Gold Rate Today 4th May 2022: పసిడి జోరుకు బ్రేక్, నేడు నిలకడగా బంగారం ధరలు, భారీగా తగ్గిన వెండి ధర - లేటెస్ట్ రేట్లు ఇవీ
Gold Rates Today In Hyderabad 4th May 2022: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. వెండి రూ.600 మేర దిగొచ్చింది. పలు నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
Gold Price Today 4th May 2022: నేడు బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. మరోవైపు పసిడికి భిన్నంగా వెండి ధర భారీగా దిగొచ్చింది. తాజాగా హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర (Gold Rates Today In Hyderabad 4th May 2022) రూ.51,510 గా ఉండగా.. 22 క్యారెట్ల పసిడి ధర రూ.47,200 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. మరోవైపు వెండి ధర రూ.600 మేర తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 1 కేజీ వెండి ధర రూ.67,000గా ఉంది.
ఏపీలో బంగారం ధర.. (Gold Rate Today In AP)
ఏపీ మార్కెట్లోనూ బంగారం ధరలు నిన్నటి ధరలతో ట్రేడ్ అవుతున్నాయి. విజయవాడలో 24 క్యారెట్ల బంగారం (Gold Rate in Vijayawada 4th May 2022 2022) 10 గ్రాముల ధర రూ.51,510 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,200 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. ఈ నెలలో రూ. 1500 మేర తగ్గడంతో విజయవాడలో స్వచ్ఛమైన వెండి 1 కేజీ ధర రూ.67,000 అయింది.
విశాఖపట్నం, తిరుపతిలో బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. నేడు 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,510 కాగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,200 అయింది.
ఇక విశాఖపట్నం, తిరుపతి మార్కెట్లో రూ.600 పెరగడంతో 1 కేజీ వెండి ధర రూ.67,200 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
ప్రధాన నగరాల్లో బంగారం ధర..
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,200 కాగా, 24 క్యారెట్ల బంగారం రూ.51,510 కి ఎగబాకింది.
చెన్నైలో బంగారంపై రూ.430 తగ్గడంతో క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,160 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,540 తో దేశంలోనే రికార్డ్ ధరలో విక్రయాలు జరుగుతున్నాయి.
ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,200 కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.51,510గా ఉంది.
ప్లాటినం ధర
హైదరాబాద్‌లో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.22,880కి పతనమైంది.
ఢిల్లీలో 21 రూపాయలు తగ్గి, 10 గ్రాముల ధర రూ.22,800 అయింది.
చెన్నైలో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.22,880 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
ముంబైలో రూ.21 తగ్గడంతో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.22,800 అయింది.
పసిడి, వెండి ధరలపై పలు అంశాలు ప్రభావం..
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.