GSTN: 'జీఎస్టీ' నెట్‌వర్క్ ఇక మనీలాండరింగ్ నిరోధక చట్టం పరిధిలోకి! దర్యాప్తు సంస్థలకు ప్రయోజనం
GSTN under PMLA: జీఎస్టీ నెట్‌వర్క్‌ను ఇక నుంచి మనీలాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ) పరిధిలోకి తీసుకొస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
GSTN under PMLA: ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీఎస్‌టీ నెట్‌వర్క్‌ను (జీఎస్‌టీఎన్) మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) పరిధిలోకి తీసుకువచ్చింది. ఈ మేరకు కేంద్రం తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఇక నుంచి జీఎస్‌టీ విషయంలో అవకతవకలపై, ఉల్లంఘనలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరింత నేరుగా పీఎంఎల్‌ఏ పరిధిలో చర్యలు తీసుకునేందుకు వీలు కలుగుతుంది. తప్పుడు మార్గాలలో జీఎస్‌టీ రాయితీలు పొందడం, నకిలీ ఇన్వాయిస్ వంటి జీఎస్‌టీ నేరాలను ఇక పీఎంఎల్‌ఏ పరిధిలో విచారించేందుకు అవకాశం ఉంటుంది.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థలు.. ఏ సంస్థ అయినా జీఎస్‌టీ నెట్‌వర్క్ పరిధిని మించి వ్యవహరించినట్లయితే మనీలాండరింగ్ చట్టం పరిధిలో వ్యవహరించేందుకు, వారిని శిక్షించేందుకు, విచారణ జరిపేందుకు అవకాశాలను మరింత సులభతరం చేసింది. ఈడీ ఇప్పుడు పలు కేసులకు సంబంధించి చేపట్టిన ఆర్థిక అక్రమాలపై విచారణల సంబంధిత వ్యవహారాలలో తమ వద్ద ఉన్న సమాచారాన్ని జీఎస్‌టీ అధికారిక మండలితో పంచుకోవచ్చు. ఇదే దశలో జీఎస్‌టీ నెట్‌వర్క్ నుంచి ఈడీ కోరిన విషయాలు పీఎంఎల్‌ఏ పరిధిలో అందించడానికి వీలు కలుగుతుంది.
మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు తేలితే ఆ వ్యక్తికి కనిష్టంగా 3 ఏళ్ల నుంచి గరిష్టంగా ఏడేళ్ల వరకు జైలుశిక్ష విధించవచ్చునని చట్టం చెబుతోంది. నార్కోటిక్ డ్రగ్స్ క్రైమ్ కింద ఏదైనా నేరం చేసినట్లు రుజువైతే సంబంధించిన ఆదాయం, సైకోట్రోపిక్ సబ్‌స్టాన్స్ యాక్ట్, 1985 ప్రకారం గరిష్ట శిక్షకాల వ్యవధిని 7 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలకు పొడిగించవచ్చు.
CAకి డబ్బులు ఇవ్వొద్దు, మీ ITR మీరే ఫైల్ చేయొచ్చు!
2023-24 అసెస్‌మెంట్ ఇయర్/2022-23 ఫైనాన్షియల్ ఇయర్ కోసం ఆదాయ పన్ను పత్రాలు దాఖలు చేయడానికి గడువు సమీపిస్తోంది. టాక్స్ పేయర్లకు ఈ నెలాఖరు వరకే సమయం ఉంది. ఈ నెలలో ఇప్పటికే ఒక వారం గడిచిపోయింది. ఇక మిగిలింది కేవలం 3 వారాలు మాత్రమే. అంతేకాదు, ఫైలింగ్ లాస్ట్ డేట్‌ను ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ ఎక్స్‌టెండ్ చేస్తుందన్న భావన కూడా ప్రజల్లో ఉంది. గత ఏడాది ఆదాయ పన్ను పత్రాల దాఖలుకు గడువును పొడిగించలేదని గుర్తు పెట్టుకోండి. ఈ ఏడాది కూడా అదనపు సమయం ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ నింపడం క్లిష్టమైన పని కాదు. ఈ ప్రాసెస్ ఈజీగా ఉండేలా ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు మార్పులు చేస్తోంది. ఫామ్ 16, ఫారం 26S, AIS, TIS వంటి డాక్యుమెంట్లు ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ ఫైలింగ్‌ను సులభమైన పనిగా మార్చాయి. కొన్ని ఈజీ స్టెప్స్‌తో ఇంట్లో కూర్చొని మీ ITRని మీరే ఫైల్ చేయవచ్చు. ఇందుకోసం ఏ చార్టెర్డ్ అకౌంటెంట్ (CA) ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన పని లేదు, వెయ్యి రూపాయలు కట్టాల్సిన అవసరం లేదు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి..
పాన్ కార్డ్ పని చేయకపోతే డబ్బుకు సంబంధించిన ఇన్ని పనులు చేయలేమా?
పాన్-ఆధార్ లింక్ చేసే గడువు గత నెలతో ముగిసింది. ఆ గడువులోగా వీటిని లింక్ చేయనివాళ్ల పాన్ కార్డ్ ఇన్-యాక్టివ్‌గా మారింది. యాక్టివ్‌గా లేని పాన్ కార్డ్‌తో, డబ్బులకు సంబంధించి కొన్ని పనులు చేయడం సాధ్యం కాదు. కొన్ని ఆంక్షలు, అదనపు పన్నులు భరించాల్సి వస్తుంది. మీ పాన్-ఆధార్ లింక్ చేయకపోతే, కో-ఆపరేటివ్ బ్యాంక్ నుంచి ప్రైవేట్ బ్యాంక్ వరకు ఏ బ్యాంక్‌లోనూ అకౌంట్ ఓపెన్ చేయలేరు. PAN యాక్టివ్‌గా లేని సమయంలో చేసే కొన్ని లావాదేవీలకు సాధారణం కంటే ఎక్కువ టాక్స్ పే చేయాల్సి వస్తుంది
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
Join Us on Telegram: https://t.me/abpdesamofficial