(Source: ECI/ABP News/ABP Majha)
Gold-Silver Price: నిలకడగా పసిడి ధర, కాస్త పెరిగిన వెండి.. మీ ప్రాంతంలో ధరలివే..
తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర రూ.65,900గా ఉంది. ఢిల్లీ, కోలక్ కతా, బెంగళూరు, కేరళ, ముంబయిలో కిలో వెండి రూ.61,800, చెన్నైలో రూ.65,900గా ఉంది.
బంగారం ధర నిన్నటితో పోలిస్తే స్థిరంగా ఉంది. భారత్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,940 ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.46,940 గా ఉంది. అటు వెండి ధరలు మాత్రం కొన్ని నగరాల్లో స్వల్ప హెచ్చుతగ్గులు మినహా ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు
* హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,890
* విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,890
* విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,900, 24 క్యారెట్ల ధర రూ.47,890
* ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,240
* చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,130, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,140
* ముంబయిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,940, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,940
* కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,000
* బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,890
* కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,890
Also Read: టాటా చేతికి ఎయిర్ ఇండియా.. స్పైస్ జెట్‌తో పోటీ పడి దక్కించుకున్న టాటా సన్స్
వెండి ధరలు ఇవీ
తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర రూ.65,900గా ఉంది. ఢిల్లీ, కోలక్ కతా, బెంగళూరు, కేరళ, ముంబయిలో కిలో వెండి రూ.61,800, చెన్నైలో రూ.65,900గా ఉంది.
Also Read: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీరేటులో మార్పులు చేసిన రెండు బ్యాంకులు.. వివరాలు ఇవే!
అనేక అంశాలపై బంగారం, వెండి ధరలు
బంగారం, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.
Also Read: రూ.1,000 లోపే స్మార్ట్ వాచ్, ఫిట్‌నెస్ బ్యాండ్లు.. అమెజాన్ సేల్‌లో అదిరే ఆఫర్లు