అన్వేషించండి

Gold-Silver Price 17 September 2022: పసిడి ధరలో భారీ పతనం, 7 నెలల తర్వాత ₹50,000 దిగువకు!

ఈ ఏడాది ఫిబ్రవరి 17న ₹50,000 కంటే దిగువన ఉన్న 24 క్యారెట్ల బంగారం ధర, ఏడు నెలల తర్వాత మళ్లీ ఇప్పుడు ₹50,000 మార్కు కంటే దిగి వచ్చింది.

Gold-Silver Price 17 September 2022: దేశంలో బంగారం ధర (Today's Gold Rate) నిన్నటితో (శుక్రవారం) పోలిస్తే నేడు (శనివారం) కూడా తగ్గింది. 10 గ్రాముల ఆర్నమెంట్‌ బంగారం ₹ 400, స్వచ్ఛమైన పసిడి ₹ 440 తగ్గింది. కిలో వెండి ధర ₹ 600 తగ్గింది.

చివరిసారిగా, ఈ ఏడాది ఫిబ్రవరి 17న ₹50,000 కంటే దిగువన ఉన్న 24 క్యారెట్ల బంగారం ధర, ఏడు నెలల తర్వాత మళ్లీ ఇప్పుడు ₹50,000 మార్కు కంటే దిగి వచ్చింది. 

తెలంగాణలో బంగారం ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్‌ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల (తులం) 22 క్యారెట్ల బంగారం ధర ఇవాళ ₹ 45,800 కి చేరింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ₹ 49,960 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు ₹ 61,600 కు చేరింది. తెలంగాణవ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో బంగారం ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో ‍(Gold Rate in Vijayawada) 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు ₹ 45,800 కి చేరింది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ₹ 49,960 గా నమోదైంది. ఇక్కడ కిలో వెండి ధర ₹ 61,600 కు చేరింది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో.. 10 గ్రాముల 22 క్యారెట్లు, 24 క్యారెట్లు, కిలో వెండికి విజయవాడ మార్కెట్‌ రేటే అమలవుతోంది. 

దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities) 
చెన్నైలో (Gold Rate in Chennai) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ ₹ 46,260 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 50,460 కి చేరింది.
ముంబయిలో (Gold Rate in Mumbai) 22 క్యారెట్ల బంగారం ధర ₹ 45,800 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 49,960 కి చేరింది.
దిల్లీలో (Gold Rate in Delhi) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 45,950 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 50,120 గా నమోదైంది.
బెంగళూరులో (Gold Rate in Bangalore) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 45,850 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 50,020 గా ఉంది. 
మైసూరులో (Gold Rate in Mysore) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 45,850 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 50,020 గా ఉంది. 
పుణెలో (Gold Rate in Pune) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 45,830 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 49,980 గా ఉంది. 

ప్లాటినం ధర (Today's Platinum Rate)
సంపన్నులు బాగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం 'ప్లాటినం' ధర నిన్నటితో పోలిస్తే నేడు తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 10 గ్రాములకు ₹ 130 తగ్గి ₹ 23,130 కి చేరింది. విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉన్నాయి.

ధరల్లో మార్పులు ఎందుకు?
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే అనేక పరిణామాల మీద ఈ మార్పులు ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరగడం లేదా తగ్గడం వల్ల మన దేశంలో ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి, తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావం అనేక రంగాలపై పడింది. ఆ ప్రభావం వల్లే ఇటీవలి నెలల్లో ధరల్లో విపరీత మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంకా.. ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జ్యువెలరీ మార్కెట్లలో వినియోగదారుల నుంచి వస్తున్న డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు ధరలను ప్రభావితం చేస్తాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024: బెంగళూరు గెలిచిందోచ్‌, ఛేదనలో తేలిపోయిన హైదరాబాద్‌
బెంగళూరు గెలిచిందోచ్‌, ఛేదనలో తేలిపోయిన హైదరాబాద్‌
KCR: ఇది దద్దమ్మ ప్రభుత్వం కాకుంటే ఏందన్నట్టు? నా బిడ్డను తీసుకపోయి అరెస్ట్ చేసిన్రు - కేసీఆర్
ఇది దద్దమ్మ ప్రభుత్వం కాకుంటే ఏందన్నట్టు? నా బిడ్డను తీసుకపోయి అరెస్ట్ చేసిన్రు - కేసీఆర్
Sunitha Reddy: జగన్ తలకు బ్యాండేజ్ తీస్తే పుండు తగ్గుతుంది - సునీత; ‘అవినాష్ పిల్లోడు’ కామెంట్లపై కౌంటర్
జగన్ తలకు బ్యాండేజ్ తీస్తే పుండు తగ్గుతుంది - సునీత; ‘అవినాష్ పిల్లోడు’ కామెంట్లపై కౌంటర్
IPL 2024:హైదరాబాద్‌ లక్ష్యం 207, బెంగళూరు ఆపగలదా?
హైదరాబాద్‌ లక్ష్యం 207, బెంగళూరు ఆపగలదా?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Sunrisers Hyderabad vs Royal Challengers Bengaluru | ఆర్సీబీ బౌలర్ల తడా ఖా.. వణికిపోయిన SRH | ABPYS Sharmila on YS Jagan | పసుపు కలర్ చంద్రబాబు పేటేంటా..?నీ సాక్షి పేపర్ లో ఉన్న పసుపు మాటేంటీ |Pawan Kalyan on YS Jagan | కోస్తా మొత్తం కూటమి క్లీన్ స్వీప్ అంటున్న పవన్ | ABP DesamGoogle Golden Baba | రోజుకు 4 కేజీల బంగారు నగలు వేసుకుంటున్న గూగుల్ గోల్డెన్ బాబా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024: బెంగళూరు గెలిచిందోచ్‌, ఛేదనలో తేలిపోయిన హైదరాబాద్‌
బెంగళూరు గెలిచిందోచ్‌, ఛేదనలో తేలిపోయిన హైదరాబాద్‌
KCR: ఇది దద్దమ్మ ప్రభుత్వం కాకుంటే ఏందన్నట్టు? నా బిడ్డను తీసుకపోయి అరెస్ట్ చేసిన్రు - కేసీఆర్
ఇది దద్దమ్మ ప్రభుత్వం కాకుంటే ఏందన్నట్టు? నా బిడ్డను తీసుకపోయి అరెస్ట్ చేసిన్రు - కేసీఆర్
Sunitha Reddy: జగన్ తలకు బ్యాండేజ్ తీస్తే పుండు తగ్గుతుంది - సునీత; ‘అవినాష్ పిల్లోడు’ కామెంట్లపై కౌంటర్
జగన్ తలకు బ్యాండేజ్ తీస్తే పుండు తగ్గుతుంది - సునీత; ‘అవినాష్ పిల్లోడు’ కామెంట్లపై కౌంటర్
IPL 2024:హైదరాబాద్‌ లక్ష్యం 207, బెంగళూరు ఆపగలదా?
హైదరాబాద్‌ లక్ష్యం 207, బెంగళూరు ఆపగలదా?
AP Weather: ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
IPL 2024: బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
Telangana Graduate MLC :  తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
Sajjala Ramakrishna: ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
Embed widget