By: ABP Desam | Updated at : 10 Sep 2021 06:51 AM (IST)
Edited By: Satyaprasad Bandaru
బంగారం, వెండి ధరలు(ప్రతీకాత్మక చిత్రం)
భారత్‌లో బంగారం, వెండి ధరలు ఈ రోజు (సెప్టెంబరు 10) భారీగా తగ్గాయి. వెండి ధర కేజీకి రూ.900 తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ భారత మార్కెట్‌లో రూ.46,000 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర తాజాగా రూ.47,000 గా ఉంది. దేశవ్యాప్తంగా ఉదయం ఆరు గంటలకు ఉన్న ధరలివి.
భారత మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. తాజాగా భారత మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.63,900గా కొనసాగుతోంది. హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.68,300గా ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ముఖ్య నగరాల్లో సెప్టెంబరు 10న బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి తాజా ధరలివీ
హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం (99.99) ధర ప్రస్తుతం రూ.48,000 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం (91.6) ధర రూ.44,000 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.68,300 పలికింది.
ఇక విజయవాడలో 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర సెప్టెంబరు 10న రూ.44,000 కాగా.. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.48,000గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.68,300గా ఉంది. విశాఖపట్నం పసిడి మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,000 గానే ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,000గా ఉంది. ఇక్కడ కూడా వెండి ధర కిలోకు హైదరాబాద్ తరహాలోనే రూ.68,300 పలుకుతోంది.
దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర ఇలా..
దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు సెప్టెంబరు 10న ఇలా ఉన్నాయి. ముంబయిలో ఈరోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.46,000గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,000గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,340 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,370గా ఉంది. దిల్లీలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.46,100గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,300గా ఉంది
ప్లాటినం ధరలో స్వల్ప తగ్గుదల
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర హైదరాబాద్‌లో గ్రాము రూ.2,361గా ఉంది. ముందు రోజు ధరలో రూ.12 తగ్గింది. 10 గ్రాముల ప్లాటినం ధర ఇక్కడ రూ.23,610 గా ఉండగా.. విశాఖపట్నం, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం ధర అదే కొనసాగుతోంది.
Also Read: Income Tax Returns Extension: ఐటీఆర్ దాఖలు గడువు పెంపు.. ఎప్పటివరకంటే?
వివిధ అంశాలపై పసిడి ధర
బంగారం ధరల్లో ప్రతిరోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఓ కారణం. అయితే, ఇలా గ్లోబల్ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తాయి.
Also Read: vinayaka Chavithi: ఈ అష్ట వినాయకులను దర్శిస్తే... విజయాలన్నీ మీవే
Santro Stopped: ఆ బడ్జెట్ కారును ఆపేసిన హ్యుండాయ్ - ఉత్పత్తి నిలిపివేసిన కంపెనీ!
28 Per Cent GST: ఆ సేవలపై 28% జీఎస్టీ! ఇక ఆ సేవలు ఖరీదే
Cryptocurrency Prices Today: నష్టాల్లో బిట్‌కాయిన్.. ఎంత నష్టపోయిందంటే?
Stock Market News: ఆరంభంలో అదుర్స్! ఎండింగ్లో ఒడుదొడుకులు - సెన్సెక్స్, నిఫ్టీ డౌన్!
Petrol Diesel Price 18th May 2022 : తెలుగు రాష్ట్రాలో స్వల్పంగా తగ్గిన పెట్రోల్, పెరిగిన డీజిల్ ధరలు, ఇవాళ్టి ఇంధన ధరలు ఇలా
Bojjala Brother Dies: మాజీ మంత్రి బొజ్జల కర్మక్రియల రోజే మరో విషాదం - ఆయన సోదరుడు కన్నుమూత
LSG vs KKR: తొలి వికెట్‌కు 210*! ఐపీఎల్ చరిత్రలో తొలిసారి 20 ఓవర్లు ఆడేసిన రాహుల్, డికాక్
IB Official Dies: శిల్పకళా వేదికలో విషాదం, ఉపరాష్ట్రపతి ఈవెంట్ స్టేజీ వేదికపై నుంచి పడి ఐబీ అధికారి మృతి
Liquor Price Telangana: మందుబాబులకు తెలంగాణ సర్కారు భారీ షాక్ - ఓ రేంజ్లో పెరిగిన బీర్లు, మద్యం ధరలు