అన్వేషించండి

Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై కేసు నమోదు

Hyderabad News: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పైనా కేసు నమోదైంది. థియేటర్ యాజమాన్యం, సెక్యూరిటీ మేనేజర్‌పైనా కేసు నమోదు చేసినట్లు సెంట్రల్ జోన్ డీసీపీ తెలిపారు.

Case Filed Against Icon Star Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు (Allu Arjun) పోలీసులు షాక్ ఇచ్చారు. పుష్ప 2 (Pushpa 2) ప్రీమియర్ షో నేపథ్యంలో బుధవారం రాత్రి సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఆయనపై కేసు నమోదు చేసినట్లు సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాంశ్ యాదవ్ తెలిపారు. థియేటర్ యాజమాన్యం, సెక్యూరిటీ మేనేజర్‌పైనా కేసు నమోదు చేసినట్లు చెప్పారు. సెక్షన్ 105, 118 BNS యాక్ట్ ప్రకారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ థియేటర్‌కు వస్తోన్న నేపథ్యంలో భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ వస్తున్నారన్న సమాచారాన్ని సరైన సమయంలో చెప్పకుండా బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించారని ఆయన టీంపై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్‌లో బుధవారం రాత్రి 9:40 గంటలకు పుష్ప - 2 ప్రీమియర్ షో నేపథ్యంలో అధిక సంఖ్యలో అభిమానులు హాజరయ్యారని డీసీపీ అక్షాంశ్ యాదవ్ తెలిపారు. అభిమానులతో పాటు కీలక నటులు థియేటర్‌కు వస్తారనే సమాచారం తమకు లేదని.. కనీసం థియేటర్ యాజమాన్యం కూడా తొలుత సమాచారం ఇవ్వలేదని చెప్పారు. దానికి తోడు ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని.. క్రౌడ్ అదుపు చేసేందుకు థియేటర్ ఎంట్రీ, ఎగ్జిట్‌లో ఎలాంటి ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేయలేదన్నారు. రాత్రి 9:40 గంటలకు వ్యక్తిగత భద్రతా సిబ్బందితో అల్లు అర్జున్ థియేటర్ వద్దకు రాగానే.. ఆయన్ను చూసేందుకు అభిమానులు ఒక్కసారిగా ఎగబడడంతో గందరగోళం నెలకొందని పేర్కొన్నారు. 

పోలీసులు అభిమానులను అదుపు చేసే క్రమంలో తోపులాట జరిగిందని.. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రేవతి కుటుంబం ఈ తొక్కిసలాటలో కింద పడిపోయారని డీసీపీ తెలిపారు. అధిక సంఖ్యలో అభిమానులు ఉండడంతో వారికి ఊపిరాడలేదని.. పోలీస్ సిబ్బంది వారిని గమనించి బయటకు లాగారని చెప్పారు. రేవతితో పాటు కుమారుడు 13 ఏళ్ల శ్రీతేజకు సీపీఆర్ చేసి దుర్గాబాయి దేశ్ ముఖ్ ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. అప్పటికే రేవతి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించి శ్రీతేజను మరో ఆస్పత్రికి తరలించాలని సూచించినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని.. పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

మైత్రీ మూవీ మేకర్స్ విచారం

ఈ ఘటనపై పుష్ప 2 చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని తెలిపింది. అటు, ఈ ఘటనలో అస్వస్థతకు గురైన బాలుడు శ్రీతేజ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తమ బిడ్డ అల్లు అర్జున్‌కు బిగ్ ఫ్యాన్ అని అతని కోరిక మేరకు ప్రీమియర్ షోకు వెళ్లామని బాలుని తండ్రి కన్నీటిపర్యంతమయ్యారు.

Also Read: Pushpa 2 Stampede: 'అల్లు అర్జున్ కళ్ల ముందే మహిళను చంపేశారు' - సంచలన విషయాలు బయటపెట్టిన ప్రత్యక్ష సాక్షి

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
TPCC Showcause Notice: టీ కాంగ్రెస్‌లో కల్లోలానికి ముగింపు ఉంటుందా? టీపీసీసీ క్రమశిక్షణా చర్యల్లో సీరియస్ నెస్ ఉందా?
టీ కాంగ్రెస్‌లో కల్లోలానికి ముగింపు ఉంటుందా? టీపీసీసీ క్రమశిక్షణా చర్యల్లో సీరియస్ నెస్ ఉందా?
Madhapur Road Accident: మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
Madhapur Road Accident: మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన! అర్థరాత్రి అడియాల నుంచి ఆసుపత్రికి తరలింపు!
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన! అర్థరాత్రి అడియాల నుంచి ఆసుపత్రికి తరలింపు!
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
Embed widget