(Source: ECI/ABP News/ABP Majha)
Mobile Gaming App Downloads: గతేడాది 2,600 కోట్ల యాప్ డౌన్‌లోడ్స్ - పాపులర్ యాప్స్ ఇవే
Mobile Gaming Apps: గేమింగ్ యాప్స్ డౌన్‌లోడ్ సంఖ్య 9.3 బిలియన్లు, దీనిదే ఫస్ట్ ప్లేస్.
Popular Gmaing Apps in 2023: దాదాపు 143 కోట్ల మంది ప్రజలు ఉన్న భారత్, ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశం. ఎక్కువ జనాభా ఉంది కాబట్టి, ఇండియన్ మొబైల్ ఫోన్ మార్కెట్ కూడా చాలా పెద్దది. భారతీయుల్లో చాలా మంది దగ్గర ఒకటి కంటే ఎక్కువ సెల్‌ఫోన్లు, వాటిలో పదుల కొద్దీ యాప్స్ ఉన్నాయి.
డేటా అనలిటిక్స్ ప్లాట్‌ఫారమ్ data.ai రిపోర్ట్ ప్రకారం.... 2023లో, భారతీయులు తమ మొబైల్ ఫోన్లలోకి దాదాపు 26 బిలియన్ల యాప్స్ (2,600 కోట్లు) డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే, ఆండ్రాయిడ్ (Android), ఐవోఎస్ (iOS)తో పని చేసే మొబైల్ డివైజ్‌ల్లోకి 25.96 బిలియన్ యాప్స్ డౌన్‌లోడ్ చేశారు. అయితే... 2022లోని 28 బిలియన్ల డౌన్‌లోడ్స్ కంటే 2023లో కొంచం తగ్గడం విశేషం.
మనం యాప్ డౌన్‌లోడ్స్ చేసుకుంటే, యాప్ పబ్లిషర్లు వందల కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు. భారత్‌లో, వివిధ పబ్లిషర్లు మొత్తం 415 మిలియన్ డాలర్లు సంపాదించారు.
ఏ కేటగిరీలో ఎన్ని డౌన్‌లోడ్స్?
యాప్ కేటగిరీల్లో... గేమింగ్ యాప్స్ డౌన్‌లోడ్ సంఖ్య 9.3 బిలియన్లు, దీనిదే ఫస్ట్ ప్లేస్. ఆ తర్వాత సోషల్ (2.36 బిలియన్లకు పైగా), ఫోటో & వీడియో (1.86 బిలియన్లు) కేటగిరీలు ఉన్నాయి. వీటి తర్వాత... ఫైనాన్స్ (1.6 బిలియన్), ఎంటర్‌టైన్‌మెంట్ (1.3 బిలియన్), షాపింగ్ (1.10 బిలియన్), బిజినెస్ (446 మిలియన్), ఎడ్యుకేషన్ (439 మిలియన్), ప్రొడక్టివిటీ టూల్స్ (995 మిలియన్), లైఫ్‌స్టైల్ (468 మిలియన్లు) ఉన్నాయి.
పాపులర్ యాప్స్
2023లో 40 మిలియన్ల డౌన్‌లోడ్స్ సహా, మొత్తం 449 మిలియన్ల డౌన్‌లోడ్స్‌తో గూగుల్ (Google) అత్యంత ప్రజాదరణ పొందిన యాప్‌గా నిలిచింది. ఇన్‌స్టాగ్రామ్ 364 మిలియన్లు (2023లో 30 మిలియన్ డౌన్‌లోడ్స్), రిలయన్స్ జియో 266 మిలియన్లు (18 మిలియన్ డౌన్‌లోడ్స్), ఫ్లిప్‌కార్ట్ 220 మిలియన్లు (28 మిలియన్ డౌన్‌లోడ్స్), వాట్సాప్ 210 మిలియన్లు (20 మిలియన్ డౌన్‌లోడ్స్), మెటా 207 మిలియన్లు (21 మిలియన్ డౌన్‌లోడ్స్) తర్వాతి ర్యాంక్‌ల్లో నిలిచాయి.
ఈ-కామర్స్ సెగ్మెంట్
ఈ-కామర్స్ ప్లేయర్ మీషో (Meesho), ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన షాప్సీ (Shopsy) కంటే చాలా ముందుంది. 2023 ముగింపు నాటికి మీషోకు 35.8 మిలియన్ల యాక్టివ్ క్లయింట్స్ (Active clients) ఉంటే, షాప్సీకి 11 మిలియన్ల క్లయింట్స్ ఉన్నారు.
ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్ (Amazon), ఫ్లిప్‌కార్ట్ (Flipkart) కూడా నెక్-టు-నెక్ పోటీలో ఉన్నాయి. 2023లో, ఫ్లిప్‌కార్ట్‌కు 82.1 మిలియన్ల యాక్టివ్ యూజర్లు (Active users) ఉంటే, అమెజాన్‌కు 76 మిలియన్లకు పైగా యూజర్స్ ఉన్నారు.
ఎంటర్‌టైన్‌మెంట్ సెగ్మెంట్
ఓవర్-ది-టాప్ (OTT) ఎంటర్‌టైన్‌మెంట్ విభాగం.... డిస్నీ+ హాట్‌స్టార్‌కు (Disney+ Hotstar) 67 మిలియన్ యాక్టివ్ యూజర్ల బేస్ ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో... 16 మిలియన్లతో నెట్‌ఫ్లిక్స్ (Netflix); 10 మిలియన్లతో అమెజాన్ ప్రైమ్ (Amazon Prime), 6.7 మిలియన్లతో జీ5 (Zee 5) ఉన్నాయి.
మాతృ సంస్థ విభాగంలో... మెటా (Meta)ను బీట్ చేసే కంపెనీయే లేకుండా పోయింది. ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, మెటాతో కలిపి గత సంవత్సరం 70 మిలియన్ డౌన్‌లోడ్స్ జరిగాయి, మొత్తం 782 మిలియన్లకు చేరాయి. 527 మిలియన్లతో గూగుల్ పేరెంట్ ఆల్ఫాబెట్ రెండో స్థానంలో ఉంది.
మరో ఆసక్తికర కథనం: హెల్త్ ఇన్సూరెన్స్‌లో కో-పేమెంట్, డిడక్టబుల్ రూల్స్ గురించి మీకు తెలుసా?