IRCTC Share Price: ఐఆర్‌సీటీసీ అదుర్స్.. రూ.6,375కు పెరిగిన షేరు.. లక్ష కోట్లకు క్యాపిటలైజేషన్
ఐఆర్‌సీటీసీ షేరు మదుపర్లకు డబ్బుల పంట పండించింది. మంగళవారం 8.3 శాతం పెరగడంతో సరికొత్త గరిషష్ఠమైన రూ. 6,375ను తాకింది. ఫలితంగా ఆ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.లక్ష కోట్ల మైలురాయిని దాటింది.
ఐఆర్‌సీటీసీ షేరు మదుపర్లకు డబ్బుల పంట పండించింది. మంగళవారం 8.3 శాతం పెరగడంతో సరికొత్త గరిషష్ఠమైన రూ. 6,375ను తాకింది. ఫలితంగా ఆ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.లక్ష కోట్ల మైలురాయిని దాటింది. గత ఐదు రోజుల్లోనే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండర్ టూరిజం కార్పొరేషన్ స్టాక్ కనీసం 30 శాతం పెరిగింది. ఇక ఒకే నెలలో 70 శాతం ర్యాలీ చేసింది. ఆరు నెలల్లో 300 శాతం, ఏడాదిలో 333 శాతం లాభపడింది.
Also Read: Retirement Planning: రిటైర్మెంట్ ప్లానింగ్‌లో ఈ ఐదు పొరపాట్లు అస్సలు చేయకండి.. లేదంటే నష్టపోతారు!
కొన్ని నెలలు ఐఆర్‌సీటీ షేరు రూ.5000 ఎప్పుడు దాటుతుందా అని మదుపర్లు ఎదురు చూశారు. గత నెలలో ఈ మానసిక అంతరాన్ని షేరు అధిగమించింది. ఆ తర్వాత వేగంగా మూమెంటమ్ అందుకుంది. ఇప్పుడు సునాయసంగా ఐదు వేలకు పైగానే ట్రేడ్ అవుతోంది.
సోమవారం రూ.5,887 వద్ద ముగిసిన ఈ షేరు మంగళవారం ఉదయం భారీ గ్యాప్ అప్‌తో రూ.6,149 వద్ద ఆరంభమైంది. మరికాసేపటికే జీవితకాల గరిష్ఠమైన రూ.6,340ను అందుకుంది. కొనుగోళ్లు అలాగే సాగడంతో మధ్యా్‌హ్నం 2.45 గంటల వరకు రూ.6,300 రేంజ్‌లోనే కొనసాగింది. ఆఖర్లో లాభాల స్వీకరణకు పాల్పడటంతో రూ.881 నష్టంతో రూ.4,996 వద్ద ముగిసింది.
Also Read: ప్రత్యర్థులకు టాటా ‘పంచ్’.. తక్కువ ధరలో కారు కొనాలనేవారికి కరెక్ట్ ఛాయిస్!
స్టాక్ మార్కెట్లో ప్రవేశించినప్పటి నుంచి ఐఆర్‌సీటీసీ 1892 శాతం పెరిగింది. 2021 జులై- సెప్టెంబర్ త్రైమాసికంలో టికెట్ల బుకింగ్ రెట్టింపైంది. దాంతో మెరుగైన ఫలితాలు వస్తాయని మదుపర్లు అంచనా వేస్తున్నారు. అందుకే కొనుగోళ్లకు దిగుతున్నారు. 'రెండో త్రైమాసికం ఫలితాలపై మదుపర్లు ఆశావహంగా ఉన్నారు. గతంతో పోలిస్తే మెరుగైన ఫలితాలే వస్తాయని అనుకుంటున్నారు. ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకోవడంతో రైలు ప్రయాణాలకు డిమాండ్ కూడా పెరిగింది' అని క్యాపిటల్ వయా గ్లోబల్ రీసెర్చ్ సీనియర్ రీసెర్చ్ అనలిస్టు లిఖితా అన్నారు.
Also Read: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఆర్బీఐ షాక్.. ఎస్‌బీఐకి భారీ జరిమానా.. ఎందుకంటే..!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Explore the ‘City of Joy’ Kolkata & other hidden gems of WestBengal on a cruise holiday you will remember forever! Starting at Rs.31,500/-*pp, this 3D/2N magical trip on the seas is just what you need to spend quality time with your friends & family. pic.twitter.com/HRM2bQqrI8
— IRCTC (@IRCTCofficial) October 18, 2021