టింట్లో వైరల్ అవుతున్న ఆ మీమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
Me trying to spot the difference between iPhone 12 Pro Max and iPhone 13 pro max #AppleEvent pic.twitter.com/vdAgMBxfgg
— Jsemfrajeeer (@jsemfrajeeer) September 14, 2021
iPhone 12 users upgraded to iPhone 13 be like : #AppleEvent pic.twitter.com/6Z4nNS1W7L
— 𝓝 (@IhrVortrag) September 15, 2021
iPhone 12 vs iPhone 13 pic.twitter.com/V3hzWb0eSQ
— zomato (@zomato) September 14, 2021
iPhone 11 and 12 to the iPhone 13 #AppleEvent pic.twitter.com/DSEwk1T9Ca
— ℑ. 🤍 (@lumberry) September 14, 2021
నిజానికి యాపిల్ మంచి మార్పులతోనే 13 సిరీస్‌ను లాంఛ్ చేసింది. బ్యాటరీ లైఫ్, వీడియో రికార్డింగ్ మోడ్, ఫోన్ కెమేరాలో కొత్తగా సినిమాటిక్ మోడ్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. డాల్బీ విజన్ HDRలో షూట్ చేయవచ్చు. మ్యాగ్ సేఫ్ ఛార్జింగ్నూ ఇవి సపోర్ట్ చేస్తాయి. ఈ కొత్త సిరీస్ వెనక భాగానికి కొత్తగా రూపొందించింది. కాకపోతే చూస్తానికి ఐఫోన్ 12 - ఐఫోన్ 13 ఒకేలా ఉన్నాయని ఫోన్ ప్రియులు చెబుతున్నారు.ఐఫోన్ 13 సిరీస్లో ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మాక్స్లను... యాపిల్ వాచ్ సిరీస్ 7, ఐప్యాడ్ మినీ, ఐప్యాడ్ 2021లనూ కొత్తగా ఆవిష్కరించింది.