అన్వేషించండి

Credit Score: క్రెడిట్‌ స్కోర్‌ తగ్గి లోన్లు రావట్లేదా?, మీటర్‌ పెంచడం మీ చేతుల్లోనే ఉంది

క్రెడిట్‌ స్కోర్‌ బాగుంటే వెంటనే లోన్‌ మంజూరు కావడమే కాదు, మరికొన్ని అదనపు ప్రయోజనాలు కూడా ఉంటాయి.

Credit Score: బ్యాంకులు సహా ఏ ఫైనాన్స్‌ కంపెనీ నుంచి లోన్‌ తీసుకోవాలన్నా, ఆయా సంస్థలు మొట్టమొదట చూసేది మీ వ్యక్తిగత క్రెడిట్‌ స్కోర్‌నే. క్రెడిట్‌ స్కోర్‌ బాగుందని సంతృప్తి చెందితేనే అవి అప్పులు ఇస్తాయి. క్రెడిట్‌ స్కోర్‌ బాగుంటే (Good Credit Score) వెంటనే లోన్‌ మంజూరు కావడమే కాదు, మరికొన్ని అదనపు ప్రయోజనాలు కూడా ఉంటాయి. మీ స్కోర్‌ ఎక్స్‌లెంట్‌ లెవల్‌లో ఉంటే, మీరు బ్యాంక్‌ నుంచి ఎక్కువ రుణం అడగొచ్చు, తక్కువ వడ్డీ రుణం కోసం బేరం చేయవచ్చు. మంచి స్కోర్‌ ఉన్న వాళ్లకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ప్రాధాన్యత ఇస్తాయి, రుణం ఇవ్వకుండా వదిలి పెట్టవు. స్కోర్‌ తక్కువగా ఉంటే మాత్రం లోన్‌ ఇవ్వలేమని నిర్మొహమాటంగా చెబుతాయి.

పర్సనల్‌ లోన్‌, హౌస్‌ లోన్‌, వెహికల్‌ లోన్‌.. ఇలాంటి ఏ విధమైన అప్పును మీరు తీసుకోవాలన్నా క్రెడిట్ స్కోర్ 700 దాటి ఉండాలి. 700 కంటే తక్కువగా ఉంటే బ్యాంకులు మీ లోన్‌ అప్లికేషన్‌ను పక్కన పెట్టేస్తాయి.

క్రెడిట్‌ మీటర్‌ పెంచుకుందాం ఇలా:

1. మీరు తీసుకున్న లోన్ల మీద చెల్లింపులను గడువు లోగా కచ్చితంగా పూర్తి చేయండి. క్రెడిట్ కార్డు బిల్లును గానీ, లోన్ EMIను గానీ లాస్ట్‌ డేట్‌ రాకముందే చెల్లించండి. ఏ కారణం వల్ల గడువు దాటినా, ఆ ప్రభావం క్రెడిట్ స్కోర్‌ మీద పడుతుంది. దీనికి బోనస్‌గా పెనాల్టీ రూపంలో మీరు మరికొంత డబ్బు కట్టాల్సి వస్తుంది.

2. ఎక్కువ లోన్లు, అవసరం లేకపోయినా క్రెడిట్ కార్డ్‌లు తీసుకోవద్దు. ఎక్కువ లోన్స్ లేదా ఎక్కువ కార్డులు మీ దగ్గరుంటే నెల తిరిగే సరికి పెద్ద మొత్తంలో డబ్బు కట్టాల్సి వస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి తారుమారై, డబ్బు కట్టకపోతే క్రెడిట్ స్కోర్‌ ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి, అనవసర ప్రయాస వద్దు.

3. సురక్షిత (సెక్యూర్డ్), అసురక్షిత (అన్‌ సెక్యూర్డ్‌) రుణాలను జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోండి. ఆస్తి పేపర్లు తనఖా పెట్టుకుంటాయి కాబట్టి హోమ్ లోన్స్, కార్ లోన్స్‌ను సెక్యూర్డ్ లోన్స్ అని... తనఖా ఏమీ ఉండదు కాబట్టి పర్సనల్ లోన్స్‌, క్రెడిట్ కార్డ్ లోన్స్‌ను అన్‌ సెక్యూర్డ్ లోన్స్‌ అని బ్యాంకులు పరిగణిస్తాయి.

4. మీ క్రెడిట్ కార్డ్‌లోని లిమిట్‌ మొత్తాన్నీ వాడొద్దు. క్రెడిట్ కార్డు లిమిట్‌లో సగం వరకు మాత్రమే ఉపయోగించడం ఉత్తమం. మీరు తరచుగా క్రెడిట్‌ కార్డ్‌ లిమిట్‌ మొత్తాన్నీ వాడుతుంటే, అనవసర ఖర్చులు పెట్టే వ్యక్తిగా బ్యాంకులు మిమ్మల్ని పరిగణిస్తాయి. లోన్‌ ఇచ్చే సమయంలో ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుంటాయి.

5. నెల నెలా మీరు చెల్లించే EMIల మొత్తం మీ నెలవారీ జీతం లేదా మొత్తం ఆదాయంలో 50 శాతం దాటకుండా చూసుకోండి. ఇలాంటి నియంత్రణ పాటిస్తే గడువులోగా EMIలన్నీ వెళ్లిపోతాయి. క్రెడిట్‌ స్కోర్‌ సాఫీగా పెరుగుతుంది.

6. బ్యాంక్‌ లోన్లు లేదా క్రెడిట్‌ కార్డుల కోసం పదేపదే అప్లై చేయొద్దు. ఇలా చేస్తే... మీరేదో అత్యవసరంలో ఉన్నారని, అప్పు తీసుకున్నాక చెల్లించే పరిస్థితి మీకు ఉంటుందో, లేదోనని బ్యాంకులు అనుమానిస్తాయి. మీ క్రెడిట్‌ రిపోర్ట్‌లోనూ ఈ విషయం నమోదవుతుంది.

7. రేటింగ్‌ ఏజెన్సీలు ఇచ్చే క్రెడిట్ రిపోర్ట్‌లు దాదాపు కరెక్ట్‌గానే ఉంటాయి. ఒక్కోసారి వాటిలో తప్పులు దొర్లే అవకాశముంది. కాబట్టి, మీ క్రెడిట్ రిపోర్ట్‌ను 3-4 నెలలకు ఒకసారైనా పరిశీలించండి. ఒకవేళ ఏదైనా తప్పు కనిపిస్తే, కస్టమర్‌ కేర్‌కు కాల్‌ చేసి సాధ్యమైనంత త్వరగా సరిచేయించుకోండి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Araku coffee: అరకు బ్రాండ్ నానో లాట్ కాఫీ కేజీ రూ.పదివేలు - అయినా నిమిషాల్లో స్టాక్ క్లియర్ - ఆనంద్ మహింద్రా ఆనందం !
అరకు బ్రాండ్ నానో లాట్ కాఫీ కేజీ రూ.పదివేలు - అయినా నిమిషాల్లో స్టాక్ క్లియర్ - ఆనంద్ మహింద్రా ఆనందం !
Tamil Nadu Elections 2026 : కరూర్ తొక్కిసలాట తర్వాత జరిగిన మొదటి ర్యాలీలో పాల్గొన్న విజయ్! DMK దుష్ట శక్తి అంటూ కామెంట్స్
కరూర్ తొక్కిసలాట తర్వాత జరిగిన మొదటి ర్యాలీలో పాల్గొన్న విజయ్! DMK దుష్ట శక్తి అంటూ కామెంట్స్
Business Reformer of the Year 2025: బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ చంద్రబాబు - అభినందించిన మంత్రులు, అధికారులు
బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ చంద్రబాబు - అభినందించిన మంత్రులు, అధికారులు
Pakistan begging : విదేశాలకు వెళ్లి మరీ అడుక్కుంటున్న పాకిస్తాన్ ప్రజలు - పరువు పోతోందని వాళ్లను ఏం చేశారంటే ?
విదేశాలకు వెళ్లి మరీ అడుక్కుంటున్న పాకిస్తాన్ ప్రజలు - పరువు పోతోందని వాళ్లను ఏం చేశారంటే ?

వీడియోలు

గిల్ విషయంలో బీసీసీఐ షాకిండ్ డెసిషన్..గాయం సాకుతో వేటు?
జాక్‌పాట్ కొట్టేసిన ఆర్సీబీ.. ఐపీఎల్‌ మినీ వేలంలో ఆర్సీబీ ఆ పాయింట్‌పైనే ఫోకస్ చేసిందా?
విధ్వంసం c/o SRH.. ఈసారి టైటిల్ ఆరెంజ్ ఆర్మీదే?
అక్కడే ఎందుకు?.. 4వ టీ20 మ్యాచ్ రద్దుపై ఫ్యాన్స్ సిరియస్
James Cameron Shoot Varanasi Mahesh Scenes | జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో వారణాసి మహేశ్ బాబు | ABP

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Araku coffee: అరకు బ్రాండ్ నానో లాట్ కాఫీ కేజీ రూ.పదివేలు - అయినా నిమిషాల్లో స్టాక్ క్లియర్ - ఆనంద్ మహింద్రా ఆనందం !
అరకు బ్రాండ్ నానో లాట్ కాఫీ కేజీ రూ.పదివేలు - అయినా నిమిషాల్లో స్టాక్ క్లియర్ - ఆనంద్ మహింద్రా ఆనందం !
Tamil Nadu Elections 2026 : కరూర్ తొక్కిసలాట తర్వాత జరిగిన మొదటి ర్యాలీలో పాల్గొన్న విజయ్! DMK దుష్ట శక్తి అంటూ కామెంట్స్
కరూర్ తొక్కిసలాట తర్వాత జరిగిన మొదటి ర్యాలీలో పాల్గొన్న విజయ్! DMK దుష్ట శక్తి అంటూ కామెంట్స్
Business Reformer of the Year 2025: బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ చంద్రబాబు - అభినందించిన మంత్రులు, అధికారులు
బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ చంద్రబాబు - అభినందించిన మంత్రులు, అధికారులు
Pakistan begging : విదేశాలకు వెళ్లి మరీ అడుక్కుంటున్న పాకిస్తాన్ ప్రజలు - పరువు పోతోందని వాళ్లను ఏం చేశారంటే ?
విదేశాలకు వెళ్లి మరీ అడుక్కుంటున్న పాకిస్తాన్ ప్రజలు - పరువు పోతోందని వాళ్లను ఏం చేశారంటే ?
Upcoming Movies 2027: మహేష్ 'వారణాసి' to ప్రభాస్ 'స్పిరిట్', AA22xA6... నెక్స్ట్ ఇయర్ కాదు, 2027లో దుమ్ము రేపే సినిమాలు
మహేష్ 'వారణాసి' to ప్రభాస్ 'స్పిరిట్', AA22xA6... నెక్స్ట్ ఇయర్ కాదు, 2027లో దుమ్ము రేపే సినిమాలు
VB G Ram G Bill : లోక్‌సభలో వ్యతిరేకత మధ్య వీబీజీ రామ్ జీ బిల్లు ఆమోదం! ప్రతులు చించి నిరసన తెలిపిన ప్రతిపక్షం!
లోక్‌సభలో వ్యతిరేకత మధ్య వీబీజీ రామ్ జీ బిల్లు ఆమోదం! ప్రతులు చించి నిరసన తెలిపిన ప్రతిపక్షం!
Bengalore One Side Love: మహిళ వన్ సైడ్ లవ్ - తట్టుకోలేకపోయిన పోలీస్ - చివరికి ఏం జరిగింది?
మహిళ వన్ సైడ్ లవ్ - తట్టుకోలేకపోయిన పోలీస్ - చివరికి ఏం జరిగింది?
Avatar 3 : బాహుబలి, అఖండ, రుద్ర, సలార్‌లతో అవతార్ సెల్ఫీ దిగితే - ఇది మరో విజువల్ వండర్
బాహుబలి, అఖండ, రుద్ర, సలార్‌లతో అవతార్ సెల్ఫీ దిగితే - ఇది మరో విజువల్ వండర్
Embed widget