అన్వేషించండి

Home Buyers: గృహ కొనుగోలుదార్లకు గుడ్‌న్యూస్‌, బిల్డర్‌ మోసాలు ఇకపై చెల్లవు!

House For Sale News: గుజరాత్‌ రెరా తరహాలో రికవరీ యంత్రాంగాన్ని తీసుకురావాలని అన్ని రెరాలకు సూచించింది.

Refund To Home Buyers: ప్రతి వ్యక్తి జీవితంలో సొంత ఇల్లు అనేది అత్యంత కీలకమైన విషయం. ఇల్లు అంటే కేవలం నాలుగు గోడలు కాదు, ఒక కుటుంబం కష్టార్జితం. భారతీయుల విషయంలో సొంతిల్లు ఒక సెంటిమెంట్‌. ఇంటి ఇటుకల్లో ప్రేమ కూడా పెనవేసుకుని ఉంటుంది.

సొంతింటి కలను ఎలాగైనా నెరవేర్చుకోవాలనే ఆశతో, జీవిత కాలం కష్టపడ్డ డబ్బును లేదా అప్పుగా తీసుకొచ్చిన డబ్బును బిల్డర్‌ చేతుల్లో పోస్తాం. కొన్నిసార్లు రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్లు మోసం చేస్తారు. ఇల్లు కట్టరు, డబ్బు తిరిగి ఇవ్వరు. ఈ తరహా అక్రమాలతో ఇబ్బంది పడుతున్న గృహ కొనుగోలుదార్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై, డెవలపర్లు డిఫాల్ట్ అయితే, ఇంటి కొనుగోలుదార్లు తమ డబ్బును సులభంగా తిరిగి (Refund) పొందొచ్చు. దీనికి సంబంధించి, కేంద్ర గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాల రెరాలకు (RERA -  Real Estate Regulatory Authority) ఒక కొత్త అడ్వైజరీ జారీ చేసింది.

గుజరాత్ మోడల్‌ను అనుసరించాలని సలహా
ET రిపోర్ట్‌ ప్రకారం, ఇంటి పెట్టుబడిదార్ల కోసం ఒక రికవరీ మెకానిజాన్ని రూపొందించాలని అన్ని రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాల రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీలను గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ (Ministry of Housing) కోరింది. కొత్త నిబంధనల రూపకల్పనలో గుజరాత్ రెరాను ఒక ఉదారహణగా చూపింది. గుజరాత్‌ రెరా తరహాలో రికవరీ యంత్రాంగాన్ని తీసుకురావాలని అన్ని రెరాలకు సూచించింది. రికవరీ అధికారిని నియమించాలని కూడా రెరాలకు చెప్పింది.

ఈ అడ్వైజరీని జారీ చేయడానికి ముందు... కొత్త రికవరీ యంత్రాంగం విషయంలో తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, హరియాణా, కర్ణాటక రాష్ట్రాల రెరాల నుంచి కేంద్ర మంత్రిత్వ శాఖ సలహాలు, సూచనలు ఆహ్వానించింది. రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్ అండ్ డెవలప్‌మెంట్) చట్టం కింద జారీ చేసిన రికవరీ ఆర్డర్‌లను ప్రభావవంతంగా & సకాలంలో అమలు చేసేలా మార్గాలు సూచించాలని ఆ ఆరు రెరాలను కోరింది. వెంటనే స్పందించిన తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర రెరాలు సలహాలు, సూచనలు పంపాయి. 

సకాలంలో వాపసు అందుతుందనే ఆశ
తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర రెరాలు పంపిన సలహాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత, కేంద్ర మంత్రిత్వ శాఖ అన్ని రెరాలకు అడ్వైజరీని జారీ చేసింది. అన్ని రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాలు గుజరాత్ రెరా నమూనాను అనుసరించాలని ఆ అడ్వైజరీలో కోరింది. ఇటీవల, కేంద్ర సలహా మండలి ఆధ్వర్యంలో ఏర్పాటైన సబ్ కమిటీ రెండో సమావేశం జరిగింది. గుజరాత్ మోడల్‌ను అనుసరించడం గురించి మంత్రిత్వ శాఖ ఆ సమావేశంలో మాట్లాడింది. 

ఒకవేళ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్‌ మోసం చేసినా/ డిఫాల్ట్‌ అయినా..  గుజరాత్ మోడల్‌ రికవరీ మెకానిజం వల్ల గృహ కొనుగోలుదార్లకు సకాలంలో వాపసు (Refund) అందుతుందని భావిస్తున్నారు.

ఇళ్ల కొనుగోలుదార్ల ఆందోళన ఇది
ఇప్పటి వరకు, రెరా ఆర్డర్ తర్వాత కూడా గృహ కొనుగోలుదార్లకు సకాలంలో డబ్బు అందడం లేదు. డెవలపర్లు ఆ డబ్బును తిరిగి చెల్లించడం లేదని మంత్రిత్వ శాఖకు చాలా ఫిర్యాదులు అందాయి. డెవలపర్లను గట్టిగా ఢీ కొట్టలేక దేశవ్యాప్తంగా ఇంటి కొనుగోలుదార్లు ఇబ్బందులు పడుతున్నారు. రికవరీ ఆర్డర్‌ తర్వాత కూడా డిఫాల్ట్ డెవలపర్‌ నుంచి రిఫండ్‌ పొందడంలో జాప్యం జరుగుతోందని మినిస్ట్రీ దృష్టికి వచ్చింది. ఈ సమస్య నుంచి తప్పించేందుకు గుజరాత్ మోడల్‌ రికవరీ మెకానిజం రూపొందించాలని అన్ని రెరాలను కేంద్ర గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ సలహా ఇచ్చింది.

మరో ఆసక్తికర కథనం: తక్కువ EMI ఆశలు ఆవిరి, ఆర్‌బీఐ దాస్‌ ప్రసంగంలో కీలకాంశాలు ఇవే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget