Gold-Silver Price: గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన పసిడి ధర.. స్వల్పంగా దిగొచ్చిన వెండి, నేటి ధరలివే..
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల మేలిమి బంగారం (99.99 స్వచ్ఛత) ధర ప్రస్తుతం గ్రాముకు రూ.60 తగ్గి.. రూ.48,220 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం (91.6 స్వచ్ఛత) ధర రూ.44,200 గా ఉంది.
భారత్‌లో నేడు బంగారం ధర స్థిరంగా ఉండగా.. హైదరాబాద్ మార్కెట్‌లో భారీగా తగ్గింది. హైదరాబాద్‌లో గ్రాముకు రూ.60 వరకూ తగ్గింది. వెండి ధరలు కూడా ఇతర మార్కెట్లలో నిలకడగా ఉండగా హైదరాబాద్‌లో మాత్రం గ్రాముకు రూ.0.30 పైసల స్వల్ప తగ్గుదల కనిపించింది.
ఆంధ్రా, తెలంగాణలో పసిడి, వెండి తాజా ధరలివీ..
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల మేలిమి బంగారం (99.99 స్వచ్ఛత) ధర ప్రస్తుతం గ్రాముకు రూ.60 తగ్గి.. రూ.48,220 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం (91.6 స్వచ్ఛత) ధర రూ.44,200 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.67,400గా పలికింది.
ఇక విజయవాడలో 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.44,200 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.48,220గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.67,400గా ఉంది. ఇక విశాఖపట్నం పసిడి మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,200 గానే ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,220గా ఉంది. ఇక్కడ వెండి ధర కిలో రూ.67,400 గానే కొనసాగుతోంది.
Also Read: 4 రోజుల్లో రూ.1331 కోట్లు లాభం.. ఆ రెండు టాటా కంపెనీలతో పెరిగిన ఝున్‌ఝున్‌వాలా సంపద
దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర ఇలా..
దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు నేడు ఇలా ఉన్నాయి. ముంబయిలో ఈరోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.47,070ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,070గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,650 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,710గా ఉంది.
Also Read: Amazon Festival Sale: ఒక్క రూపాయికే గ్రాసరీస్.. 200 క్యాష్ బ్యాక్.. అమెజాన్ ప్యాంట్రీలో ఆఫర్లు
ప్లాటినం ధరలో పెరుగుదల
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర మాత్రం నేడు పెరిగింది. కొద్ది రోజులుగా ప్లాటినం ధరలో పెరుగుదల కనిపిస్తోంది. గ్రాముకు రూ.56 వరకూ పెరిగింది. దీంతో తాజా ధర.. రూ.2,537గా ఉంది. హైదరాబాద్‌లో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.25,370 గా ఉండగా.. విశాఖపట్నం, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం ధర యథాతథంగా ఉంది.
Also Read: క్రిప్టోకరెన్సీని నమ్ముకున్నారా? అయితే మీ పని ఇక అంతే! మీకు అర్థమవుతుందా?
అనేక అంశాలపై బంగారం, వెండి ధరలు
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.
Also Read: టీఆర్ఎస్‌లో చేరనున్న మోత్కుపల్లి నర్సింహులు.. సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం!