Gold-Silver Price: స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు.. కాస్త తగ్గిన వెండి రేట్లు.. తెలుగు రాష్ట్రాల్లో ధరలివే..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు కొన్ని ప్రాంతాల్లో తగ్గగా.. మరికొన్ని చోట్ల స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్, వైజాగ్, విజయవాడ వంటి నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు..
భారతదేశంలో నిన్న కాస్త తగ్గిన పసిడి ధరలు.. ఇవాళ (సెప్టెంబర్ 19) స్థిరంగా కొనసాగుతున్నాయి. భారత మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.46,390గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.45,390గా నమోదైంది. దేశవ్యాప్తంగా ఉదయం 6 గంటల వరకు ఉన్న ధరలివి.
భారత మార్కెట్‌లో వెండి ధరలు నిన్నటితో పోలిస్తే కాస్త తగ్గాయి. దేశీయ మార్కెట్‌లో వెండి ధర కేజీ రూ.60,000గా ఉంది. నిన్న ఈ ధర రూ.61,600గా నమోదైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని హైదరాబాద్, వైజాగ్, విజయవాడ వంటి ముఖ్య నగరాల్లో సెప్టెంబరు 19న నమోదైన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి తాజా ధరలు..
హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు రూ.47,350గా ఉంది. 22 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే.. 10 గ్రాముల ధర రూ.43,400గా నమోదైంది. హైదరాబాద్ మార్కెట్‌లో వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. ఇక్కడ కేజీ వెండి ధర రూ.65,900 పలికింది.
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధరలు 10 గ్రాములకు రూ.43,400గా ఉన్నాయి. స్వచ్ఛమైన బంగారం విషయానికి వస్తే (24 క్యారెట్లు).. 10 గ్రాముల ధర రూ.47,350గా ఉంది. విజయవాడలో వెండి ధరలు గత రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. విజయవాడలో కేజీ వెండి ధర రూ.64,200గా నమోదైంది. నిన్నటితో పోలిస్తే కేజీ వెండి ధరకు రూ.1700 వరకు తగ్గింది.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.4,340గా ఉంది. 10 గ్రాముల ధర రూ.43,400గా నమోదైంది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.47,350గా ఉంది. విశాఖ పట్నంలో కూడా నిన్నటితో పోలిస్తే ఇవాళ వెండి ధరలు కాస్త తగ్గాయి. విశాఖలో కేజీ వెండి ధర రూ.64,200గా నమోదైంది. నిన్న కేజీ వెండి ధర రూ.65,900గా ఉంది.
దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర ఇలా..
దేశంలోని పలు ప్రధాన నగరాలలో బంగారం ధరలు ((10 గ్రాములకు) సెప్టెంబరు 19న ఇలా ఉన్నాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,550గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,690గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,710 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,690గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,390గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.46,390గా ఉంది.
వివిధ అంశాలపై పసిడి ధర..
పసడి ధరల్లో ప్రతి రోజూ మార్పు చేసుకుంటుండటం అనేది ప్రపంచవ్యాప్తంగా పలు అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరల పెంపు కూడా దీనికి ఒక కారణం. అయితే, ఇలా గ్లోబల్ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి పలు అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తాయి.
Also Read: Today Weather Update: రెయిన్ అలర్ట్.. నేడు, రేపు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు..