అన్వేషించండి

Credit Score: క్రెడిట్‌ స్కోర్‌ తగ్గిందని ఆందోళన వద్దు, పెంచుకోవడం చాలా ఈజీ

మంచి స్కోర్‌ ఉన్న వాళ్లకు బ్యాంకులు ప్రాధాన్యత ఇస్తాయి, రుణం ఇవ్వకుండా వదిలి పెట్టవు.

Credit Score: బ్యాంకులు సహా ఏ ఫైనాన్స్‌ కంపెనీ నుంచి మనం లోన్‌ తీసుకోవాలన్నా, అవి మొట్టమొదట చూసేది మీ క్రెడిట్‌ స్కోర్‌. క్రెడిట్‌ స్కోర్‌ బాగుందని సంతృప్తి చెందితేనే ఆయా సంస్థలు లోన్లు ఇస్తాయి. క్రెడిట్‌ స్కోర్‌ బాగుంటే (Good Credit Score) మీకు కొన్ని అవకాశాలు కూడా ఉంటాయి. బ్యాంక్‌ నుంచి ఎక్కువ రుణం అడగొచ్చు, తక్కువ వడ్డీ కోసం బేరం చేయవచ్చు. మంచి స్కోర్‌ ఉన్న వాళ్లకు బ్యాంకులు ప్రాధాన్యత ఇస్తాయి, రుణం ఇవ్వకుండా వదిలి పెట్టవు. స్కోర్‌ తక్కువగా ఉంటే మాత్రం లోన్‌ ఇవ్వలేమని నిర్మొహమాటంగా చెబుతాయి.

పర్సనల్‌ లోన్‌, హౌస్‌ లోన్‌, వెహికల్‌ లోన్‌.. ఇలాంటి ఏ విధమైన అప్పును మీరు తీసుకోవాలన్నా క్రెడిట్ స్కోర్ 700 దాటి ఉండాలి. 700 కంటే తక్కువగా ఉంటే బ్యాంకులు మీ అప్లికేషన్‌ను పక్కన పెట్టేస్తాయి.

తక్కువగా ఉన్న క్రెడిట్‌ స్కోరును పెంచుకునే పద్ధతులు:

1. మీరు తీసుకున్న లోన్ల మీద చెల్లింపులను గడువు లోగా కచ్చితంగా పూర్తి చేయండి. క్రెడిట్ కార్డు బిల్లును గానీ, లోన్ EMIను గానీ లాస్ట్‌ డేట్‌ రాకముందే చెల్లించండి. ఏ కారణం వల్ల గడువు దాటినా, ఆ ప్రభావం క్రెడిట్ స్కోర్‌ మీద పడుతుంది.

2. ఎక్కువ లోన్లు, అవసరం లేకపోయినా క్రెడిట్ కార్డ్‌లు తీసుకోవద్దు. మీ ఆర్థిక పరిస్థితి తారుమారై, డబ్బు కట్టకపోతే క్రెడిట్ స్కోర్‌ ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి, అనవసర ప్రయాస వద్దు.

3. సురక్షిత (సెక్యూర్డ్), అసురక్షిత (అన్‌ సెక్యూర్డ్‌) రుణాలను జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోండి. ఆస్తి పేపర్లు తనఖా పెట్టుకుంటాయి కాబట్టి హోమ్ లోన్స్, కార్ లోన్స్‌ను సెక్యూర్డ్ లోన్స్ అని... తనఖా ఏమీ ఉండదు కాబట్టి పర్సనల్ లోన్స్‌, క్రెడిట్ కార్డ్ లోన్స్‌ను అన్‌ సెక్యూర్డ్ లోన్స్‌గా బ్యాంకులు పరిగణిస్తాయి.

4. మీ క్రెడిట్ కార్డ్‌లోని లిమిట్‌ మొత్తాన్నీ వాడొద్దు. క్రెడిట్ కార్డు లిమిట్‌లో సగం వరకు మాత్రమే ఉపయోగించడం ఉత్తమం. తరచుగా క్రెడిట్‌ కార్డ్‌ లిమిట్‌ మొత్తాన్నీ వాడుతుంటే, అనవసర ఖర్చులు పెట్టే వ్యక్తిగా బ్యాంకులు మిమ్మల్ని పరిగణిస్తాయి. లోన్‌ ఇచ్చే సమయంలో ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుంటాయి.

5. నెల నెలా మీరు చెల్లించే EMIల మొత్తం జీతం లేదా ఆదాయంలో 50 శాతం దాటకుండా చూసుకోండి. ఇలాంటి నియంత్రణ పాటిస్తే గడువులోగా EMIలన్నీ వెళ్లిపోతాయి. క్రెడిట్‌ స్కోర్‌ సాఫీగా పెరుగుతుంది.

6. బ్యాంక్‌ లోన్లు లేదా క్రెడిట్‌ కార్డుల కోసం పదేపదే అప్లై చేయొద్దు. ఇలా చేస్తే... మీరేదో అత్యవసరంలో ఉన్నారని, అప్పు తీసుకున్నాక చెల్లించే పరిస్థితి మీకు ఉంటుందో, లేదోనని బ్యాంకులు అనుమానిస్తాయి. మీ క్రెడిట్‌ రిపోర్ట్‌లోనూ ఈ విషయం నమోదవుతుంది.

7. రేటింగ్‌ ఏజెన్సీలు ఇచ్చే క్రెడిట్ రిపోర్ట్‌లు దాదాపు కరెక్ట్‌గానే ఉంటాయి. ఒక్కోసారి వాటిలో తప్పులు దొర్లే అవకాశముంది. కాబట్టి, మీ క్రెడిట్ రిపోర్ట్‌ను 3-4 నెలలకు ఒకసారైనా పరిశీలించండి. ఒకవేళ ఏదైనా తప్పు కనిపిస్తే, కస్టమర్‌ కేర్‌కు కాల్‌ చేసి సాధ్యమైనంత త్వరగా సరిచేయించుకోండి.

టాప్ హెడ్ లైన్స్

Jio Platforms IPO: లిస్టింగ్‌కు ముందే జియో IPO బంపర్ హిట్.. గ్లోబల్ ఇన్వెస్టర్ల క్యూ.. 30 రెట్లకు పైగా డిమాండ్!
లిస్టింగ్‌కు ముందే జియో IPO బంపర్ హిట్.. గ్లోబల్ ఇన్వెస్టర్ల క్యూ.. 30 రెట్లకు పైగా డిమాండ్!
IIT Tirupati Canadian GeoAI Agreement : IIT తిరుపతి , వన్‌ ఇండియాతో కెనడా జియో ఏఐ సంస్థ ఒప్పందాలు.. విద్యార్థులకు ఏం లాభం?
IIT తిరుపతి , వన్‌ ఇండియాతో కెనడా జియో ఏఐ సంస్థ ఒప్పందాలు.. విద్యార్థులకు ఏం లాభం?
Jio Platforms IPO: 5జీ, బ్రాడ్‌బ్యాండ్, ఏఐ పునాదులపై భారత్ తదుపరి డిజిటల్ శతాబ్దానికి బాటలు!
JPL IPO: 5జీ, బ్రాడ్‌బ్యాండ్, ఏఐ టెక్నాలజీతో భారత్ తదుపరి డిజిటల్ శతాబ్దానికి బాటలు!
Jio Platforms IPO: జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓకు లిస్టింగ్‌కు ముందే రూ. 2.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల డిమాండ్
జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓకు లిస్టింగ్‌కు ముందే రూ. 2.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల డిమాండ్

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizianagaram Municipal Corporation Election: విజయనగరం కార్పొరేషన్ ఎన్నికల తేదీలో మార్పు.. కలెక్టర్ లేఖతో ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం
విజయనగరం కార్పొరేషన్ ఎన్నికల తేదీలో మార్పు.. కలెక్టర్ లేఖతో ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం
Graduate MLC Election: తొలిసారి ఎన్నికల బరిలోకి కవిత పార్టీ.. తొలి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరు ప్రకటన
తొలిసారి ఎన్నికల బరిలోకి కవిత పార్టీ.. తొలి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరు ప్రకటన
YS Jagan In Pulivendula: ఈ 21నుంచి 3 రోజులు పులివెందులలోనే జగన్.. దగ్గరుండి వైసీపీ నామినేషన్లు పర్యవేక్షణ
ఈ 21నుంచి 3 రోజులు పులివెందులలోనే జగన్.. దగ్గరుండి వైసీపీ నామినేషన్లు పర్యవేక్షణ
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలిని వెళ్లిపోగానే శ్వేత వచ్చిందా..రోహిత్‌పై ఆర్‌పీ సెటైర్లు! నోటికొచ్చినట్లు తిట్టుకుంటున్నారే!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలిని వెళ్లిపోగానే శ్వేత వచ్చిందా..రోహిత్‌పై ఆర్‌పీ సెటైర్లు! నోటికొచ్చినట్లు తిట్టుకుంటున్నారే!
Vizag Araku Trains: దసరా రద్దీకి రైల్వే ఊరట.. విశాఖ- అరకు రైలుకు అదనపు విస్టాడోమ్ కోచ్ పెంపు!
దసరా రద్దీకి రైల్వే ఊరట.. విశాఖ- అరకు రైలుకు అదనపు విస్టాడోమ్ కోచ్ పెంపు!
CM Revanth Reddy: దసరా వేడుకలకు సొంతూరుకు సీఎం రేవంత్‌రెడ్డి.. కొండారెడ్డిపల్లిలో ఘన స్వాగతం, ఆలయాల్లో పూజలు
దసరా వేడుకలకు సొంతూరుకు సీఎం రేవంత్‌రెడ్డి.. కొండారెడ్డిపల్లిలో ఘన స్వాగతం, ఆలయాల్లో పూజలు
Pant Career Crossroads: టెస్టుల్లో రారాజు వైట్ బాల్ లో జీరో.. పంత్ కు తప్పిన వన్డే ప్రపంచకప్ బెర్త్, నేచురల్ గేమ్ పై రవిశాస్త్రి హితవు
టెస్టుల్లో రారాజు వైట్ బాల్ లో జీరో.. పంత్ కు తప్పిన వన్డే ప్రపంచకప్ బెర్త్, నేచురల్ గేమ్ పై రవిశాస్త్రి హితవు
Cockroach Janata Party: దీపావళి వరకు నిరసనలు వాయిదా.. కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం.. రామ్‌లీలా కమిటీ దీప్కే కౌంటర్
దీపావళి వరకు నిరసనలు వాయిదా.. కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం.. రామ్‌లీలా కమిటీ దీప్కే కౌంటర్
Embed widget