By: ABP Desam | Updated at : 07 Jul 2023 03:00 PM (IST)
పాన్ కార్డ్ పని చేయకపోతే డబ్బుకు సంబంధించిన ఇన్ని పనులు చేయలేమా?
PAN-Aadhaar Not Link Effects: పాన్-ఆధార్ లింక్ చేసే గడువు గత నెలతో ముగిసింది. ఆ గడువులోగా వీటిని లింక్ చేయనివాళ్ల పాన్ కార్డ్ ఇన్-యాక్టివ్‌గా మారింది. యాక్టివ్‌గా లేని పాన్ కార్డ్‌తో, డబ్బులకు సంబంధించి కొన్ని పనులు చేయడం సాధ్యం కాదు. కొన్ని ఆంక్షలు, అదనపు పన్నులు భరించాల్సి వస్తుంది.
పాన్ కార్డ్ ఇన్-యాక్టివ్ అయితే ఈ 15 ఆర్థిక లావాదేవీలు చేయలేరు:
1. మీ పాన్-ఆధార్ లింక్ చేయకపోతే, కో-ఆపరేటివ్ బ్యాంక్ నుంచి ప్రైవేట్ బ్యాంక్ వరకు ఏ బ్యాంక్‌లోనూ అకౌంట్ ఓపెన్ చేయలేరు
2. క్రెడిట్ కార్డ్ & డెబిట్ కార్డ్ కోసం అప్లై చేయలేరు
3. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టేందుకు డీమ్యాట్ అకౌంట్ ప్రారంభించలేరు
4. ఏం ప్రొడక్ట్/సర్వీస్ కొన్నా ఒకేసారి రూ. 50 వేలకు మించి చెల్లించలేరు
5. మ్యూచువల్ ఫండ్స్‌లో ఒకేసారి 50 వేల రూపాయల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టలేరు
6. బాండ్స్, డిబెంచర్స్ కొనాలన్నా కూడా ఒకేసారి 50 వేల కంటే ఎక్కువ చెల్లించలేరు
7. మీ బ్యాంక్ అకౌంట్‌లో, ఒక రోజులో, రూ. 50 వేలకు మించి డిపాజిట్ చేయలేరు
8. 50 వేల రూపాయల కంటే ఎక్కువ మొత్తానికి బ్యాంక్ డ్రాఫ్ట్, పే ఆర్డర్, చెక్ తీసుకోవడం సాధ్యం కాదు
9. ఏ బ్యాంకులోనైనా FD లేదా మరేదైనా స్కీమ్‌లో సంవత్సరానికి రూ. 5 లక్షల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టడం సాధ్యం కాదు
10. జీవిత బీమా కంపెనీకి ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రీమియం రూపంలో రూ. 50,000 కంటే ఎక్కువ చెల్లించలేరు
11. రూ. 1 లక్ష కంటే ఎక్కువ విలువైన సెక్యూరిటీ (షేర్స్ మినహా) ట్రాన్జాక్షన్స్ చేయలేరు
12. అన్ లిస్టెడ్ కంపెనీల్లో రూ. 1 లక్ష కంటే ఎక్కువ విలువైన షేర్లు కొనడం సాధ్యపడదు
PAN యాక్టివ్‌గా లేని సమయంలో చేసే కొన్ని లావాదేవీలకు సాధారణం కంటే ఎక్కువ టాక్స్ పే చేయాల్సి వస్తుంది
టూ వీలర్ మినహా ఏ వెహికల్ కొన్నా ఎక్కువ టాక్స్ కట్టాలి
రూ. 10 లక్షలకు మించిన స్థిరాస్తి అమ్మకం/కొనుగోలు చేసినా ఎక్కువ పన్ను పడుతుంది
రూ. 2 లక్షల కంటే ఎక్కువ విలువైన ప్రొడక్ట్స్/సర్వీస్ కొనడానికి అధిక పన్నును భరించాలి
టాక్స్ పేయర్స్ విషయంలో..
పాన్-ఆధార్ లింక్ కాకపోతే, టాక్స్ పేయర్‌కు రిఫండ్ రాదు
పాన్ పని చేయని కాలానికి రిఫండ్‌పై వడ్డీ చెల్లించరు
పాన్-ఆధార్ లింక్ కాని పన్ను చెల్లింపుదార్ల నుంచి ఎక్కువ TDS & TCS వసూలు చేస్తారు
ఫైన్ కట్టి పాన్-ఆధార్‌ను లింక్ చేయడానికి ఇప్పటికీ అవకాశం ఉంది. ఫైన్ కట్టిన తర్వాత 30 రోజుల్లో పాన్ మళ్లీ యాక్టివ్ మోడ్‌లోకి మారుతుంది.
ఆధార్-పాన్‌ను ఎలా లింక్ చేయాలి?
ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్ https://incometaxindiaefiling.gov.in/ను ఓపెన్ చేయండి.
ఈ వెబ్‌సైట్‌లో (ఇప్పటికీ చేయకపోతే) రిజిస్టర్ చేయసుకోండి.
మీ పాన్ (పర్మినెంట్ అకౌంట్ నంబర్) మీ యూజర్ ID అవుతుంది.
యూజర్ ID, పాస్‌వర్డ్, పుట్టిన తేదీని నమోదు చేసి లాగిన్ అవ్వండి.
ఇప్పుడు, మీ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడానికి పాప్-అప్ విండో ఓపెన్ అవుతుంది.
పాప్ అప్ విండో తెరుచుకోకపోతే, మెనూ బార్‌లోని 'ప్రొఫైల్ సెట్టింగ్స్'లోకి వెళ్లి 'లింక్ ఆధార్'పై క్లిక్ చేయండి.
పాన్ కార్డ్‌లో ఉన్న ప్రకారం మీ పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలు అక్కడ కనిపిస్తాయి.
మీ ఆధార్, పాన్ కార్డ్ వివరాలను సరిచూసుకోండి.
వివరాలు సరిపోలితే, మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేసి, "లింక్ నౌ" బటన్‌పై క్లిక్ చేయండి.
మీ ఆధార్ మీ పాన్‌తో విజయవంతంగా లింక్ అయిందన్న పాప్-అప్ మెసేజ్ మీకు తెలియజేస్తుంది.
మరో ఆసక్తికర కథనం: CAకి డబ్బులు ఇవ్వొద్దు, మీ ITR మీరే ఫైల్ చేయొచ్చు
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Retirement Corpus: రూ.50 కోట్లకు అధిపతిగా రిటైర్ అవ్వండి - మీకు ఎవరూ చెప్పని ఆర్థిక సూత్రం ఇది!
HDFC Bank: మీరు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో లోన్ తీసుకున్నారా?, మీ EMI తగ్గింది చూసుకున్నారా?
Gold-Silver Prices Today 08 Jan: స్వల్పంగా పెరిగిన గోల్డ్, రూ.లక్ష నుంచి తగ్గని సిల్వర్ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
Gold-Silver Prices Today 07 Jan: గోల్డ్ కొనేవాళ్లకు ఊరట, రూ.లక్షకు చేరిన సిల్వర్ - ఈ రోజు మీ ప్రాంతంలో బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
PVC Aadhaar Card: క్రెడిట్ కార్డ్‌లా మెరిసే PVC ఆధార్ కార్డ్ - ఇంట్లో కూర్చునే ఆర్డర్ చేయొచ్చు
Tirumala Stampede: తిరుమల తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- టీటీడీ ఈవోతో అత్యవసర భేటీ
Game Changer: తెలంగాణలో 'గేమ్ చేంజర్' బెనిఫిట్ షోలు లేవు, కానీ టికెట్ రేట్లు పెరిగాయ్... ఎంతో తెలుసా?
Telangana News: తెలంగాణలో బీర్ల పంచాయితీ- సప్లై నిలిపేసిన సంస్థ- రూ. 250 చేయాలా అని ప్రశ్నించిన మంత్రి జూపల్లి
Vizag Modi Speech : చంద్రబాబు లక్ష్యాలకు ఎప్పుడూ అండగా ఉంటాం - విశాఖ సభలో మోదీ భరోసా