Benefit Shows Cancelled In Telangana: ఫుష్ప 2 ఎఫెక్ట్- తెలంగాణలో బెనిఫిట్ షోలు రద్దు
Pushpa 2 Benefit Show Effects In Telangana: ఓ మృతి మృతి కారణమైన బెనిఫిట్ షోలు రద్దు చేస్తున్నట్టు తెలంగాాణ ప్రభుత్వం ప్రకటించింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని మంత్రి ప్రకటించారు.
Benefit Shows Cancelled In Telangana: హైదరాబాద్‌లోని ఓ థియేటర్‌లో పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. మరో బాలుడు చావుతో పోరాడుతున్నారు. దీంతో ప్రబుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఇకపై ఏసినిమాకి కూడా బెనిఫిట్‌షోలకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించింది. బెనిపిట్‌షోలు రద్దు చేస్తున్నట్టు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు.
తొక్కిసలాట కారణంగా ఓ మహిళ మృతి చెందింది. మరో ఏడేళ్ల బాలుడు కూడా ప్రాణాపాయ స్థితికి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఆ బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు సంధ్య థియేటర్‌పై కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్‌పై కూడా కేసు పెట్టారు.
Also Read: 'అల్లు అర్జున్ కళ్ల ముందే మహిళను చంపేశారు' - సంచలన విషయాలు బయటపెట్టిన ప్రత్యక్ష సాక్షి
భారీగా జనం వస్తారని తెలిసి కూడా థియేటర్ యాజమాన్యం సరైన చర్యలు తీసుకోలేదని ఆరోపణ ఉంది. అన్నింటినీ బేరేజు వేసుకున్న ప్రభుత్వం ఇకపై ఏ సినిమాకి కూడా బెనిఫిట్ షోలు వేసుకునేందుకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించింది. ఈ మేరకు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు.
ఆనందంతో సినిమా చూసేందుకు వచ్చిన ఫ్యామిలీ విషాదంతో ఇంటికి వెళ్లడం ఆందోళన కలిగించిందని అన్నారు కోమటి రెడ్డి. బెనిఫిట్‌షోలు కారణంగా శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని అందుకే ఇకపై ఏ సినిమాకు కూడా బెనిఫిట్ షోకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించినట్టు తెలిపారు.
Also Read: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై కేసు నమోదు
ఈ తొక్కిసలాటకు పోలీసులు, అల్లు అర్జున్, థియేటర్ యాజమాన్యమే కారమణని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ముందుగానే జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదన్నారు. ఇంత జనం ఉన్న టైంలో అల్లు అర్జున్ ఎలాంటి అనుమతి లేకుండా థియేటర్‌లోకి ఎలా పంపిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాలు వివరించి ఫిర్యాదు చేస్తే పోలీసులు కూడా పట్టించుకోలేదని అంటున్నారు.
ఈ తొక్కిసలాట సమయంలో అక్కడే ఉన్న విజయ్ అనే యువకుడు చేసిన కామెంట్స్ వైరల్‌గా మారుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆయన వాపోతున్నాడు. రాత్రి 9 గంటలకే భారీగా జనం వచ్చారని ఆ పరిసరాల్లో పూర్తిగా బ్లాక్ అయ్యాయని తెలిపారు. వాళ్లను కంట్రోల్ చేయడానికి పోలీసులు కానీ, ఇటు థియేటర్ సిబ్బంది కూడా లేరని వివరించారు.
పరిస్థితి అప్పటికే ఊపిరాడకుండా ఉందని అంతలోనే అల్ల అర్జున్ అక్కడకు రావడంతో సిఛ్యుయేషన్ పూర్తిగా కంట్రోల్ తప్పిందని విజయ్ వివరించారు. తర్వాత అక్కడకు వచ్చిన పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడం ప్రారంభించారని అన్నారు. క్రిమినల్స్‌ను కొట్టినట్టు కొట్టారని వివరించారు. వాటిని పట్టించుకోకుండా జనం మధ్య నుంచి వెళ్తున్న అల్లు అర్జున్ వాహనాన్ని అభిమానులు వెంబడించారన్నారు. ఇదే తొక్కిసలాటకు కారణమైందన్నారు. ముందే మేల్కొని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. సరైన భాద్రతా ఏర్పాట్లు చేయనందు వల్లే ఒకరి ప్రాణం పోయిందని మరో బాలుడు ప్రాణాపాయస్థితిలో ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.
ఓ వైపు థియేటర్ల వద్ద ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతుండటం... మరోవైపు బెనిఫిట్ షో రేట్ల విషయంలో వస్తున్న ఆరోపణలు కూడా ప్రభుత్వానికి చికాకు పెట్టిస్తన్నాయి. అందుకే ప్రభుత్వం బెనిఫిట్‌షోలకు అనుమతులు ఇవ్వకూడదని నిర్ణయానికి వచ్చింది.