(Source: ECI/ABP News/ABP Majha)
Gold-Silver Price: గుడ్ న్యూస్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. దిగొచ్చిన వెండి.. లేటెస్ట్ రేట్లు ఇలా..
భారత మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా దిగిరాగా.. వెండి ధర సైతం తగ్గింది. మొత్తానికి గత 10 రోజుల ధరలతో పోలిస్తే ధరలు భారీగానే పెరగడంతో బులియన్ మార్కెట్‌లో జోష్ కనిపిస్తోంది.
భారత్‌లో బంగారం ధర వరుసగా మూడు రోజులు పెరిగిన బంగారం ధర నేడు (ఆగస్టు 31) దిగొచ్చింది. గ్రాముకు అతి స్వల్పంగా రూ.12 చొప్పున తగ్గింది. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, నేడు భారత మార్కెట్‌లో రూ.46,600గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,800 కి పతనమైంది. మొత్తానికి గత 10 రోజుల ధరలతో పోలిస్తే భారీగానే పెరగడంతో బులియన్ మార్కెట్‌లో జోష్ కనిపిస్తోంది.
భారత మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా దిగిరాగా.. వెండి ధర సైతం తగ్గింది. హైదరాబాద్ మార్కెట్‌లోనూ వెండి ధర దిగొచ్చింది. తాజాగా భారత మార్కెట్‌లో రూ.200 మేర దిగిరావడంతో కిలో వెండి ధర రూ.63,600కి క్షీణించింది. హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర కాస్త ఎక్కువగా రూ.68,400 ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ముఖ్య నగరాల్లో ఆగస్టు 31న బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
Also Read: September Month Bank Holidays: సెప్టెంబర్ నెలలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు... ఏఏ తేదీల్లో అంటే!
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి తాజా ధరలివీ..
హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర గ్రాముకు రూ.12 చొప్పున తగ్గింది. దాంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం (99.99) ధర ప్రస్తుతం రూ.48,490 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం (91.6) ధర రూ.44,450కి పతనమైంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర రూ.300 మేర తగ్గడంతో హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.68,700 పలికింది.
ఇక విజయవాడలో 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ఆగస్టు 30న గ్రాముకు రూ.1 పెరిగి రూ.44,560 కాగా.. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.48,610గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.68,700గా ఉంది. విశాఖపట్నం పసిడి మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,560 గానే ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,610గా ఉంది. ఇక్కడ కూడా వెండి ధర కిలో హైదరాబాద్ తరహాలోనే రూ.68,400 వద్ద విక్రయాలు ప్రారంభమవుతాయి.
Also Read: Indian Motorcycle Chief: ఇండియన్ 'చీఫ్' బైక్‌లు వచ్చేశాయి.. ఫీచర్లు అదుర్స్..
దేశంలోని పలు నగరాల్లో పసిడి ధర ఇలా..
దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఆగస్టు 31న ఇలా ఉన్నాయి. ముంబయిలో నేడు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.46,500 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,500కి పతనమైంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,880 కి దిగిరాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,960కి పతనమైంది.
నిలకడగా ప్లాటినం ధర
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం గత రెండు రోజులుగా నిలకడగా మార్కెట్ అవుతోంది. హైదరాబాద్‌లో గ్రాము ప్లాటినమ్ ధర రూ.2,377గా ఉంది. 10 గ్రాముల ప్లాటినం ధర హైదరాబాద్‌లో రూ.23,770 గా ఉండగా.. విశాఖపట్నం, విజయవాడలో సైతం 10 గ్రాముల ప్లాటినం అదే ధరల వద్ద కొనసాగుతోంది.
Also Read: First Salary: ఫస్ట్ శాలరీ తీసుకుంటున్నారా? మరి ప్లాన్ ఏంటి?