Horoscope Today 4th May 2022: ఈ రాశులవారికి డబ్బు, గౌరవం, హోదా లభిస్తుంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Horoscope In Telugu: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి.
2022 మే 4 బుధవారం రాశిఫలాలు
మేషం
అనుకున్న పనులు సమయానికి పూర్తికావు. వాహనం కొనుగోలు చేస్తారు లేదంటే పాత వాహన నిర్వహణకు ఖర్చు చేస్తారు. వ్యాపారంలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఇంటి సభ్యులతో సఖ్యత ఉంటుంది. అధికారులు మీతో మంచిగా వ్యవహరిస్తారు. ఈరోజు మీ ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబ బాధ్యతల కారణంగా మీరు ఒత్తిడికి లోనవుతారు. పనికిరాని చర్చలతో సమయాన్ని వృథా చేయవద్దు.
వృషభం
ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. పని ప్రదేశంలో ఆటంకాలు తొలగిపోతాయి. మేధో చర్చల్లో పాల్గొంటారు.వ్యాపారంలో అద్భుతమైన అవకాశాలు లభించే అవకాశం ఉంది.ఆరోగ్ బావుంటుంది. విద్యార్థులకు శుభసమయం.
మిథునం
ఈ రోజు మీకు బాగానే ఉంటుంది. సహోద్యోగుల నుంచి సహాయం పొందుతారు. మీరు ఇతరుల భావాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. కొన్ని అవమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. విద్యార్థులు సక్సెస్ అవుతారు. కెరీర్ సంబంధిత సమచారం పొందుతారు.అనారోగ్య సమస్యలు ఉంటాయి. ప్రయాణం వాయిదా వేసుకోండి.
Also Read: పుట్టింట్లో అవమానాన్ని భరించలేక అగ్నిలో దూకిన పార్వతి, పరమేశ్వరుడు ఏం చేశాడంటే
కర్కాటకం
పనిలో నైపుణ్యత పెరుగుతుంది. కుటుంబంలో సంతోష వాతావరణం ఉంటుంది. వ్యాపారంలో కొన్ని పెద్ద ఒప్పందాలు జరగుతాయి. స్నేహితులతో చర్చించడం వల్ల కొన్ని నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆరోగ్యం జాగ్రత్త, ఆహారం పై నిర్లక్ష్యం వద్దు.
సింహం
ఈరోజు మానసికంగా దృఢంగా ఉంటారు.పెద్దల ఆశీర్వాదం తప్పకుండా తీసుకోండి. మీరు జీవితంలో కొన్ని సానుకూల మార్పులను తీసుకురావడానికి ప్రయత్నించండి. ఉద్యోగులు కార్యాలయంలో శుభవార్త అందుకుంటారు. వైవాహిక జీవితం బావుంటుంది. మంచి వ్యక్తుల పరిచయం మీకు కలిసొస్తుంది.
కన్యా
ఈ రోజు సాధారణంగా ఉంటుంది. స్వయం అధ్యయనం, పఠనం పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు. వ్యాపారులకు ఈరోజు మంచి రోజు . మీ అభిరుచికి అనుగుణంగా కెరీర్‌ను నిర్వహించాలనే ఆలోచన చేయండి. ఫైనాన్స్‌కు సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. వంకరగా ఆలోచించే స్నేహితులున్నారు జాగ్రత్త.
తుల
ఈరోజు పనులు పూర్తవుతాయా అనే సందేహం కలుగుతుంది. చెడు అలవాట్ల కారణంగా మీరు విమర్శలకు గురవుతారు. ప్రేమికులకు మంచి సమయం కాదు.రహస్యాలు ఎవ్వరికీ చెప్పకండి. సబార్డినేట్ ఉద్యోగులను పర్యవేక్షించండి. లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి.
Also Read:అమ్మవారి శరీరంలో 18 భాగాలు పడిన ప్రదేశాలివే, ఒక్కటి దర్శించుకున్నా పుణ్యమే
వృశ్చికం
మీరు తలపెట్టిన పని ఆగిపోవచ్చు. సామాజిక సంబంధాలను మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించండి. మీరు ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. వైద్యుడిని సంప్రదించాల్సి వస్తుంది. కండరాల ఒత్తిడి సమస్య ఉంటుంది. ఇంట్లో ఏదో ఒక విషయంలో గొడవలు రావొచ్చు.
ధనుస్సు
పాత మిత్రులను కలుస్తారు.ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. వైవాహిక జీవితం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ ప్రతిభపై పూర్తి నమ్మకం ఉంచండి. ఎప్పటినుంచో చేతికి అందాల్సిన మొత్తం అందుతుంది. మీరు సృజనాత్మక పనిలో ఆసక్తి కలిగి ఉంటారు. గుర్తుతెలియని వ్యక్తుల వల్ల నష్టం జరగవచ్చు.
మకరం
కార్యాలయంలో మంచి అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. రాజకీయాలపై ఆసక్తి ఉంటుంది. స్టాక్ మార్కెట్ కు సంబంధించిన వ్యాపారంలో నష్టాలు రావొచ్చు. ఈరోజు అస్సలు రుణం తీసుకోకండి. సన్నిహితులు మీపై కోపంగా ఉంటారు. వేరేవారి మాటల్లో తలదూర్చి మీ ప్రియమైన వారిని అవమానించవద్దు.
కుంభం
చేతిలో సరిపడా ఆదాయం లేక ఇబ్బంది పడతారు. ఈ చికాకు మీ పనిపై పడుతుంది. ప్రేమికుల మధ్య వివాదాలు జరుగుతాయి. మీ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రయత్నించండి. సహోద్యోగుల మద్దతు మీకు ఉంటుంది. పిల్లలతో సంతోషంగా ఉంటారు. నూనె పదార్థాలకు దూరంగా ఉండండి.
మీనం
ఈ రోజు చాలా సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో కలిసి ట్రిప్ ప్లాన్ చేసుకుంటారు. పాత గాయాలు మళ్లీ బయటపడి బాధపెడతాయి. కొత్తగా వ్యాపారం ప్రారంభించిన వారు సమస్యలు అధిగమిస్తారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండండి. విద్యార్థులు చదువుపై దృష్టిసారించండి. వ్యాపారులు, ఉద్యోగులకు సాధారణ ఫలితాలుంటాయి.
Also Read: సర్ప దోషాలన్నీ తొలగించే ఆలయం, ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే తెరిచి ఉంటుంది